21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మా పాలమూరు కవులు -కేశవపంతుల నరసింహశాస్త్రి



మహబూబ్ నగర్ జిల్లా మానోపాడు మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన కేశవపంతుల నరసింహశాస్త్రి గారు ఆకాశవాణి రేడియో కార్యక్రమం సంస్కృత పరిచయం ద్వారా కె,ఎన్.శాస్త్రిగా సుపరిచితులే. వీరు రామలక్ష్మమ్మ, తిప్పాజ్యోసులకు 14.07.1919 లో జన్మించారు. ఏడు దశాబ్దాల జీవితాన్ని గడిపిన శాస్త్రి 02.01.1991 లో మరణించారు.

చదువు         

శాస్త్రి విద్వాన్, శిరోమణి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. గీర్వాణ భాషలో అపార పండిత్యాన్ని సంపాదించారు. 
సాహితీ కృషి
కేశవపంతుల నరసింహశాస్త్రికి  చిన్నతనంలోనే ఆశు కవితాధార అబ్బింది.  పదహారు సంవత్సరాల వయసులోనే  వనపర్తి రాజుల పూర్వపు రాజధాని అయిన [[శ్రీరంగాపురం]]లోని శ్రీరంగనాథస్వామి ఉత్సవాల సందర్భంగా విర్వహించే కవిగాయక సభలలో పాల్గొని, నాటి రాజు తృతీయ రామేశ్వరరావుపై పద్యాలు వినిపించి, మెప్పు పొందాడు. నాటి నుండి మొదలుకొని సుమారు దశాబ్దం పాటు ప్రతియేడు ఆ సభలలో పాల్గొని వార్షిక సన్మానాలు పొందిన కవివరేణ్యులు.
మహబూబ్ నగర్ జిల్లాలో సాహితీ పోషణలో పేరెన్నికగన్న గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు తదితర సంస్థానాలలో కూడా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి గౌరవ సత్కారాలు పొందాడు. శాస్త్రి ప్రౌడకవిగానే కాకా  సద్విమర్శకులు  కూడా. రఘువంశంపై వీరి వ్యాఖ్యానం వీరి విమర్శనా ప్రతిభకు గీటురాయి. ప్రబంధ పాత్రలు అను వీరి రచన సాహిత్య శాస్త్రంలో వీరెంత ప్రవీణులో, వీరికెంత సూక్ష్మపరిశీలనా శక్తి ఉందో తెలియజేస్తుంది. ' సంస్థానాలు- సాహిత్య పోషణ ' అను వీరి గ్రంథం సంస్థానాలతో వారికిగల పరిచయాన్ని, అనుబంధాన్ని తెలియజేస్తుంది.
శాస్త్రిగారు కవి, విమర్శకులే కాదు గొప్ప వక్త కూడా. గంభీరస్వరంతో పద్యాలను ధారాళంగా పాడుతూ గంటలకొద్ది ఉపన్యసించేవారట.
 రచనలు
ముద్రిత రచనలు
* బాలబ్రహ్మేశ్వర సుప్రభాతం
* రత్నలక్ష్మీ శతకం
* ప్రబంధ పాత్రలు
* సంస్థానాలు - సాహిత్య పోషణ
* త్యాగధనులు
* రఘువంశ వ్యాఖ్యానం
 అముద్రిత రచనలు
* హనుమత్సందేశం
* ఉదయ సుందరి
* మధుర నిశీథం
* మంగళ సూత్రం
* సూర్యనారాయణ శతకం

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి