31, డిసెంబర్ 2013, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, సకల జనులకు  నూతన  సంవత్సర  శుభాకాంక్షలు
                                                                                మీ
                                                                    నాయుడుగారి జయన్న


28, డిసెంబర్ 2013, శనివారం

మా పాలమూరు కవులు - బారిగడుపుల ధర్మయ్యబారిగడుపుల ధర్మయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని జటప్రోలు సంస్థానం సమీపంలోని బారిగడుపుల పుణ్యక్షేత్రవాసి. కవి, పండితుడు. ఇతని తండ్రి తిమ్మప్ప. బారిగడుపుల పుణ్యక్షేత్రాన్ని నిర్మించినది ఈ తిమ్మప్పగారే. ఇక్కడి దేవుడు నరసింహస్వామి. ఈ స్వామి చరిత్రనే బారిగడుపుల ధర్మయ్య ' నృసింహపురాణం ' అను పేరుతో ద్విపద కావ్యంగా రాశాడు. దీనిని ఈ నరసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కావ్యం ఆరు ఆశ్వాసాల గ్రంథం. ఇందులో జయవిజయుల మూడు జన్మల కథలను కవి కథనంగా మలిచాడు. ఈ కావ్య రచనలో ధర్మయ్య పోతరాజును అనుకరించినట్లు తెలుస్తుంది. ఈ కవి జటప్రోలు సమీపవాసి అయినా ఈ సంస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆధారాలేమి లేవు. ' నృసింహపురాణం ' గద్వాల సంస్థానం వారి నుండి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి కార్యాలయానికి చేరింది.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*27, డిసెంబర్ 2013, శుక్రవారం

మా పాలమూరు కవులు - ముష్టిపల్లి వేంకటభూపాలుడుముష్టిపల్లి వేంకటభూపాలుడు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానంలో విలీనమైన రాజవోలు (రాజోలి) ప్రాంతాన్ని ఏలిన ప్రభువు. రాజకవి. 17 వ శతాబ్ధికి చెందినవాడు. పాకనాటివారు. మిడిమిళ్ళ గోత్రజులు. ముష్టిపల్లిని ఇంటిపేరుగా కలిగినవారు. గద్వాల సంస్థాన ప్రభువులకు బంధువులు. ఈ రాజకవి దివ్యదేశ మహాత్మ్య దీపిక, రాజవోలు వేంకటేశ్వర శతకం, వేంకటేశ్వర కీర్తనలు మొదలగు రచనలు చేశారు.
దివ్యదేశ మహాత్మ్య దీపిక
దివ్యదేశ మహాత్మ్య దీపిక నూట ఎనిమిది దివ్య స్థలాలను, వాటి మహాత్మ్యాలను తెలుపు ద్విపద కావ్యం. వేంకటభూపాలుడు దీనిని 23 తాళపత్రాలపై రచించాడు. ఈ గ్రంథంలో ఈ రాజకవి తన వంశ క్రమాన్ని వివరించాడు. ఈ గ్రంథాన్ని వీరి కుల ఇలవేల్పైన కేశవస్వామికి అంకితమిచ్చాడు.
రాజవోలు వేంకటేశ్వర శతకం
ముష్టిపల్లి వేంకటభూపాలుడు రచించిన మరో గ్రంథం రాజవోలు వేంకటేశ్వర శతకం. 109 కంద పద్యాలతో కవి దీనిని తాళపత్రాలలో రచించాడు. ఈ గ్రంథం రాజవోలు శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమివ్వబడినది. ఈ శతకాన్ని కవి ఈ పద్యంతో మొదలుపెట్టాడు.... కం. శ్రీరమణీ ప్రాణేశ్వర/ వారిజ లోచన మురారి.....నమ/ స్కారమిదె రాజవోలి వి/ హారుని వలె కరుణ వెంకటాచల రమణా! చివరి పద్యం నరవర యెప్పుడు చాలా/ నిరతము మది నమ్మినవాడ నీ దాసుని గన్/ మరువకుము రాజవోలీ/ హరిలీలను కరుణ వెంకటాచల రమణా!
శతకం యొక్క విశిష్టత
ఈ శతకంలో మొత్తం 109 కంద పద్యాలలో కవి మొదటి 56 పద్యాలను ' ' ప్రాసతో రాశాడు. తరువాత 57 పద్యాల నుండి 66 వరకు గల పద్యాలను ' ' ప్రాసతోను, 67 నుండి 86 వరకు గల పద్యాలను '' ప్రాసతోను, 87 నుండి 106 వరకు గల పద్యాలను బిందు పూర్వక ' ' కార ప్రాసతోను, మిగిలిన మూడు పద్యాలను ' ' ప్రాసతోను పూర్తిచేశాడు.
వేంకటేశ్వర కీర్తనలు
ఈ రాజకవి శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ మూడువేల నాలుగువందల డెబ్బైయారు సంకీర్తనలు రచించాడు. ఇవి వేంకటేశ్వరుని కీర్తనలైనా అక్కడక్కడ శివ పరముగా కూడా రాయబడినవి. కారణం ఈ ప్రభువులు మొదట ప్రోల్గంటి సోమేశ్వరుని భక్తులు కావడం. ఈ కీర్తనలలో అక్కడక్కడ ద్విపద పంక్తులు కూడా ఉన్నవి. ఈ కీర్తనలలో మొదటిది.... మారువ రాగం - ఆది తాళం రామ రామ మిము నమ్మిన దాసుల/ రక్షించగ ఇక ఎవరున్నారు/ స్వామి పరాకు............/ పై నేమి నేరములు గల్గిన నైన......

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*
26, డిసెంబర్ 2013, గురువారం

మా పాలమూరు కవులు - రాజవోలు సుబ్బరాయ కవిరాజవోలు సుబ్బరాయ కవి మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర నదికి ఉత్తరాన విలసిల్లిన రాజవోలు ( నేటి రాజోలి) ప్రాంతానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. రాజవోలు ప్రభువైన ముష్టిపల్లి వేంకటభూపాలుడుకి సమకాలికుడు. ఆరువేల నియోగి బ్రహ్మణుడు. అపస్తంభసూత్రుడు. శ్రీవత్సగోత్రుడు. సంసృతాంధ్రములందు సమాన పాండిత్యం కలిగినవాడు. ఈ కవి ' జయవిజయాభ్యుదయం ' అను ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఈ ప్రబంధాన్ని రాజులకు అంకితమివ్వడానికి ఇష్టపడని కవి, తనకెంతో ఇష్టమైన రాజోలి గ్రామంలో వెలిసిన వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఈ సుబ్బరాయ కవి చిత్రాంగదా పరిణయం, గరుడాంజనేయ సంవాదం, సుదంత పరిణయం, కృష్ణార్జున సంవాదం(ద్విపద) మొదలగు రచనలు చేసినట్లు తానే స్వయంగా ఓ సీసపద్యంలో చెప్పుకున్నాడు. ఈ కవి పరాశర వేంకటభట్టు, రమణార్యులు తన గురువులని చెప్పుకున్నాడు. పింగళి సూరన స్పూర్తితో 'జయవిజయాభ్యుదయం ' రాయడం వలన అది 'కళాపూర్ణోదయం ' ను పోలి ఉంటుందని కూడా చెప్పుకున్నాడు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*25, డిసెంబర్ 2013, బుధవారం

మా పాలమూరు కవులు - చింతలపల్లి ఛాయాపతి


చింతలపల్లి ఛాయాపతి మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. ఆర్యా శతకం రచించిన గోపాలకవి వీరి తండ్రిగారు. ఛాయాపతి బోరవెల్లి సీమకు రావడానికి ముందు దేవరకొండ సీమలోని బోయినపల్లిలో ఉండేవాడు. బోరవెల్లి సీమ ప్రభువు రాజా వెంకటరెడ్డి ఆహ్వనం మేరకు బోరవెల్లి సంస్థానానికి వచ్చాడు. ఇతను ఆంధ్రగీర్వాణ భాషలలో ' నవఘంట సురత్రాణ ' బిరుదాంకితుడు. సర్వంకష ప్రజ్ఞ కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప ప్రతిభ కలవాడు. కొత్త శ్లోకాలను అనులోమ, విలోమ క్రమంలో పఠించగలిగినవాడు. ఇతను మురళీగోపాల భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యుల శిష్యుడు. ' రాఘవాభ్యుదయం ' అను గ్రంథాన్ని రచించాడు. దీనిని బోరవెల్లి ప్రభువుల ఇలవేల్పైన శ్రీచెన్న కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఛాయాపతికి కవిత్వం పట్ల, కవుల పట్ల, కృతినాయకుల పట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటినన్నిటిని తన రాఘవాభ్యుదయంలో ప్రస్తావించాడు

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*