26, డిసెంబర్ 2016, సోమవారం
ఉండవల్లి గుహాలయాలు
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం
24, డిసెంబర్ 2016, శనివారం
dubsmash
15, డిసెంబర్ 2016, గురువారం
శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి దేవాలయం
పూర్వపు పాలమూరు జిల్లా , ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన రంగనాయక (రంగనాథ) స్వామి దేవాలయం ఇది. వారు తవ్వించిన సప్త సముద్రాలలో (చెరువులు) రంగసముద్రం ఒకటి. ఆ చెరువు ఒడ్డున నిర్మించిన సుందరమైన శిల్ప కళతో అలరారు దేవాలయమిది. చెరువు మధ్యలో రాజుల భవంతి కూడా ఒకటి శిథిల దశలో కనిపిస్తుంది. దీనిని కృష్ణ విలాస్ అని పిలిచేవారు. ఒక్కసారి ఆ దృశ్యాలపై ఓ లుక్కేయండి.
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం,
పాలమూరు దేవాలయాలు
13, డిసెంబర్ 2016, మంగళవారం
7, డిసెంబర్ 2016, బుధవారం
2, డిసెంబర్ 2016, శుక్రవారం
నా చిత్రాలు
లేబుళ్లు:
చిత్రలేఖనం,
నా వీడియోలు
30, నవంబర్ 2016, బుధవారం
ఎప్పుడు మారుతార్రా మీరూ?
సిద్ధాంతం -
పరిధులు దాటిన పైత్యం
మతంపై యుద్ధం -
ఒంటి కన్ను సూత్రం
శత్రు దేశంతో యుద్ధం -
పనికిరాని తంత్రం
అంతర్గత పోరుకు -
సదా ఎప్పుడు సిద్దం
దేశభక్తి
దేహ భుక్తి
సైనికుడు
చీడ పురుగు
దేశ ద్రోహి
వీరభక్తుడు
మానవ హక్కులు
మనకే
పౌర విధులు
హుళ్ళక్కే!
నాది మాత్రం సత్యం
మిగతాదంతా మిథ్యా !
పరిధులు దాటిన పైత్యం
మతంపై యుద్ధం -
ఒంటి కన్ను సూత్రం
శత్రు దేశంతో యుద్ధం -
పనికిరాని తంత్రం
అంతర్గత పోరుకు -
సదా ఎప్పుడు సిద్దం
దేశభక్తి
దేహ భుక్తి
సైనికుడు
చీడ పురుగు
దేశ ద్రోహి
వీరభక్తుడు
మానవ హక్కులు
మనకే
పౌర విధులు
హుళ్ళక్కే!
నాది మాత్రం సత్యం
మిగతాదంతా మిథ్యా !
29, నవంబర్ 2016, మంగళవారం
ఏది అరాచకం ?
ఆంధ్రజ్యోతి
రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ శీర్షికన ‘ఇంత అరాచాకమా? పేరిటి రాసిన ఎడిటోరియల్ చదివాకా, ఆయన అభిప్రాయాలకు, ప్రశ్నలకు నా సమాధానాలు... నా అభిప్రాయాలలోకి వెళ్లేముందు, నేను ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మద్దతుదారుణ్ణే కానీ, ప్రధానికి గానీ, ఆయన పార్టీకి గానీ
మద్దతు దారున్ని కాదు. ఇక రాధాకృష్ణ
గారు వేసిన ప్రశ్నలకు నాలాంటి అతి సామాన్య దిగువ స్థాయి వ్యక్తులు కూడా సమాధానాలు
చెప్పగలరనే ఉద్దేశ్యంతోనే ఈ సమాధానాలు చెప్పే ప్రయత్నం. ఆయన గారి అభిప్రాయాలు...నా
సమాధానాలు
1. ప్రత్యామ్నాయ
నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం
ప్రధానమంత్రికి ఉందా?
• ఏ నోటుకు ప్రత్యామ్నాయం? ఏ నోటు చెల్లకుండా పోయింది? ఆధాయ పన్ను ఎగేసిన
నల్ల నోటుకా? న్యాయబద్దమైన నోటు మార్పిడికి
అవకాశం ఉంది కదా! మన దగ్గర అన్ని రూపాలలో పోగేసిన చట్టబద్దత లేని డబ్బుకంతా ప్రత్యామ్నాయం అడుగటం సమంజమేనా?
2. అటు ప్రధాని ఇటు
ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది.
• ప్రజలు ఇప్పుడు కొంత కష్టం కలిగి కంటతడి పెట్టుకుంటున్న మాట వాస్తవమే. ప్రజలతో పాటు ప్రధాని కూడా కంట తడిపెడుతున్నారు అని
చెప్పినప్పుడు...ప్రజల ఏడుపులో(ఏ ప్రజలో ఇది మరో ప్రశ్న ) నిజాయితీని చూసిన
రాధాకృష్ణ ప్రధాని ఏడుపులోని నిజాయితీని కూడా అంగీకరించినట్లే కదా!
3. డబ్బున్న వాడిపై
డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం
ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో
భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
• అధికారంలో ఉన్న వాడిపై అధికారం లేని
వాడికి కోపం ఉండటం రాజకీయనాయకుల సైకాలజీ అన్న మాటను RK అంగీకరిస్తాడా? డబ్బు ఉన్న
వాడిపై డబ్బు లేని వాడు ఏడిస్తే (నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని ఏడ్చే వాళ్ళకు)
భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాలేమిటో పనిలో పనిగా సెలవిచ్చి ఉంటే మా బోటి
అజ్ఞానులం కోందరమైనా మారే వాళ్ళమే. నల్ల ధనం ఉన్న వారు చచ్చారు అని సంబరపడి పోకండి అని హెచ్చరించడంలో RK ఎటు వైపో అర్థం కావటం లేదా? ఆ ధ్వనిలో అర్థం స్పష్టం కావటం లేదా?
4. అవినీతి ఇవ్వాళ
కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు.
• ....అంటే ఇది ఇలాగే
ఉండాలా? అంతం ఉండొద్దా ?
5. మన దేశ ఆర్థిక
వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు
అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత
ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని
రంగాలూ దెబ్బతిన్నాయి.
• ఈ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అంతకు మించిన సిగ్గేస్తుంది. దేశానికి, రాష్ట్రాలకు రాబడి రావడమే ముఖ్యమా? వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడమే ముఖ్యమా? అది ఏ రూపానా? ఏ మార్గానా? అన్నది అక్కరలేదా? అదే అవునైతే...
ఇన్ని బడు లెందుకు? ఇంతమంది ఉపాధ్యాయులెందుకు? ఇన్నిన్ని జీతాలెందుకు? ఇన్ని నీతి
సూత్రాలెందుకు? బడి ఉన్న ప్రతి చోటా ఓ సారా
దుకాణమో! ఓ నల్ల మందు అంగడో! ఏ వ్యభిచార కొంపో! ప్రభుత్వాలు పెట్టుకుంటే రాబడి
రాదా? పెట్టుబడి మిగిలిపోయి, రాబడులు పెరిగిపోయి ప్రభుత్వాలు ఇక అన్ని రంగాలను 3 పువ్వులేమి కర్మ 6 పువ్వులకు 90 కాయలు కాయించగలదు. దీనికి RK ఒప్పుకుంటాడా?
6. పెద్ద నోట్ల
రద్దు కారణంగా ఒక్కసారిగా తమ ఆస్తుల విలువ పడిపోయిందని బాధపడుతున్న వారికి ఉపశమనం
ఎవరు కలిగిస్తారో చెప్పాలి.
• ఉన్న ఆస్తికి విలువ పడిపోయినప్పుడు, కొనదలచుకున్న ఆస్తి విలువ కూడా అంతే అన్న సత్యం బోధపడదా? ఇప్పుడు ఆస్తిపరులకు ఉపశమనం మాట సరే. ఆ మాత్రం ఆస్తి కూడా లేని
పేదలకు ఇన్నాళ్ళు ఎవడైనా ఉపశమనం కలిగించాడా? అందులో శతాంశామైనా ఆస్తిని కూడ గట్టుకోగలమనే భరోసా ఇచ్చారా? “నల్లధనం ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు
సంబరపడుతున్నారు” అని RK అనగాలిగాడంటే ఇప్పుడు ఆ పని ప్రధాని చేసినట్లే నని RK అంగీకరించగలడా?
7. ఏ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను ముద్రించారో చెప్పాలి.
తాత్కాలిక నోట్ల
సర్దుబాటుకు/మార్పిడి కని సామాన్యుడికి సైతం అర్థమైంది. RK కు అర్థం కాలేదంటే విడ్డూరమే. 4 ఐదు వందలకు 1 నోటు, 2 వేయి నోట్లకు 1 నోటుతో సర్దుబాటు
చేయడం, ముద్రణకు, సరఫరాకు ఎంతో ఉపయోగపడుతుందనే. కాలక్రమేణా అంతర్ధాన మవుతుందని
చెబుతున్నా అదే ప్రశ్న వేయడంలో అర్థమేమిటో వేసేవారికే తెలియాలి.
8. దేశంలో ఇకపై
నల్లధనం ఉండబోదని ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరా?
• ఇకపై ఉంటుంది కాబట్టి, ఇప్పుడూ ఉండనీయమనడమా దీనర్థం. నీతి మంతుడిని మాత్రమే కనగలనని ఏ తల్లైనా హామీ ఇవ్వగలదా? కనడం, నిజాయితీగా పెంచడం, కలలు కనే వరకే తన బాధ్యత. ఆ తరువాత ఏమవుతాడన్నది వాడి ప్రవర్తనే
నిర్ణయిస్తుంది. ఏ తల్లైనా అవినీతి పరుడిగా కొడుకును పెంచాలని కలలు కంటుందా? అయినప్పటికీ ఈ దేశంలో ఇంత మంది అవినీతి కొడుకులు ఎలా తయారు కాగలిగారో అర్థం కావడం లేదా?
9. ఇప్పుడు తాజాగా
బంగారం కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించాలని కేంద్ర
ప్రభుత్వం
ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మహిళలు తిరగబడతారు.
*“అక్రమ సంపాదన పోగేసుకున్నవారెవ్వరూ
తమ ఇళ్లలో నగదును సూట్‌కేసులలో దాచిపెట్టుకోరు. భూములు, భవనాలు, బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెడతారు.” అని అనే RK నే అట్లాంటి ఆస్తి విలువ తగ్గిందని ఒక చోట బాధపడుతాడు. ఆ నల్ల ధనంతో కొనే బంగారుపై ఆంక్షలు విదించొద్దని కోరుతాడు. ఇదేమి ద్వంద్వ నీతో అర్థం
కాదు.
10. పచ్చిగా
చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
• ఇందులో మొదటిది... అవకాశం ఇచ్చినవాడిది తప్పా? అది సద్వినియోగం చేసుకోలేని వాడిది తప్పా? రెండోది మొదటి దాని కన్న అర్థవంతమైనది. ఆవశ్యకమైనది.
11. నల్లధనాన్ని
నిజంగా అరికట్టాలన్న ఉద్దేశం ప్రధానమంత్రికి ఉంటే దుందుడుకు నిర్ణయాలు తీసుకునే
బదులు ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.
• ఒక పత్రికాధినేతగా, ఛానెల్ అధిపతిగా ఆ ఉద్దేశ్యంలో నీకు భాగస్వామ్యం లేదా? నీవు, నీ తోటి అధిపతులు ఏ చర్యలు
తీసుకున్నారో చెప్పండి. ఆ ఆచరణ సాధ్యమైన నిర్ణయాలెంటో సూచించండి.
12. పెద్ద నోట్ల
రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యక్తి తీసుకున్న
నిర్ణయం.
• ఒక ఆర్ధిక నిపుణుడు రాజ్యంగా
బద్దంగా ఈ దేశాన్ని 10 సంవత్సరాలు
మౌనంగా ఏలిన కాలంలో, ఒక రాజ్యాంగేతర శక్తి తెరవెనుక నిర్ణయాలు తీసుకుంటుందని అప్పటి ప్రతిపక్షం ఏడ్చినప్పుడు ప్రశ్నించని మీడియాకు, రాజ్యంగ బద్దంగా ఎన్నికై ఏలుతున్నవాడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఏక పక్షమని ఏడుస్తుందేం?
----ఎన్. జయన్న
27, నవంబర్ 2016, ఆదివారం
అన్నా!
అన్నా!
నాకు కుల వ్యవస్థపై విశ్వాసం లేదు.
నా కులంపై కూడా నాకు మోజు లేదు.
నీవు నా కులం కూడా కాదు
నీ గురించి మాట్లాడటం వలన నాకొరిగేది లేదు.
అయినా చెబుతున్నా ...
నీవంటే విపరీతమైన గౌరవం
అంతకు మించిన అభిమానం
అన్నా!
ఎక్కడ మోగించావో గానీ
తోలు తప్పెడ పైన మోత
ఊరూరా దండోరై మోగింది పో...
చెప్పుకోవడానికే సిగ్గుపడే కులం
పేరు పక్కన దర్జాగా నిలబడింది పో...
నీ పిలుపు విన్నాకా,
ఊర్లల్లో రెండు గ్లాసులు ఒక్కటయ్యాయి
వెలివాడల్లో వెలుగులు నిండాయి
రెండు దశాబ్దాల సంది
ఒక కులం కోసం పోరాడినవాడు
నీవు కాకా ఇంకొకడున్నాడా దేశంలో
నిన్ను శూరుడు, దేవుడు అని అనలేను కానీ,
నీవు కులం కోసం పుట్టిన అంబేద్కర్ వే
జాతి నుద్దరించిన పూలే వే
అందుకే
నీ ధర్మ యుద్ధం
విజయం సాధించాలని
కోరుకుంటున్నా
--ఎన్. జయన్న
23, నవంబర్ 2016, బుధవారం
నేటి భారతం
31, అక్టోబర్ 2016, సోమవారం
Pragatoor fort
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం,
మా పాలమూరు కోటలు
25, అక్టోబర్ 2016, మంగళవారం
koilkonda fort
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం,
మా పాలమూరు కోటలు
18, అక్టోబర్ 2016, మంగళవారం
moharram@garlapad
3, అక్టోబర్ 2016, సోమవారం
Jai Gadwal District
18, ఆగస్టు 2016, గురువారం
A travel on the river
గద్వాల మండలంలోని లంక గ్రామమైన గుర్రంగడ్డ నుండి బీరెల్లికి కృష్ణానదిలో ప్రయాణం చేస్తూ, శ్రమజీవులు ఆలపించిన పాట
24, జులై 2016, ఆదివారం
ప్రకృతి ఇచ్చిన పాటగాడు -కొండన్న
తెలంగాణలో వెనుకబడిన జిల్లా గా పేరుబడిన పాలమూరు జిల్లాలో, కొండల నడుమ ఓ మారుమూల పల్లె అది. పేరు పెద్దగూడెం. వనపర్తికి అందెంతా దూరంలోనే ఉన్నా, నాగరికతకు ఇంకా అందనంత దూరంలోనే ఉన్న ఊరది. ఆ ఊరిలో బడి మొఖం కూడా చూడని వాడు. అక్షరాలు అసలే దిద్దని వాడు. గొర్రెలే లోకంగా బతుకుతూ , గొర్రెల వెనుకాలే నడుస్తూ, లోకం గురుంచి పెద్దగా తెలియని ఓ మామూలు మనిషి, గొర్రెల కాపరి, ఇప్పుడు తెలంగాణా అంతటా పాటై మొగుతున్నాడు. అతనే కొండన్న. అసలైన వాగ్గేయకారుడు. జానపద గాయకుడు.
వేపూరి హనుమద్దాసు నుండి గోరటి వెంకన్న వరకు లెక్కలేనంత మంది వాగ్గేయకారులను తెలంగాణాకు, తెలుగు నేలకు అందించింది పాలమూరు. ఎంతో మంది విశ్వవిద్యాలయాలలో పరిశోధక పట్టాలు పొందటానికి భూమికైంది. అయితే చాలా మంది వాగ్గేయకారులకు కొండన్నకు ఉన్న ప్రధానమైన భేదం, కొండన్నకు అక్షరం ముక్క కూడా రాకపోవడం.
అక్షరాలు రానివాడు పాటలు అల్లుకోవడం, వాటికి బాణీలు కట్టుకోవడం, తానే పాడుకోవడం వంటి పనులు అసలైన జానపద గాయకుడిగా కొండన్నను నిలబెట్టాయి. చాలా మందిలాగా కొండన్న బతకడం కొరకు తన పాటను అమ్ముకోలేదు. బతుకునిచ్చే గొర్రెలను అమ్ముకొని తన పాటను నిలబెట్టుకున్నాడు. కపటం తెలియని పల్లె దనానికి ప్రతీక కొండన్న.
ప్రకృతిలో కలిసిపోవడం, ప్రకృతికి మురిసిపోవడం కొండన్న కు తెలిసిన విద్య. అందుకే కొండన్న ప్రకృతి ఇచ్చిన పాటగాడు. కొండన్న పాట, కొండన్నతో పాటే పెరిగింది. చిన్నప్పటి నుండి గొర్లను దీసుకొని అడవికి వెళ్ళడం. అడవిలో కనిపించే ప్రతి చెట్టు, పుట్టా, గట్టు, వాగు, వంకా , పక్షులు , జంతువులూ అన్నిటిని పలకరిస్తూ కూనిరాగాలు తీయడం అలవాటై పోయింది. క్రమంగా అదే పాటై పోయింది. పొద్దున్న ఆకలిగొన్న మేకలను, గొర్లను అడవికి తీసుకరావడం, సాయంత్రానికి వాటిని కడుపు నింపుకొని, తాను పాటను గొంతు నింపుకొని ఇంటికి రావడం కొండన్నకు మామూలైపోయింది. ఇంటికొచ్చిన పాటను తమ్ముడు ఆంజనేయులు చెవిలో వేస్తె , తమ్ముడు పేపర్లో వేసేవాడు. అట్లా అవి పాటలుగా రూపుదిద్దుకొన్నవి.
చిన్నప్పటి నుండి కొండన్న గొంతు పాటలను మోస్తూనే ఉన్నా వాటిని పల్లకీ లేమి భుజానికె త్తుకోలేదు . మొదట్లో వాటికి చీత్కారాలు తప్పలేదు. వెక్కిరింతలు వదలలేదు. జనాలు పిచ్చివాడిగా జమకట్టిన రోజులూ లేకపోలేదు. జన జీవన వేదానికి భాష్యం చెప్పిన వేమనంతటి వాడినే పిచ్చివాడిగా జమకట్టిన లోకం మనది. కొండన్న ఓ లెక్క . కొండన్న పాట గొంతు నుండి పేపరు మీదికి సులభంగానే చేరింది. కాని పేపరు నుండి డిస్క్ మీదికి రావడానికి పెద్ద యుద్దమే జరిగింది. తనకు ఆనందానిచ్చే పాట లొక వైపు, కుటుంబానికి బతుకునిచ్చే గొర్లు ఒక వైపు. తాను పాటల వైపు. కుటుంబం గొర్ల వైపు. మధ్య గోడ, గొడవ, అలక, ఆకలి. అయినా కార్య సాధకులు ఆటంకాలకు లొంగిపోతారా? పోరు కాబట్టే మనమిట్లా కొండన్న గురించి మాట్లాడుకొంటున్నాం. మందలో కొన్ని గొర్లు లారెక్కి వెళ్ళిపోయాయి. 30 వేలు చేతిలో వాలిపోయాయి. అంతే నవ్వుల తెలంగాణ , ఎండిన పాలమూరు నేల తల్లి, చినబోయిన చిలుకమ్మా, అన్న గంగన్నా, తూర్పు కొండల్లో మల్లన్న, అందమైన గువ్వా అన్నీ పాటలై సిడిల మీద పరుచుకున్నాయి. గూడెం దాటి, కొండలు దాటి తెలంగాణా అంతటా మారుమోగాయి. టీవీ కెమెరాలన్ని గూడెం చేరుకున్నాయి. కొండన్న పాదాలకు టీవీ స్టూడియోలన్ని కార్పెట్ పరిచాయి. ఇంత జరిగినా గొర్లను కొండన్న వదలలేదు. పాట కొండన్నను వదలలేదు. ప్రకృతి పాటను వదలలేదు. చిత్రమేమంటే కొండన్న తల్లిని కన్నీళ్ళూ వదలలేదు. బువ్వ పెట్టె గొర్లు పోయినాయని దుఃఖంతో మొదట, తన కొడుకు జనం మెచ్చిన పాటగాడైనాడని ఆనందంతో ఇప్పుడు...అంతే...
--నాయుడుగారి జయన్న

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
లేబుళ్లు:
పాలమూరు కవులు,
వ్యక్తులు
25, జూన్ 2016, శనివారం
ఈ పాపం ఎవ్వరిది?
తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని పంచి ఇస్తే, పిల్లలు తల్లిదండ్రులను పంచుకున్నారు. ఎవరి వంతుకు వచ్చిన వారిని వారే బతికినంత కాలం చూసుకోవాలని షరతు విదించుకున్నారు కొడుకులు.
మరి ఆ తల్లిదండ్రులకు ఈ కొడుకులు ఇచ్చిన బహుమతి ఏమిటి? తెలుసుకోవాలా?! ఒక్కసారి కథా జగత్ లోకి అడుగేసి, నే రాసిన కథ ఈ పాపం ఎవ్వరిది? చదవండి. మీ అభిప్రాయాలు చెప్పండి.
3, జూన్ 2016, శుక్రవారం
నే చెప్తా బ్రదర్!
"పవర్ స్టార్...పవర్ స్టార్...పవర్ స్టార్"
గత కొంతకాలంగా మెగా ఫంక్షన్‌లలో (కేవలం మెగా ఫంక్షన్‌లలోనే సుమా! వాడెవడో
టుమిడిగాడు మరేదో అన్నట్లు గుర్తు...ఆ విషయం తరువాత మాట్లాడుదాం) హోరెత్తిపోతున్న పిలుపు.
"పవర్ర్...పవర్ర్ర్ ..పవర్ర్ర్ర్ ....అన్నావ్ ! ఇప్పుడేమైంది నీ పవర్ర్ర్..?!" అదేదో రేసు గుర్రమో! పీసు గాడిదో! సినిమాలోనో హీరో వ్యంగ్యంగా విలన్‌తో అంటాడు.
వీలు చిక్కినప్పుడల్లా అభిమానులు అట్లా అభిమానం చాటుకొంటే, ఈ హీరో ఇట్లా తన ఇరిటేషన్‌ను తీర్చుకుంటాడన్నమాట.
***
మరో సినిమాలో...
"ఎదుటోన్ని ఎదురుకోవాలంటే కావల్సింది బ్రాండ్ కాదు. దమ్ము! అది టన్నులు టన్నులు ఉంది చూస్తావా!" తన....మొఖంతో సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన ఈ హిరోని ....స్టార్ ని చేసింది బ్రాండు కాదు తన టాలెంటే అని గొప్పగా నమ్మి చెప్పిన డవిలాగు .
"ఇట్లా చేస్తే దమ్ము పోయి దద్దమ్మల్లా మిగులుతారు. జాగ్రత్తా!" మరో హీరో ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్.
అడిగినంతా డబ్బు పెట్టే నాన్నా. గుప్పిట్లో థియేటర్లు. నిరంతరాయంగా ప్రచారం. వక్రమార్గాల్లో
పాపులారిటీ సంపాదనా ( ఫేక్ అకౌంట్ల తో ఫేస్ బుక్ లైకులు, ఒకే రోజు ముప్పై వేల ఆన్ లైన్ ఫేక్ ఓట్లు వగైరాలన్నమాట) అవసరమైతే అణగదొక్కటం తదితర అస్త్రాలతో వరుసగా మూడు హిట్లు(పాపం వాళ్ళూ వీటిని ఇట్లాగే అనుకొంటారు). ఇంకేముంది హీరో గారి తలకు పొగరు బ్బాగా...వచ్చేసింది. ఇక విజయ యాత్రలకు బయలుదేరాడు.
***
మరో వేదిక...అదే హోరు...అదే ఇర్రిటేషన్...
సంకల్పితంగానో,అసంకల్పితంగానో, నోటి దురుసుతోనో, మరేదో కారణంతోనో నోటి నుండి "చెప్పను బ్రదర్" అన్న మాట వచ్చేసింది.
"మహోన్నత శిఖరం గురించి మట్టి దిబ్బలు మాట్లాడితే ఎంత? మాట్లాడకపోతే ఎంత?! " అంతే వేగంగా కౌంటర్ ఇచ్చారు అభిమానులు. తరువాత సామాజిక మాధ్యమాలలో ఒకటే రగడ.
తిరిగి మరో వేదిక మీద పాపం ఆ హీరో గారు ఆ అభిమానులకు గీతోపదేశం చేశాడు(తాననుకుంటాడు). "మీ ప్రవర్తన ఏమి బోగోలేదు"(తనది బాగున్నట్లు). ఎవరి కారణంగా మేమంతా ఈ స్థాయికి ఎదిగామో వారికి కూడా ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంది (ఇక్కడ హీరో గారు దమ్ము మరిచిపోయి బ్రాండ్ గుర్తు చేసుకోవడం వింత). ఇతర హిరోలు వచ్చినప్పుడు కూడా మిరిట్లా ఇబ్బందికి గురిచేయడం మరి బాగోలేదు. (అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అభిమానులు. ఏ మెగా హీరో ఫంక్షన్‌లోనో, మెగా హీరోను అభిమానించే హీరో నితిన్ ఫంక్షన్‌లోనో, మెగా డాటర్ ఫంక్షన్లోనో మాత్రమే, అంటే మెగా బ్రాండ్ ఫంక్షన్‌లో మాత్రమే అభిమానంతో అడిగి ఉంటారు. హీరో ప్రభాస్‌ను ఇబ్బంది పెట్టలేదా? అని అంటారా? అదేగదా చెప్పింది. ఆయన వొచ్చింది కూడా మెగా హీరో ఫంక్షన్‌కే కదా! రెండు దశాబ్ధాల పాటు ఏకచక్రాధిపతిగా సినీ రంగాన్నేలిన ఓ పెద్ద హీరో, ఆయన వారసత్వంతో వచ్చిన ఓ అరడజన్ మంది హీరోలు ఉండగా మరో హీరో అవసరమా? ఆ డైరెక్టర్ గారు ఇలా కసి ఎందుకు తీర్చుకున్నాడో ఈ ముద్దపప్పుకు తెలియకపోవచ్చుగాని అభిమానులకు తెలియదనుకోవాలా? ఇవన్ని అభిమానుల ప్రశ్నలు. హీరోల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికే పిల్చామని ఎవరన్నా, అదే సుహృద్భావంతో రెండు మాటలు చెబితే బంధం మరింత బలపడుతది కదా! అని అభిమానులు. ఇట్లా కొన్ని ప్రశ్నలు, మరి కొన్ని సమాధానాలు, ఒకవైపు అభిమానాలు, ఆవేశాలు, మరో వైపు ఉపదేశాలు అన్నీ జరిగిపోయాయి.
ఇదంతా నేపథ్యం. ఇక అసలు విషయానికొస్తే... అభిమానుల మనస్తత్వమేమిటి? ఎప్పుడు ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటారు? ఎప్పుడు ఎవరిని పక్కనబెడతారు? ఎప్పుడెవరి పక్షం చేరుతారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే మీకు కొన్ని ఉదాహారణలు చూపాలి...
అది పంతొమ్మిది వందల ఎనభై మూడు....
(సశేషం)

అవి ఇవి,
మెగా కబుర్లు,
సినిమా
25, మే 2016, బుధవారం
వెల్లాల సదాశివశాస్త్రి
వెల్లాల
సదాశివశాస్త్రి (1861-1925)
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని
అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి
శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేసారు.
రచనులు
1. వెలుగోటి
వంశచరిత్రము
2. సురభి
వంశచరిత్రము
3. ఆంధ్రుల
చరిత్ర - విమర్శనము
4. వీరభద్రీయ
ఖండనము
5. కంఠీరవ
చరిత్రము
6. రామచంద్ర
చరిత్రము
7. నామిరెడ్డి
చరిత్రము
8. యతినిండా
నిరాకరణము
9. రామానుజ గోపాల విజయము
10. ఆంధ్ర
దశరూపక విమర్శనము
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పాలమూరు కవులు
21, మే 2016, శనివారం
కాశీం
కాశీం తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి. వృత్తిరీత్యా విశ్వవిద్యాలయాచార్యులు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించాడు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊతనిచ్చాడు.
స్వస్థలం
మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతానికి చెందినవాడు. నిరుపేద దళిత
కుటుంబంలో జన్మించాడు.
వృత్తి జీవితం
కాశీం మొదట్లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.
రచనలు
1. పొలమారిన పాలమూరు
2.నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్నా
3. తెలంగాణ ఉద్యమాలు-పాట
4. తెలంగాణ సాహిత్యం
5.
'పొలమారిన పాలమూరు ' రచనను 2003 లో వెలువరించాడు. ఇది పాలమూరు జిల్లాలోని తీవ్రమైన కరువు నేపథ్యంలో వెలువరించిన దీర్ఘకవిత. 2003 లో పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని టౌన్ హాలులో నిర్వహించిన 'పాలమూరు గోస ' కవి,గాయక సమ్మేళనంలో ఆవిష్కరించి, వినిపించాడు.
కాశీం కవిత్వంపై వ్యాఖ్యలు
కాశీం కవిత్వంపై పలువురు రచయితలు, ఆయన ఉద్యమ సహచరులు పలు వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో కొన్ని...
* నాళేశ్వరం శంకరం: "కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ.
* ఎండ్లూరి సుధాకర్: "అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చింది."
* నందిని సిధారెడ్డి: "ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుంది. ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడు.
వరవరరావు:"కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది."
ఇటీవల వార్తల్లో
కాశీం ఇటీవల వార్తల్లో నిలిచాడు. తెలంగాణ ప్రభుత్వం అతనిపై రాజద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.
విప్లవ రచయితల సంఘం 25 వ మహా సభల్లో... 'రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం' అనే అంశం పై కాశీం ఉపన్యాసం.

9, మే 2016, సోమవారం
సమస్యా పూరణం
శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: 22.02.2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ.....
ఆ. ముద్దపప్పు లోన శుద్ధ నెయ్యి గలిపి
ముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
ఆవకాయ దినిన నమరుడగును
ముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
ఆవకాయ దినిన నమరుడగును
లేబుళ్లు:
పద్యాలు,
సమస్యా పూరణలు
8, మే 2016, ఆదివారం
సమస్యా పూరణ
శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: 04.05.2016 నాడు ఇచ్చిన సమస్య కు
నా పూరణ....
ఆ. కన్న బిడ్డ పెళ్ళి కంటను కదలాడ
అప్పు చేసి వేయ పప్పు పంటకలిసి రాని దైన కాల మిచ్చిన తాలు
ధాన్యము గని రైతు తల్లడిల్లె
లేబుళ్లు:
పద్యాలు,
సమస్యా పూరణలు
7, మే 2016, శనివారం
సమస్యా పూరణం
శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: ౦౩.05.2016 రోజు ఇచ్చిన సమస్య(2022 /03.05.2016) కు నా పూరణ-
కం. కోపముననో! ఘన మునుల
శాపమునో! పరుల భాష చపలత్వమునో!,తాపమునో! యిపుడు తెలుగు
దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్
లేబుళ్లు:
పద్యాలు,
సమస్యా పూరణలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)