2, డిసెంబర్ 2013, సోమవారం

మా పాలమూరు కవులు-భీంపల్లి శ్రీకాంత్
భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి, వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.  'పాలమూరు సాహితి ' అను సాహిత్య సంస్థను, ' పాలమూరు కల్చరల్ అకాడామీ ' అను సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదికలోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పాలమూరు సాహితి ద్వారా తన సంపాదకత్వంలో  'అంజలి ' , ' పాలమూరు కవితా సుమాలు ' అను పుస్తకాలను వెలువరించాడు. తరువాత జిల్లాకు చెందిన వందమంది కవుల కవితలను సేకరించి ' పాలమూరు కవిత ' ను వెలువరించాడు. తెలంగాణ మీద హైకూలు రాసి ' సోది ' పేరుతో 2004లో వెలువరించాడు. ఈ పుస్తకాన్ని తెలంగాణకు పెద్ద దిక్కైన కాళోజి నారాయణరావుకు అంకితమిచ్చాడు. 1996లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు. ' ప్రేమికులు ' ప్రయివేట్ ఆడియో అల్బం కు పాటలు రాశారు. నేటి విద్యార్థి, నిజం అనే సింగిల్ ఎపిసోడ్ లకు మాటలు రాశారు. నాలో ఉన్న ప్రేమ అను సింగిల్ ఎపిసోడ్ కు కథ, మాటలు రాశారు. ఛాంపియన్ అను టెలిఫిల్ంకు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. సాహిత్యంలో వీరు చేసిన కృషికి 2002 లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డును అందుకున్నారు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక పత్రికలలో వెలువడ్డాయి.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి