జొన్నవాడ రాఘవమ్మ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ప్రముఖ కవయిత్రి. నవాబుపేట మండలం, కేశవరాయునిపల్లి ఈమె స్వస్థలం. 1928లో ఆమె జన్మించింది.
ఈమె భర్త వేదాంతాచారి. 1970 ప్రాంతంలో ఈమె రచించిన అనేక లలితగీతాలు, దేశభక్తి గేయాలు, జానపదగేయాలు,
భక్తిగీతాలు, ఆకాశవాణిలో ప్రసారమయ్యి, విశేష ప్రజాదరణ పొందాయి. వీరు రాసిన అనేక గీతాలను మహా
భాష్యం చిత్తరంజన్ గారు స్వరపరిచారు. చిన్ననాటి నుండి భారతం, భాగవతం, రామాయణం వంటి
గ్రంథాలను నిత్యపారాయణం చేసేది. ఈ అలవాటే ఆమెను లలిత, భక్తిగీతాల రచయిత్రిగా
మార్చివేసింది. ఆమె 1972లో 48 గేయాలతో
రాధికాగీతాలు గ్రంథాన్ని వెలువరించారు.
వీటికి మరికొన్ని
గేయాలను చేర్చి 2006లో ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు. 2014లో భావతరంగాలు పేరుతో ఆమె మరో గ్రంథాన్ని వెలువరించారు. అనేక సాహితీ సంస్థలు వీరి సాహితీ కృషికి
పలు సత్కారాలను అందించాయి. 2015 జనవరి 6 వ తేదిన ఆమె మరణించారు.
రచనలు
# రాధికాగీతాలు(1972),(2006)
# భావతరంగాలు(2014)
కొన్ని లలితగీతాలు
# శ్రీ శేషాచలవాసా
# నవ్వకే నెలవంక నవ్వకే
# పిల్లనగ్రోవి మెల్లన ఊది
# ఎవరు పెంచిన
# ఏలరాడే చెలి
# ఏదే అల్లరి వనమాలి
పురస్కారాలు
* 2009లో హైదరాబాద్ శ్రీజ్ఞాన సరస్వతీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్
అకాడమీ వారిచేత శ్రీకృష్ణపద సుధానిధి బిరుదుతో సత్కారం.
* 2012లో నాల్గవ ప్రపంచ తెలుగు
మహాసభల సందర్భంగా సాహితీ పురస్కారం.
* 2012లో విశాలాంధ్ర వారి పురస్కారం.
* 2013 పాలమూరు సాహితీ ఉగాది పురస్కారం.
లలితగీతాల వీడియో లంకె
*[https://www.youtube.com/watch?v=XVNmVYz6KUU]|ఎవరుపెంచిన
Reference:
'మూగవోయిన పాలమూరు కవనం', ఈనాడు దినపత్రిక, జిల్లా పేజి, పుట- 14, తేది:07.01.2015.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి