24, ఫిబ్రవరి 2015, మంగళవారం

హైకూల చంద్రుడు - తలతోటి పృథ్విరాజ్

ఊరి నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా, కోఠి సమీపంలోని బ్యాంక్ వీధిలోని  విశాలాంధ్ర కు వెళ్లి రావడం నాకు ఆనవాయితీ. అలా వెళ్ళిన ఒక సారి ఓ పది రూపాయల చిన్న పుస్తకమొకటి కంట పడింది. పేరు వెన్నెల. తీసుకొచ్చుకున్నాను. మూడు చిట్టి పాదాల హైకూ ప్రక్రియలో  రాయబడిన పుస్తకమది. అందులోని ప్రతి హైకూ నాకెందుకో గొప్పగా అనిపించాయి. ఆ పుస్తకాన్ని ఎన్ని సార్లు చదువుకున్నానో.. చదివిన ప్రతి సారి ఓ గొప్ప అనుభూతి. అలా ఆ పుస్తకం పరిచయం చేసిన కవే - తలతోటి పృథ్విరాజ్,  మీ కోసం మరిన్ని వివరాలు.  

తలతోటి పృథ్విరాజ్  ప్రముఖ తెలుగు కవి. ఆధునిక కవిత్వ ప్రక్రియలలో ఒకటైన హైకూ రచనలో విశేష కృషి చేస్తున్నాడు. హైకూను ఇంటిపేరుగా మార్చుకున్న పృథ్విరాజ్ ''ఇండియన్ హైకూ క్లబ్‌ను స్థాపించి, హైకూ ప్రక్రియా వ్యాప్తికి తోడ్పడుతున్నాడు.

 జీవిత విశేషాలు 
సత్యానందం, సామ్రాజ్యం దంపతులకు 1970 ,జూలై 6 న నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు. ప్రకాశం జిల్లా,అద్దంకిలోని రవీంద్ర భారతి పబ్లిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం తుబదులో 6 వ తరగతి పూర్తిచేసిన అనంతరం, తిరిగి అద్దంకిలోని ప్రకాశం బాలుర పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు. బాల్యంలో మద్దులేటి మాస్టార్ ప్రోత్సాహంతో చదువును కొనసాగించాడు. తన బాల్య స్మృతులే అతడిని హైకూ కవిగా మార్చాయి. విజయవాడలోని లయోల కళాశాలలో బి.ఏ., హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పూర్తిచేశాడు. ఆచార్య పర్వతనేని సుబ్బారావు మార్గదర్శకత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్రేయ సినిమా సంభాషణల మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. 
వృత్తి జీవితం 
2000 సంవత్సరంలో అనకాపల్లిలోని ఏ.ఎం.ఏ.ఎల్.లో తెలుగు అధ్యాపకులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అనేక జాతీయ వేదికల మీద తెలుగు సాహిత్యంపై పత్రాలు సమర్పించాడు.

సాహిత్య జీవితం
10 వ తరగతి నుండే కవిత్వం రాయడం ప్రారంభించిన పృథ్విరాజ్, ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తన మొదటి కవిత అచ్చయ్యాక, అదే స్ఫూర్తితో ఆ తర్వాత అనేక కవితలు, కథలు రాశాడు. వీటితో పాటు బొమ్మలు గీయడం వీరికి ఉన్న మరో అభిరుచి. ఇతని రచనలు అనేకం మయూరి వార పత్రికలో ప్రచురించబడ్డాయి.
రచనలు 
తలతోటి పృథ్విరాజ్ హైకూలు ప్రక్రియలో ప్రధానంగా కవిత్వం రాసినా, దీర్ఘ కవిత, నానీలు మొదలగు ఇతర కవిత్వ ప్రక్రియలలోనూ రచనలు చేశాడు.
హైకూ సంపుటులు 
* వెన్నెల
* చినుకులు
* వసంతం
* రోజుకో సూర్యుడు
* నీలాకాశం
* కలువలు
* చంద్ర కిరిటీ
* ఋతు బ్రమణం
* పృథ్వీ సెన్‌ర్యూ
* పృథ్వీ టంకాలు
* పృథ్వీ ఫోటో హైకూలు

దీర్ఘ కవితలు 
* మనిషి
* నల్ల దొరలు
ఇతర రచనలు 
* మనసు కవి ఆత్రేయ నాటక సాహిత్యం - సంభాషణలు (విమర్శా గ్రంథం)
* మనిషిలో...(కవిత్వ నిర్వచనా రచన)
* అడుగులు (నానీలు)






18, ఫిబ్రవరి 2015, బుధవారం

భాష

ఒక ప్రవాహం.  స్వచ్చ మైన చినుకులతో మొదలై, అనేక కాలువలను  కలుపుకొని సాగుతుంది.  నిరంతరం పారే ప్రవాహం  నడక  ఒక్కోచోట మైదానంలో సాగవచ్చు. ఒక్కోచోట కొండల మీదనుండి కిందికి దూక వొచ్చు. మరో చోట వొంకరటింకరగా సాగవచ్చు. అయినంత మాత్రానా దానికి మైదానంలో ఒక పేరు. కొండల మీద మరో పేరు, ఇంకో చోట ఇంకో పేరేమి ఉండదు.  కాదు కూడదు. మా ప్రాంతంలో పారే ఈ ప్రవాహంలోకి మరే నీరు రాకూడదు. ముందుకు పోకూడదు.  దీని చుట్టూ గీత గీసి గోడ కట్టి, కొత్త రంగులేసుకుంటాం. మా నీరు మా ఇష్టం అంటే, అది అక్కడే నిలిచిపోయి, మురుగుపట్టి, ఎండిపోయి, చివరికి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడవచ్చు. అది ప్రవాహనికైనా.  భాషకైనా!

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

బాలచంద్ర వనాజీ నెమడే

బాలచంద్ర వనాజీ నెమడే   
మరాఠీ చయిత. కోసలహిందూ పుస్తకాల రచయితగా సుప్రసిద్ధుడు. 2014సంవత్సరానికిగానూ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యాడు.      నెమడే 1938లో ఖాందేశ్‌లోని సంగవి గ్రామంలో జన్మించాడు. మహారాష్ట్ర,పూనేలోని ఫెర్గూసన్ కళాశాల నుండి బాచిలర్ డిగ్రీనిఅదే పూనేలోని డెక్కన్ కాలేజి ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రిసెర్చ్ నుండి భాషాశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డీ.డీ.లిట్.పట్టాలు అందుకున్నాడు.    నెమడే ఆంగ్లంమరాఠీతులనాత్మక సాహిత్యం మొదలగు అంశాలను వివిధ విశ్వవిద్యాలయాలలో బోధించాడు. లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్‌లోను పనిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయంలో గురుదేవ్ రవీంద్రనాథ ఠాగూర్ తులనాత్మక సాహిత్య పీఠంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 1960లో మరాఠీ పత్రిక 'వాచా కు సంపాదకుడిగా పనిచేశాడు. 1990లో టీక స్వయంవర్ అను విమర్శా గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2015 ఫిబ్రవరీలో జ్ఞానపీఠ పురస్కారం పొందాడు. 
సాహితీ ప్రస్థానం
1963లో నెమడే తన మొదటి నవల కోసల ను వెలువరించాడు. ఇదీ గ్రామీణ ప్రాంతం నుండి పూనేకు చదువుకోడానికి వచ్చిన ఓ యువకుని కథ. ఇదీ నెమడే జీవితాన్ని ప్రతిబింబించే నవల. ఈ నవల ఆంగ్లం, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీపంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఓరియా వంటి పలు భాషల్లోకి అనువాదమైంది. దీని తర్వాత బీదర్హూల్జరీలా మరియు జూల్ అను మరో నాలుగు నవలలు రాశాడు. 
రచనలు
నవలలు 
 1.   కోసల(Kosla)
 2.   బీదర్ (Bidhar)
3.   హూల్(Hool)
4.   జరీలా(Jarila)
5.   జూల్(Jhool)
కవితా సంకలనాలు
1.   మెలోడీ (Melody)
2.   దెఖనీ Dekhani
విమర్శా గ్రంథాలు
1.   టీకాస్వయంవర్
2.   సాహిత్యాచీ భాష
 3.       తుకారామ్
 4.     మరాఠీపై ఆంగ్లభాషా ప్రభావం.
  5.   ఇండో - ఆంగ్లియన్ రాతలు
  6.   స్థానికత్వం (దేశీవాద్)