20, ఆగస్టు 2014, బుధవారం

పాలమూరు కవులు - ఆచార్య మసన చెన్నప్ప



ఆచార్య మసన చెన్నప్ప  మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలోని కొలుకులపల్లి గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

ఉన్నత విద్య
మసన చెన్నప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. లో ప్రప్రథమ స్థానం పొంది గురజాడ అప్పారావు స్వర్ణపతకం అందుకున్నారు. 'వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙమయ సూచిక ' అను అంశంపై ఎం. ఫిల్. ను, ' ప్రాచీన కావ్యాలు - జీవన చిత్రణ ' అనే అంశంపై పి. హెచ్.డి. ని చేశారు.
వృత్తి జీవితం
వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.
రచనలు
  • మల్లి పదాలు
  • నేత్రోదయం ( ఈ కవితా సంపుటి ' ఐరైజ్ ' పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది.)
  • బృహద్గీత
  • సమాలోచనం
  • బ్రహ్మచర్యం
  • అమృత స్వరాలు
  • అగ్ని స్వరాలు
  • ప్రకృతి పురుష వివేకం
  • సారస్వత లోచనం
  • ఈశావ్యాసం
పురస్కారాలు
  • సూర్యశక్తి సాహితీ పురస్కారం అందుకున్నారు.
  • 2000 సం. లో నిర్మల సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి