చింతలపల్లి ఛాయాపతి మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. ఆర్యా శతకం రచించిన గోపాలకవి వీరి తండ్రిగారు. ఛాయాపతి బోరవెల్లి సీమకు రావడానికి ముందు దేవరకొండ సీమలోని బోయినపల్లిలో ఉండేవాడు. బోరవెల్లి సీమ ప్రభువు రాజా వెంకటరెడ్డి ఆహ్వనం మేరకు బోరవెల్లి సంస్థానానికి వచ్చాడు. ఇతను ఆంధ్రగీర్వాణ భాషలలో ' నవఘంట సురత్రాణ ' బిరుదాంకితుడు. సర్వంకష ప్రజ్ఞ కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప ప్రతిభ కలవాడు. కొత్త శ్లోకాలను అనులోమ, విలోమ క్రమంలో పఠించగలిగినవాడు. ఇతను మురళీగోపాల భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యుల శిష్యుడు. ' రాఘవాభ్యుదయం ' అను గ్రంథాన్ని రచించాడు. దీనిని బోరవెల్లి ప్రభువుల ఇలవేల్పైన శ్రీచెన్న కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఛాయాపతికి కవిత్వం పట్ల, కవుల పట్ల, కృతినాయకుల పట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటినన్నిటిని తన రాఘవాభ్యుదయంలో ప్రస్తావించాడు
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి