ఎలకూచి పినయాదిత్యుడు సుప్రసిద్ధ కవి ఎలకూచి బాల సరస్వతికి స్వయాన తమ్ముడు. ఇతని తండ్రి కృష్ణ దేవుడు, తాత భైరవార్యుడు. ఇతనికి ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు అని మరో పేరు కూడా ఉంది. ఈ కవి క్రీ.శ. 17 వ శతాబ్దికి చెందినవాడు. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు ప్రాంతానికి చెందినవాడు. అన్న ఎలకూచి బాల సరస్వతి ఈ సంస్థానంలోనే ఆస్థాన కవిగా కొనసాగాడు. పినయదిత్యుడు కూడా అన్న వలె విద్వత్కవే. ఆంధ్ర, గీర్వాణ విద్వాంసుడు. ఆదిత్య పురాణం అను గ్రంథాన్ని రచించాడు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి