8, మార్చి 2015, ఆదివారం

వైశ్య కవి రత్న- బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త

బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త  మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి  స్వస్థలం జిల్లాలోని బిజినేపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవంసామాజిక చైతన్యంమానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే  ఈ కవి ఆశయంఆకాంక్ష.
* కుటుంబ నేపథ్యం 
బిజినేపల్లికి చెందిన బాదం శంభయ్య, లక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీకాంతం గుప్త 1929, అక్టోబర్ 02 వ తేదిన జన్మించాడు. మధ్య తరగతి వైశ్య కుటుంబంలో జన్మించిన గుప్త బాల్యంలోనే తండ్రిని కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హైదరాబాదులోని వైశ్య వసతి గృహంలో ఉండి, చదువును కొనసాగించి, స్వాతంత్ర్యానికి పూర్వమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.
* వృత్తి జీవితం 
నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని గడిపిన గుప్త, 1987లో ఉద్యోగ విరమణ చేశాడు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. 1985లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై గౌరవించబడ్డాడు.
సాహిత్య కృషి 
ఈ కవి, కవి కన్న ముందు గాయకుడు. మొదట్లో జి. నారాయణ రావు అనే తన మిత్రుడు రాసిన గేయాలను వివిధ సంధార్భాలలో , సమావేశాలలో పాడి వినిపించేవాడు. అలా కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో చదువుకొనే సమయంలోనే తొలిసారి రచనా రంగంలోకి అడుగుపెట్టి ...

వాసవీ కుమారులు రారండి!
వైశ్య సోదరులిక లేవండి.

వసుధలోన మీ వాసిని నిల్పగవడివడిగా త్యాగం చేయండి.  అంటూ కుల సోదరులకు మేలుకొల్పు గీతాన్ని వినిపించి కలమందుకొన్న ఈ కవి, 
తర్వాత తన జన్మభూమి  పాలమురును-  నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు  మా పాలమూరు
 అని కీర్తిస్తూ,  వీరభోగ్య వసుంధరా!  పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప!, అని తన  దేశాన్ని ప్రేమిస్తూ  కవిత్వం రాశాడు.  
 రచనలు
* పగడాల మాల
* గాంధీ పథం
* నవ్య జగత్తు


నవ్య జగత్తు
 గుప్త రాసిన పుస్తకాలలో ఆణిముత్యం లాంటి పుస్తకం- నవ్య జగత్తు. ఇది పద్య జగత్తు, గేయ జగత్తు, వచన కవితా జగత్తుల సమ్మేళనం. అంటే మూడు ప్రక్రియల ముచ్చటైన పుస్తకమన్న మాట.  ఇందులోని కవిత ఏ రూపంలో ఉండినా, అద్భుతమైన రసగులికే. కొన్ని ఆకాశవాణి విజయవాడ  కేంద్రంలో  ప్రసారమైన సమస్యా పూరణలకు పూరించిన పద్యాలు  ఇందులో ఉన్నాయి.  మరికొన్ని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో స్వయంగా కవి గానం చేసి, వినిపించిన కవితలు కొన్ని ఉన్నాయి. 

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


2 కామెంట్‌లు:

 1. ఆనందీశ్వరరెడ్డి8 అక్టోబర్, 2015 2:02 PMకి

  నాకు గుర్తు ఉన్నంత వరకు ఇంకా వీరి ఇతర రచనలు:
  1) చంపకోత్పల సౌరభం (డా. కె.వి.రమణాచారిగారికి అంకితం)
  2) కాలమా నీ బలమెంత?
  3) గేయమాల

  రిప్లయితొలగించు
 2. ఆనందీశ్వరరెడ్డి గారూ! ధన్యవాదాలు, మరింత సమాచారం తెలియజేసినందుకు. నా దగ్గర ఉన్న వారి పుస్తకాల ఆధారంగా పై జాబితా పేర్కొన్నాను. మీరు సూచించిన వాటిని కూడా చేరుస్తాను. బహుశా మీరే తెలుగు వికీపీడియాలో కూడా వీరి పేజిని సవరించినట్లు ఉన్నారు. ఒక అజ్ఞాత వాడుకరి ఆ పేజిని మార్చినట్లు ఆ పేజి సృస్టికర్తగా నాకు సమాచారమందింది.

  రిప్లయితొలగించు