సురభి మాధవరాయలు రాజకవి. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధిపతి. కల్వకుర్తి తాలుకాలోని సురభి ప్రాంతం వీరి
పూర్వికులది. ఈ సురభిని పూర్వం గోదలు అని, ప్రస్తుతం గోడల్ అని
పిలుస్తున్నారు. విజయనగర రాజు వీర వెంకటపతి రాయల నుండి జటప్రోలు సంస్థానాన్ని
పొందిన ' బింకోలుగండ ' బిరుదాంకితుడు ఇమ్మడి
మల్లా నాయుడు వీరి తాత. చెన్నమ్మ, ముమ్మడి మల్లా నాయుడు వీరి తల్లిదండ్రులు.
ఒక వైపు ప్రజారంజకంగా పాలన సాగిస్తూనే, మరో వైపు
నిరంతరం సాహిత్య సముద్రంలో మునిగితేలిన గొప్ప పండితుడు. పండితులకు అగ్రహారాలను పంచిపెట్టిన కవి
పోషకుడు. జటప్రోలులో నాయుని పేటను, మదనగోపాల స్వామి మందిరాన్ని;
మంచాలకట్టలో మాధవ స్వామి ఆలయాన్ని; సింగవటంలో నృసింహాలయాన్ని,
మాధవరాయలపేటను, నరసింహసాగర తటాకాన్ని నిర్మించాడు.
ఈ తటాకం వలన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడని ప్రతీతి. అన్నిటికి మించి వీరు
తెలుగు సాహిత్యలోకానికి చేసిన ఎనలేని మేలు ఎలకూచి బాలసరస్వతిని తన ఆస్థానంలో
ఆదరించడం. భర్తృహరి సుభాషిత త్రిశతిని తన తండ్రి మల్లా నాయుడు పేరు మీద 'మల్ల భూపాలీయం ' పేరుతో అనువదింపజేసి ఎలకూచి
బాలసరస్వతికి రెండు వేల దీనారాలను అందజేసిన కవి పోషకుడు. కవులను ఆదరించడమే కాకుండా
స్వయంగా తానే కలం పట్టి కవిత్వం రాసిన కవి కూడా. ' చంద్రికాపరిణయం
' పేరుతో ఆరు ఆశ్వాసాల గ్రంధాన్ని రచించాడు. 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని
చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం
శేషశాస్త్రి వెల్లాల
సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా
రాశారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి