మంథాన భైరవుడు మహబూబ్
నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి.
పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి. క్రీ.శ. 10 వ
శతాబ్ధికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు. ''భైరవతంత్రం'' పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది
సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. సురవరం
ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికలో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. ప్రముఖ
కవి పండితులు, పరిశోధకులు మావవల్లి రామకృష్ణ కవి కుమార సంభవానికి
రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు.
భైరవుడు ''ఆనందకందకం'' అను మరో గ్రంథాన్ని
రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు కూడా ఈ
కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.
రచనలు
* భైరవ తంత్రం
* ఆనందకందకం
భైరవతంత్రంలోని శ్లోకాలు
గ్రంథం ప్రారంభంలో...
'' శ్రీహర మహాశాంతం భైరవం భీమనిగ్రహం
సమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాస(వ)నం''
గ్రంథాంతంలో....
''ఏతత్తంత్రం మాయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః
ప్రియశిష్యాయ ధాతవ్యం పుత్రాయచ విశేషితః
ఇతి భైరవాగమే భూత తంతే సప్తవింశతి పటలః''
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి