26, జులై 2017, బుధవారం

పాలమూరు యువకవి - కె.పి. లక్ష్మీనరసింహ

కె.పి. లక్ష్మినరసింహ  పాలమూరు జిల్లాకు చెందిన వర్ధమాన కవి. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. ఆ నేపథ్యమే అతనిని కవిగా మార్చింది. అవాంతరాలకు పాఠశాల విద్యను అప్పగించేసి, పశువుల కాపరిగా జీవితాన్ని కొనసాగిస్తూ, చదువు మీద ప్రేమను చంపుకోలేక ప్రైవేట్‌గా పదవ తరగతి రాసి, ఆ తర్వాత పై చదువులు చదివేసి తన కవిత్వానికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు.
   కె.పి. లక్ష్మీనరసింహ మహబూబ్ నగర్ జిల్లామూసాపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందినవాడు. తండ్రి పోచయ్య, తల్లి కొండమ్మ. ఈ దంపతులకు  ఏడో సంతానం లక్ష్మీనరసింహ. 

సాహిత్య ప్రస్థానం
కళాశాల విద్యను అభ్యసించేటప్పుడే  కవిత్వం రాయడం మొదలుపెట్టిన నరసింహ మొదట్లో ప్రేమ కవిత్వం రాసినా, తన నేపథ్యం తన మార్గాన్ని సుస్పష్టం  చేశాకా రైతు గురించి రాయడం మొదలు పెట్టాడు. రైతుల ఇక్కట్లు, దళారుల మోసాలు, రాజకీయనాయకుల కుట్రలు, మతవిధ్వంసం, కులరక్కసి, కరువు, వలసలు, అంబేద్కర్ ఆశయ సమాజ స్థాపన ఈ కవికి కవిత్వ వస్తువులైనాయి. ఈ కవి కవిత్వం వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురించబడింది. అనేక వేదికల మీద తన కవిత్వాన్ని వినిపించాడు.  ఇప్పటికే కుట్ర జేస్తున్న కాలం(2014), ఆరుతున్న మెతుకు దీపం(2016) అను పేరుతొ   రెండు కవిత్వ సంకలనాలను వెలువరించిన ఈ కవి వెన్నెలవాడ పేరుతో  మూడో కవిత్వ సంకలనాన్ని ప్రచురణకు సిద్దం చేస్తున్నాడు.  కథకుడు కూడా అయిన ఈ కవి ఐ హేట్ యువర్ క్యాస్ట్ పేరుతో కొన్ని కథలను కూడా రాశాడు.
రచనలు
కవిత్వం
1.    కుట్ర జేస్తున్న కాలం(2014)
2.   ఆరుతున్న మెతుకు దీపం(2016)
3.   వెన్నెలవాడ (అముద్రితం)
కథలు
4.   ఐ హేట్ యువర్ క్యాస్ట్ (అముద్రితం)

ఇతని కవిత్వంపై ఇతర కవుల అభిప్రాయాలు

"నమ్ముకున్న పొలం, ఆశ పెట్టుకున్న ప్రకృతి తనను దగా చేసినా, అప్పుల పాలై బతుకు బండిని నడిపే దారి మూసుకపోయి చతికిల బడేసినా, భూతల్లిని విడిచి పెట్టని రైతు దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దివిటీ పట్టి చూపించిన కవి."  -                                            - వల్లభాపురం జనార్ధన

"తెలంగాణాలో  రైతు చేస్తున్న బతుకు యుద్దానికి కదిలిపోయిన హృదయాన్ని ఈ కవి కలంలో చూడగలం"   - పరిమళ్

"రైతును, రైతుగోసను, ఆక్రందనను అక్షరమక్షరంలో ఆవిష్కరించిన కవి." -  డా. భీంపల్లి శ్రీకాంత్

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*