30, జూన్ 2020, మంగళవారం

29, జూన్ 2020, సోమవారం

ఊపిరి ఆడటం లేదు డాడీ!
"ఊపిరి ఆడటం లేదు డాడీ!"
ఇది ఎక్కడో అమెరికాలో వినిపించిన గొంతు కాదు
ఇతను దొంగ అంతకన్నా కాదు
ఇక్కడే...
మనదే..
గాలికి కొట్టుకుపోయిన మాటలు మూటలు కట్టాలి
పక్కదారి పట్టిన నిధులను పక్కలిరగదన్నాలి
వెంటిలేటర్ ఏ ధనవంతున్ని చేరనో వెతికి పట్టుకోవాలి
గొంతుపెగలకుండ లోలోనే
ఆగిన గుండెలెన్నో లెక్కపెట్టుకోవాలి.
అసలు దీనంతటికి కారణమైన
చైనోన్ని చెప్పుతోన తన్నాలి.

3, జూన్ 2020, బుధవారం

సమస్తం


పీడించకపోతే ప్రపంచాన్ని
రోగాలకు ఉనికుంటదా?
సరిహద్దుల్లో యుద్దాలకు సిద్దమవ్వకుంటే
దేశాల బలాలకు విలువుంటదా?
అణచపోతే అహంకారం
మీసం మెలితిరుగుతదా?
ఆస్తులను ఆహుతి జేయపోతే
నిరసనకు నిద్రొస్తదా?
సందులోనా సడేమియా!
ఈ సమయం నీదేనయా!
దోరికినేది దోచేయవయా!