11, డిసెంబర్ 2017, సోమవారం
9, డిసెంబర్ 2017, శనివారం
కోట రాజశేఖర్
కోట రాజశేఖర్ అష్టావధానిగా సుపరిచితులు.అంతే కాదు, వారు ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. గణితశాస్త్ర ప్రవీణులు. 1956 నవంబర్ 3 వ తేదిన నెల్లూరు జిల్లా, కోవూరు ప్రాంతంలోని అల్లూరులో జన్మించారు. తండ్రి సారంగపాణి, తల్లి సక్కుబాయమ్మ.
కోట రాజశేఖర్ ప్రాథమిక విద్యను అల్లూరులోని వేమూరి సుబ్బయ్య పాఠశాలలో, ఉన్నత పాఠశాల విద్యను అల్లూరిలోని రామకృష్ణ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. నెల్లూరులోని మూలాపేట వేద సంసృత పాఠశాలలో విద్యను అభ్యసించారు. కడప జిల్లా, పొద్దుటూరులోని శ్రీ మళయాళస్వామి ఓరియంటల్ కళాశాల నుండి 2A విద్వాన్ పట్టాను పొందారు. 1977లో పొద్దుటూరులోనే తెలుగు పండిత శిక్షణను పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి 1978 లో పి.ఓ. ఎల్., 1980 లో ఎం.ఏ., సంస్కృతం పట్టాలు పొందారు.
విద్యాభ్యాసం అనంతరం వీరు నెల్లూరు జిల్లాలోని కామిరెడ్డిపాడు, బ్రాహ్మాణక్రాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా విద్యను అభ్యసించారు. 1984 నుండి నెల్లూరు జిల్లాలోని అల్లూరు రామక్రిష్ణ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు.
రాజశేఖర్ ఇప్పటి వరకు మొత్తం 36 అవధానాలు చేశారు. నెల్లూరు జిల్లాలోనే 13 అవధానాలు చేశారు. కావలి, అల్లూరు, రావూరు, కోట, హైదరాబాద్, బుచ్చిరెడ్డి పాలెం, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, కల్లూరుపల్లె, వావిళ్ళ, కడప మొదలగు చోట్ల వారు అవధానాలు నిర్వహించారు. వారి అవధానంలో నిషిద్దాక్షరి, సమస్యాపూరణ, దత్తపది,వర్ణన, ఆశువు, న్యస్తాక్షరి, వారగణితం, మనోగణితం(చిత్రగణితం), ఘంటాగణనం, ఛందో భాషణం, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం అనునవాటిలో సందర్భాను సారం ఎనిమిది ఎంపిక చేసుకొని అవధానలు నిర్వహించారు.
రచనలు
అవధాన పద్యమంజరి,
సత్యసాయి భక్తి పద్యమాలిక, షిరిడి సాయి స్తుతి మాలిక వంటి రచనలు చేశారు. దువ్వూరి రామిరెడ్డి పానశాలపై కొన్ని వ్యాసాలు వెలువరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచార పరిషత్ లో ధార్మిక ఉపన్యాసాలు చేశారు. మా టి.వి.లో దాశరథి శతకంపై కొన్ని ఎపిసోడ్స్ చేశారు.
పురస్కారాలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని [[2013]]లో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర స్థాయి 'ఉత్తమ అధ్యాపకుడి ' గా అవార్డు అందుకున్నారు. నెల్లూరు కళాదీప్తి సంస్థ వారు వీరి అవధాన సాహితీ సేవకు గుర్తింపుగా 28.05.2017 నాడు '''అవధాని శేఖర''' బిరుదును ప్రదానం చేశారు.

6, డిసెంబర్ 2017, బుధవారం
5, డిసెంబర్ 2017, మంగళవారం
3, డిసెంబర్ 2017, ఆదివారం
2, డిసెంబర్ 2017, శనివారం
అలంకారాలు |Download
Download అలంకారాలు
26, నవంబర్ 2017, ఆదివారం
Borra caves
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం
15, అక్టోబర్ 2017, ఆదివారం
తెలంగాణ పాట - రావెళ్ళ వేంకట రామారావు
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
7, అక్టోబర్ 2017, శనివారం
తెలుగు గజల్ || Telugu Gajal
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
3, అక్టోబర్ 2017, మంగళవారం
22, సెప్టెంబర్ 2017, శుక్రవారం
10, సెప్టెంబర్ 2017, ఆదివారం
కాళోజీ
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పద్యాలు
6, సెప్టెంబర్ 2017, బుధవారం
29, ఆగస్టు 2017, మంగళవారం
గిడుగుకు...
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పద్యాలు
27, ఆగస్టు 2017, ఆదివారం
21, ఆగస్టు 2017, సోమవారం
నిజాం కొండ కోట, బీచుపల్లి
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం,
మా పాలమూరు కోటలు
18, ఆగస్టు 2017, శుక్రవారం
16, ఆగస్టు 2017, బుధవారం
Muktyala, Krishna District
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం
2, ఆగస్టు 2017, బుధవారం
Ramappa Temple
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం
29, జులై 2017, శనివారం
నేలకొండపల్లి బౌద్ధ స్థూపం
లేబుళ్లు:
నా వీడియోలు,
పర్యాటకం
26, జులై 2017, బుధవారం
పాలమూరు యువకవి - కె.పి. లక్ష్మీనరసింహ
కె.పి. లక్ష్మినరసింహ పాలమూరు
జిల్లాకు చెందిన వర్ధమాన కవి. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. ఆ నేపథ్యమే
అతనిని కవిగా మార్చింది. అవాంతరాలకు పాఠశాల విద్యను అప్పగించేసి, పశువుల కాపరిగా జీవితాన్ని కొనసాగిస్తూ, చదువు మీద
ప్రేమను చంపుకోలేక ప్రైవేట్‌గా పదవ తరగతి రాసి, ఆ తర్వాత పై
చదువులు చదివేసి తన కవిత్వానికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు.
కె.పి. లక్ష్మీనరసింహ మహబూబ్ నగర్ జిల్లామూసాపేట మండలంలోని
తిమ్మాపూర్ గ్రామానికి చెందినవాడు. తండ్రి పోచయ్య, తల్లి
కొండమ్మ. ఈ దంపతులకు ఏడో సంతానం
లక్ష్మీనరసింహ.
సాహిత్య ప్రస్థానం
కళాశాల విద్యను అభ్యసించేటప్పుడే కవిత్వం రాయడం మొదలుపెట్టిన నరసింహ మొదట్లో
ప్రేమ కవిత్వం రాసినా, తన నేపథ్యం తన మార్గాన్ని
సుస్పష్టం చేశాకా రైతు గురించి రాయడం
మొదలు పెట్టాడు. రైతుల ఇక్కట్లు, దళారుల మోసాలు, రాజకీయనాయకుల కుట్రలు, మతవిధ్వంసం, కులరక్కసి, కరువు, వలసలు,
అంబేద్కర్ ఆశయ సమాజ స్థాపన ఈ కవికి కవిత్వ వస్తువులైనాయి. ఈ కవి
కవిత్వం వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురించబడింది. అనేక
వేదికల మీద తన కవిత్వాన్ని వినిపించాడు. ఇప్పటికే కుట్ర జేస్తున్న కాలం(2014), ఆరుతున్న మెతుకు దీపం(2016) అను
పేరుతొ రెండు
కవిత్వ సంకలనాలను వెలువరించిన ఈ కవి వెన్నెలవాడ పేరుతో మూడో కవిత్వ సంకలనాన్ని ప్రచురణకు సిద్దం
చేస్తున్నాడు. కథకుడు కూడా అయిన ఈ కవి ఐ
హేట్ యువర్ క్యాస్ట్ పేరుతో కొన్ని కథలను కూడా రాశాడు.
రచనలు
కవిత్వం
1. కుట్ర
జేస్తున్న కాలం(2014)
2. ఆరుతున్న
మెతుకు దీపం(2016)
3. వెన్నెలవాడ
(అముద్రితం)
కథలు
4. ఐ
హేట్ యువర్ క్యాస్ట్ (అముద్రితం)
ఇతని కవిత్వంపై ఇతర కవుల అభిప్రాయాలు
"నమ్ముకున్న పొలం, ఆశ పెట్టుకున్న ప్రకృతి
తనను దగా చేసినా, అప్పుల పాలై బతుకు బండిని నడిపే దారి మూసుకపోయి చతికిల బడేసినా,
భూతల్లిని విడిచి పెట్టని రైతు దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దివిటీ పట్టి
చూపించిన కవి." - - వల్లభాపురం జనార్ధన
"తెలంగాణాలో
రైతు చేస్తున్న బతుకు యుద్దానికి కదిలిపోయిన హృదయాన్ని ఈ కవి కలంలో
చూడగలం" - పరిమళ్
"రైతును, రైతుగోసను, ఆక్రందనను అక్షరమక్షరంలో
ఆవిష్కరించిన కవి." - డా. భీంపల్లి
శ్రీకాంత్
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
లేబుళ్లు:
కవులు,
పాలమూరు కవులు
25, జులై 2017, మంగళవారం
9, జులై 2017, ఆదివారం
8, జులై 2017, శనివారం
6, జులై 2017, గురువారం
2, జులై 2017, ఆదివారం
శ్రీశ్రీ
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పద్యాలు
1, జులై 2017, శనివారం
కందుకూరి
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పద్యాలు
30, జూన్ 2017, శుక్రవారం
సురవరం
లేబుళ్లు:
కవులు,
పద్యాలు,
పాలమూరు కవులు
24, జూన్ 2017, శనివారం
వెలపాటి రామరెడ్డి - తెలంగాణ పాట|
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
23, జూన్ 2017, శుక్రవారం
మెర్సీ మార్గరెట్
మెర్సీ మార్గరెట్ వర్థమాన తెలుగు కవయిత్రి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన యువకవి. సామాజిక ఉద్యమకర్త. సామాజిక మాధ్యమాల ద్వారా, మరి ముఖ్యంగా ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం ద్వారా విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. తాను రాసిన కవిత్వాన్ని 2014లో మాటల మడుగు పేరుతో కవితా సంకలనంగా వెలువరించింది. ఆమె వెలువరించిన ఈ తొలి సంకలనానికే ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి గానూ
'యువపురస్కారానికి ఎంపిక చేసింది.
జీవిత విశేషాలు
మెర్సీ మార్గరెట్ 1983లో జన్మించింది. పుట్టింది,పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తల్లిదండ్రులది పూర్వపు ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని వల్లభాపురం. దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం అంతా హైదరాబాద్‌లోనే. సురేష్ జజ్జర ఆమె జీవిత భాగస్వామి.
కవి జీవిత ప్రస్థానం
సామాజిక మాధ్యమాలలో కవిత్వ రాయడం ప్రారంభించిన ఆమె అనేక వేదికల మీద తన కవిత్వాన్ని వినిపించింది. ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం సమూహంలో అనేక కవితలను రాసింది. కేరళలో ప్రతి సంవత్సరం జరిగే తుంజన్ కవితోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే "దక్షిణ భారత కవుల సదస్సు "లో 2016 ఫిబ్రవరి లో తెలుగు కవిగా పాల్గొన్నది. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో డిల్లీ లో ప్రతి సంవత్సరం జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో 2016 ఫిబ్రవరి నాడు తెలుగు భాష నుండి యువ కవయిత్రిగా పాల్గొనే అవకాశాన్ని పొందింది.
రచనలు
# మాటల మడుగు: ఇది మెర్సీ మొదటి కవితా సంపుటి. 2014లో వెలువడింది. దీనిపై అనేక సమీక్షలు వచ్చాయి. దీనికి అనేక పురస్కారాలు దక్కాయి.
పురస్కారాలు
*తెలుగు భాషా దినోత్సవం 29-8-2012 న అప్పటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా 'కవితా పురస్కారం'
*"మాటల మడుగు " కవిత్వానికి గాను - ప్రతిష్టాత్మక పెన్నా సాహిత్య పురస్కారం 2015.
*"మాటల మడుగు " కవిత్వానికి గాను- కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2017

తెలుగు కవులు
28, మే 2017, ఆదివారం
పల్లెపాడు రఘురామయ్య ఆచారి పద్యాలు
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు
27, మే 2017, శనివారం
22, ఏప్రిల్ 2017, శనివారం
తల్లీ ధరిత్రీ!
14, ఏప్రిల్ 2017, శుక్రవారం
How to change video background ?
లేబుళ్లు:
నా వీడియోలు,
సాంకేతికం
10, ఏప్రిల్ 2017, సోమవారం
7, ఏప్రిల్ 2017, శుక్రవారం
Top 5 Video Editors for Android
లేబుళ్లు:
నా వీడియోలు,
సాంకేతికం
5, ఏప్రిల్ 2017, బుధవారం
తెలుగు క్విజ్
కవి - నిర్వచనాలు
1. వేదాలలో కవి కున్న అర్థం ఏమిటి?
2. "ప్రతిభాశాలియై నిపుణముగా వర్ణించువాడే కవి" అన్నది ఎవరు?
కావ్యం - నిర్వచనాలు
3. "లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవి కర్మ కావ్యం " అన్నది ఎవరు?
4. "సహితములైన శబ్ధార్థములే కావ్యం" అన్నది ఎవరు?
5. " కావ్యమునకు ఇతివృత్తం శరీరం, రసం తత్సౌందర్య హేతువు" అన్నది ఎవరు?
6. " ఇష్టార్థ వ్యవచ్చిన్న పదావళే కావ్యం" అన్నదెవరు?
7. "గుణాలంకార యుక్త శబ్ధార్థములు కావ్యం" అన్నదెవరు?
8. "రసాత్మక వాక్యం కావ్యం" అన్నదెవరు?
9. "నిర్దోష, గుణాలంకార రసవంత వాక్యం కావ్యం" అన్నదెవరు?
10. "గుణాలంకార రీతి, రసోపేత, సాధు శబ్ధార్థ సందర్భం కావ్యం" అన్నదెవరు?
11. " రమణీయార్థ ప్రతిపాదక శబ్ధం కావ్యం" అన్నదెవరు?
12. "రసాలంకార యుక్త, సుఖ విశేష సాధనం కావ్యం" అన్నదెవరు?
13. "శబ్ధార్థ యుగళమే కావ్య శరీరం" అన్నదెవరు?
14. "శాస్త్రమునకు విరుద్దమైనదే కావ్యం" అన్నదెవరు?
15. " ఆవేశ, అప్రయత్న మూర్తీభూత పద, భావములే కవిత్వం" అన్నదెవరు?
16. "శక్తియుత భావములు సహజముగా ఉప్పొంగుటయే కవిత్వం" అన్నదెవరు?
17. " ఉప్పొంగు భావ ప్రవాహమునకు పరీవాహమే కవిత్వం" అన్నదెవరు?
జవాబుల కొరకు కింద వ్యాఖ్యలలో చూడండి...
లేబుళ్లు:
చదువు సంగతులు,
తెలుగు క్విజ్
3, ఏప్రిల్ 2017, సోమవారం
1, ఏప్రిల్ 2017, శనివారం
ఏపూరి సోమన్న పాట - నా మనసు బాధ
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
20, మార్చి 2017, సోమవారం
ఆంధ్ర సాహిత్యములో బిరుద నామములు
'ఆంధ్ర సాహిత్యములో బిరుదనామములు '
బిరుదులకు అర్రులు చాచనివారు, బిరుదులకు
ఉప్పొంగనివారు బహు అరుదు.సాహిత్యంలో ఇక దానికున్న స్థానమే వేరు. నాటి నన్నయ నుండి
నేటి నానా కవుల దాకా సాహిత్యాన్ని సృష్టించి బిరుదులు పొందినవారు, బిరుదులు పొందడానికి సాహిత్యాన్ని సృష్టించినవారు కొల్లలుకొల్లలు. అసలు,
అసలు పేరుకన్నా బిరుద నామంతోనే ప్రసిద్ది చెందినవారికి కొదువలేదు మన
సాహిత్యంలో.
ఏ పాఠ్య పుస్తకంలో కవి పరిచయం ఉన్నా, వారి
బిరుదుల ప్రస్తావన ఉండాల్సిందే. ఏ పోటీ పరీక్షలోనైనా బిరుదలకు సంబంధించి ఒక
ప్రశ్నైనా ఉండి తీరాల్సిందే. ఇట్లా వీటి గురించి మాట్లాడుతుంటే...అసలీ బిరుదులేమీ? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి
ఉండాల్సిన అర్హతలేమిటి? బిరుదుల్లో వైవిధ్యమేమిటి? వాటి అంతరార్థం ఏమిటి? ఇత్యాది విషయాలు
తెలుసుకోవాలంటే మాత్రం మీరు, కథల ప్రేమికుడు , తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రోది చేయడానికి శ్రమిస్తున్న తెలుగు వికీపీడియన్ కోడీహళ్ళి మురళీ మొహన్ గారి
ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామములు పుస్తకాన్ని చదవవలసిందే. ముఖ్యంగా సాహితీ ప్రియులు,
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యా, ఉద్యోగార్థులు.
ఆంధ్రా మిల్టన్, ఆంధ్రా డెమొస్తనీస్,
సాహితీ భీష్మ ఎంత గంభీరమైన బిరుదులు కదా! పేరు ముందు ఉంటే భలే
బాగుంటుంది అనిపిస్తుంది కదూ! ఈ పుస్తకం
చదివితే మాత్రం వద్దు బాబోయ్! అనకమానరు. అంతేనా! తిరుపతి వెంకటకవుల బిరుదైనా 'కింకవీంద్రఘటాపచానన ' బిరుదుపై, ఈ కవులకు పేరి కాశీనాథ శాస్త్రులకు మధ్య జరిగిన సంవాదం గురించి
తెలుస్తుంది. అంతేనా! ఏ కవికి ఏ ఏ బిరుదులు ఉన్నాయి? ఏ ఏ
బిరుదులు ఏ ఏ కవులకు ఉన్నాయి? ఇట్లా రెండు విధాలుగా
పాఠకుడికి సులువుగా చెప్పడానికి ఈ పుస్తక
రచయిత 599 మంది కవులు, 606 బిరుదులను శ్రమకోర్చి, ఏర్చి, కూర్చి రెందు విభాగాలుగా మనకు అందించాడు.
ఎవరైనా ఎందుకీ పుస్తకం? అని
ప్రశ్నిస్తే..."భవిష్యత్తులో ఎవరైనా బిరుదుల గురించి పరిశోధన చేసేవారికి ఈ
ప్రయత్నం ముడిసరుకుగా ఉపయోగపడుతుంది". అని రచయిత వినయంగా చెప్పాడు కానీ,
నిజానికి ఈ పుస్తక విషయానికి
మరికొంత మసాలా దట్టించి, ఏ పరిశోధక విద్యార్థో,
ఏ విశ్వవిద్యాలయంలోనో సమర్పించి ఉండి ఉంటే అధమాధమం ఎం.ఫిల్., పట్టా
అయినా వచ్చి ఉండేది.
చివరగా ఒక మాట. నాది కాదండి బాబు. ఈ రచయితదే. "
తెచ్చిపెట్టుకున్న బిరుదులు, అడిగి పుచ్చుకున్న బిరుదులు, వ్యాపార దోరణిలో సంపాదించుకున్న బిరుదులకు విలువ ఉండదు. వాటిని
ప్రజలు ఎల్లకాలం గుర్తించరు. అలాంటివి
పటాటోప ప్రదర్శనకు మాత్రమే పనికి వస్తాయి. కేవలం బిరుదాంచితులు మాత్రమే గొప్పవారు
అని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. ఏ బిరుదులూ లేని ప్రతిభా సంపన్నులైన
కవిపండితులెందరో ఉన్నారు". ఎంత విలువైన మాటలు కదా!
- నాయుడిగారి జయన్న
ఆంధ్ర సాహిత్యములో బిరుద నామములు
రచయిత: కోడీహళ్ళి మురళీమొహన్
9701371256
17, మార్చి 2017, శుక్రవారం
How to create a logo?
లేబుళ్లు:
చదువు సంగతులు,
చిత్రలేఖనం,
నా వీడియోలు,
సాంకేతికం
15, మార్చి 2017, బుధవారం
7, మార్చి 2017, మంగళవారం
నాయుడుగారి జయన్న కవితా పఠనం
లేబుళ్లు:
కవితలు,
కవులు,
నా వీడియోలు,
పాటలు
5, మార్చి 2017, ఆదివారం
28, ఫిబ్రవరి 2017, మంగళవారం
రాము కవితా పఠనం
25, ఫిబ్రవరి 2017, శనివారం
భాస్కర్ గారి కవితా పఠనం
24, ఫిబ్రవరి 2017, శుక్రవారం
23, ఫిబ్రవరి 2017, గురువారం
చీర్ల శ్రీనివాసులు గారి కవితాగానం
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
17, ఫిబ్రవరి 2017, శుక్రవారం
7, ఫిబ్రవరి 2017, మంగళవారం
5, ఫిబ్రవరి 2017, ఆదివారం
1, ఫిబ్రవరి 2017, బుధవారం
Samasya leni illu song by Apoori Somanna
బహుజన యుద్ద నౌక ఏపూరి సోమన్న పాట
24, జనవరి 2017, మంగళవారం
మా విద్యార్థి నోట పల్లె తల్లి పాట
మా పాఠశాల కు చెందిన విద్యార్థి పాడిన పాట
1, జనవరి 2017, ఆదివారం
తెలుగు క్విజ్
- తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా పోటీ
పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం...
- రామాయణం- క్విజ్
1. రామాయణానికి ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటి?2. రామాయణంలోని కాండలు, శ్లోకాల సంఖ్య ఎంత?3. అయోధ్యను నిర్మించినది ఎవరు?4. దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు?5. దశరథుని ప్రధాన మంత్రి ఎవరు?6. దశరథుని కొలువులోని మంత్రుల సంఖ్య ఎంత?7. విభాండక మహర్షి కుమారుడు ఎవరుడు?8. రావణాసురుడి తండ్రి పేరు ఏమి?9. కుబేరుడు ఎవరి సోదరుడు?10. కౌసల్య సుప్రజా అంటూ మేలుకొలుపు గీతాన్ని పాడింది ఎవరు?11. తాటక విధ్వంసాన్ని సృష్టించిన జనపదాలు ఏవి?12. తాటక కుమారుడు ఎవరు?13. తాటకను రాముడు వధించిన బాణం పేరు ఏమిటి?14. మారీచునిపై రాముడు ప్రయోగించిన బాణం ఏది?15. సుభాహునిపై రాముడు ప్రయోగించిన బాణం ఏది?16. విశ్వామిత్రుడి యజ్ఞభూమి పేరేమిటి?17. విశ్వామిత్రుడి యజ్ఞానికి ఆటంకాలు కలిగించిన రాక్షసులు ఎవరు?18. అహల్య, గౌతముల పెద్ద కుమారుడు ఎవరు?19. ఊర్మిళ తండ్రి పేరేమి?20. భరతుని భార్య పేరేమి?21. శత్రుఘ్నుడి భార్య పేరేమి?22. జనకుడి తమ్ముడి పేరేమి?23. కుశధ్వజుని కుమారైలు ఎవరు?24. జమదగ్నిని చంపిన క్షత్రియుడు ఎవరు?- తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా పోటీ
పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం...
గమనిక: జవాబులు కింద వ్యాఖ్యలలో చూడండి.
లేబుళ్లు:
అవి ఇవి,
చదువు సంగతులు,
తెలుగు క్విజ్
స్థానం:
Mahabubnagar, Telangana, India
Happy new year-2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)