నములకంటి జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లాకు
చెందిన కవి. రాజకీయనాయకుడు. కాంగ్రేసువాది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యులుగా,
రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. ఈ కవి '
అరుంధతీదేవి చరిత్రం ' అను వచన కావ్యాన్ని, ' వనితా విలాసం ' అను పద్యకావ్యాన్ని, నల్గొండ జిల్లాలోని యాదగిరి నరసింహస్వామిపై శార్దూల మత్తేభ
విక్రీడితలతో ' శ్రీయాదగిరి
నరసింహస్వామి ' శతకాన్ని రచించారు. ఉత్పలమాల, చంపకమాలలతో 'గిరిజా మనోహరా!' అను
మకుటంతో, శతక రూపంలో ' శ్రీశైల గిరిజా మనోహరం '
అను కావ్యాన్ని రచించాడు. దీనిని నాటి ముఖ్యమంత్రి శ్రీకాసు
బ్రహ్మానందరెడ్డికి....
"శైలజామనోనాథుని- శతక కృతిని
స్వీకరింపుము శ్రీశైల క్షేత్రపతిని
గూర్చి వ్రాసితి శుభములు - గొనుము జగతి
మానితౌదార్య మాముఖ్యమంత్రివర్య! '' అంటూ అంకితమిచ్చాడు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి