5, డిసెంబర్ 2022, సోమవారం

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

 *🏵️పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు*

•••••••••••••••••••

ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు   


అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.


అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది


March-May  15%


Jun-Aug 45%


Sep-Nov  75%


Dec-Feb 100%


అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో


కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.


ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.


ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.


 కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.


ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచో


ఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.


*DDO లకు సూచనలు*

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)


DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.


లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)


DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.


TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు


ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.


TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.


ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.


పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు.

10, ఏప్రిల్ 2022, ఆదివారం

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

 

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపర సౌలభ్యం కోసం పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాల భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకొని గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ సాహిత్య చరిత్రలను రాయించింది. అవి కొంత మేరకు ప్రయోజనాన్ని కలిగించడమే కాకుండా ముందు ముందు జరగాల్సిన కృషికి బాటలు వేశాయి. ఆ కోవలోనే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు నూతన జిల్లాల ప్రాతిపదికన కేవలం సాహిత్యంతోనే ఆగిపోకుండా, జిల్లాలకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాలని సంకల్పించింది. ఆ  ప్రయత్నంలో భాగంగా తెలంగాణ 33 జిల్లాల నుండి వెలువడిన మొదటి గ్రంథమే జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం.  ఇందులో జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, కళలు, పర్యాటకం, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉద్యమాలు – ఉద్యమకారులు, జిల్లా పద్య, గేయ, వచన కవిత్వాలు, కథ, నవల, నాటక వికాసాలు వంటి    ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సంస్థానాలు – చరిత్ర, సాహిత్య పోషణ వంటి అనేక విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ ఎవరో రాజధానిలో కూర్చొని ఉద్దండులైన రచయితలు రాసిన వ్యాసాలు కావు. ఆయా జిల్లాల సమగ్ర చరిత్రను ఆయా జిల్లాల రచయితల చేతనే రాయించాలనే ఓ గొప్ప ఆశయానికి అక్షరరూపం ఈ గ్రంథం.  జోగులాంబ గద్వాల జిల్లా విషయాలు, విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సహం కలిగిన ప్రతి ఒక్కరు చదవదగిన పుస్తకం.

ప్రతులకు...

తెలంగాణ సారస్వత పరిషత్తు

తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ -500 001.

పోన్. 24753754

- నాయుడు గారి జయన్న



20, మార్చి 2022, ఆదివారం

దత్తపది..

 కలము, మలము, జలము, పొలము 


సకలము తనకే యనక కొంత యిచ్చు కో

మలము కలిగి నట్టి మంచి మనిషి

పూజల మునుగకనె పుణ్యఫలము నొందు

అనె వినోబ పొలము దానమడిగి

11, మార్చి 2022, శుక్రవారం

న్యస్తాక్షరి: బ్ర -హ్మ - చా - రి

 బ్రహ్మచారిగాను బ్రతుకును గడుప, బ్ర

హ్మయ్య గీసె  నుదుట మాయగీత

చాలటంచు నొకడు కలత చెంది, మరి ప

రిణయమున్ జరుగక ప్రాణ మిడిచె