26, జులై 2014, శనివారం

ఆటవెలది

కంటిలోన గింత కరుణ లేని మనిషి 
మనసులోన కొంత మంచి లేక 
మనిషి యెట్లు యవును మానుయవును గాని 
జయుడి మాట యిదియె జాబిలమ్మ

21, జులై 2014, సోమవారం

ఆటవెలది

కళ్లలోన నీరు కాల్వలు గట్టగా 
కూడు లేకమాడు కుక్షి తోటి 
పాడగలుగు టేల పావన మూర్తిని
జాలి జూపి జెప్పు జాబిలమ్మ!

19, జులై 2014, శనివారం

రుక్మాంగదరెడ్డి

మిత్రుడు శేఖర్ రెడ్డితో రుక్మాంగద రెడ్డి
రుక్మాంగదరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా, వెల్దండ మండల కేంద్రానికి చెందిన కవి. ఒక వైపు ఉపాధ్యాయునిగా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే రెడ్డి, మరో వైపు కవిగా తన ప్రతిభను చాటుకున్నారు.  50 సంవత్సరాలు కవిగా, రచయితగా అనేక రచనలు చేసి పాలమూరు సాహిత్యానికి తన వంతు చేయూతనిచ్చారు. 1963 నుండి నేటి వరకు సుమారు 3 వేలకు పైగా పద్యాలు రచించారు. కథలు, నవలలు కూడా  రాశారు. వీరు పాలమురుకు చెందిన మరో ప్రముఖ కవి శేఖర్ రెడ్డికి మిత్రులు. ఎంతగా అంటే శేఖర్ రెడ్డి తన కుమారుడికి ఇతని పేరే పెట్టుకునేంతగా.  శేఖర్ రెడ్డి రాసిన చివరి పుస్తకం రాఘవేంద్ర శతకాన్ని వీరే ముద్రించారు.
== రచనలు ==
1. వెలుగుకు ఆహ్వానం
2. శివతత్త్వం
3. ఉరుములు- మెరుపులు
4. రుక్మాంగద రుబాయిలు
5. రుక్మకణికలు
6. ఒకే ఒక్కడు శ్రీశ్రీ
7. సుజన శతకం
8. వివేకానందీయం
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*

15, జులై 2014, మంగళవారం

శివరాజలింగం

శివరాజలింగం మహబూబ్ నగర్ జిల్లా, బూత్పూర్ మండలం, కరివెన గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం వనపర్తిలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా హిందీ పండితులుగా పనిచేసి, ఉద్యోగవిరమణ చేశారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు.  వారు హిందీ పండితులైనా మాతృభాష మీద మమకారంతో తెలుగులో రచనలు చేశారు. వీరికి సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. నాటకాల ప్రదర్శనలలో హార్మోనియం వాయించారు. హరికథలు చెప్పటంలోనూ, పౌరాణిక నాటకాలు ప్రదర్శించటంలోనూ వీరిది అందె వేసిన చెయ్యి.  అర్జునుడు, ఆంజనేయుడు మొదలగు పౌరాణిక పాత్రలు ధరించి మెప్పించారు.
== రచనలు ==
1. శివరాజ సంకీర్తనలు
2. బాల నీతి శతకం
3. బసవ చరిత్ర
4. భగవన్నామ సంగీత భజన కీర్తనలు

* శివరాజ సంకీర్తనలు  70 కీర్తనలు, 38 పద్యాలతో కూడిన రచన. ఈ గ్రంథం రెండు ముద్రణలు పూర్తి చేసుకుంది. దీనిని సి.డి. రూపంలోనూ తీసుకవచ్చారు. విద్యార్థులకు నీతి బోధించడానికి పనికి వచ్చే పుస్తకం బాలనీతి శతకం. బసవ చరిత్ర బసవేశ్వరుని చరిత్రను హరికథ చెప్పటానికి అనుకూలంగా రాయబడిన గ్రంథం.