28, జులై 2013, ఆదివారం

ఆటవెలది


ఆడబోకురయ్య ఆడించును జగము
ఆడిపించు నీవు ఆడు నిజము
కనిన లోక రీతి కలుగు నోయి సుఖము
జయుడి మాట నిజము జాబిలమ్మ


                     - నాయుడుగారి జయన్న

15, జులై 2013, సోమవారం

పంచాయతీ ఎన్నికలు

మొదలయ్యింది పంచాయతీ సమరం
ఏరులై పారుతుంది గ్రామాల్లో మద్యం
ఇదీ మన ప్రజాస్వామ్యపు ధైన్యం

6, జులై 2013, శనివారం

చిట్టి కవిత               ఏ పూజారి పెట్టాడో !
               శఠగోపం
               నత్త వీపుపై