రాజవోలు సుబ్బరాయ
కవి మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర నదికి
ఉత్తరాన విలసిల్లిన రాజవోలు ( నేటి రాజోలి)
ప్రాంతానికి
చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. రాజవోలు ప్రభువైన ముష్టిపల్లి వేంకటభూపాలుడుకి సమకాలికుడు. ఆరువేల
నియోగి బ్రహ్మణుడు. అపస్తంభసూత్రుడు. శ్రీవత్సగోత్రుడు. సంసృతాంధ్రములందు సమాన పాండిత్యం
కలిగినవాడు. ఈ కవి ' జయవిజయాభ్యుదయం ' అను ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఈ
ప్రబంధాన్ని రాజులకు అంకితమివ్వడానికి ఇష్టపడని కవి, తనకెంతో ఇష్టమైన రాజోలి
గ్రామంలో వెలిసిన వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఈ సుబ్బరాయ కవి
చిత్రాంగదా పరిణయం, గరుడాంజనేయ సంవాదం, సుదంత పరిణయం, కృష్ణార్జున సంవాదం(ద్విపద) మొదలగు రచనలు చేసినట్లు
తానే స్వయంగా ఓ సీసపద్యంలో చెప్పుకున్నాడు. ఈ కవి పరాశర వేంకటభట్టు, రమణార్యులు తన గురువులని
చెప్పుకున్నాడు. పింగళి
సూరన స్పూర్తితో 'జయవిజయాభ్యుదయం ' రాయడం వలన అది 'కళాపూర్ణోదయం ' ను పోలి ఉంటుందని కూడా చెప్పుకున్నాడు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి