23, మార్చి 2015, సోమవారం

నా యాత్రానుభవాలు-6, హళేబీడు

2013  అక్టోబర్ నెలలో నేను, నా మిత్రుడు బషీర్ కర్ణాటకలోని ముఖ్యమైన ప్రాంతాలు చుట్టిరావడానికి నిర్ణయించుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మేము 14 వ తేది బేలూరు దర్శించి,  హళేబీడుకు చేరుకున్నాం.


 ఉదయం 10 గంటల ప్రాంతంలో  బేలూరు నుండి 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి . హళేబీడు కు చేరుకున్నాం.  హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. బేలూరు, హళేబీడు, శ్రావణబెళగోలాను కర్ణటక పర్యాటక శాఖవారు  స్వర్ణ  త్రికూటంగా పిలుస్తారు.  బేలూరును, హళేబీడును హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు.  హళేబీడు అనగా శిథిలనగరం. దీనికి పూర్వం  దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి.   అనగా సముద్రానికి ద్వారం వంటిదని.  ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ  మిగిలిపోయాయి. అందుకే దీనికి హళేబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.    
          ఈ హళేబీడు  12 - 13 శతాబ్ధి మధ్యకాలంలో  హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం  నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా  తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో  పూర్తైంది. దీని నిర్మాణంలో ప్రధానపాత్ర  కేదారోజ. ఈయన విష్ణువర్ధనుడి కుమారుడైన మొదటి నరసింహ దగ్గర ప్రధాన శిల్పి. 

బస్టాండ్ నుండి సరాసరి దేవాలయానికి వెళ్ళాం. ఆలయం బస్టాండ్‌కు దగ్గరలోనే ఉంది. ఆలయానికి చుట్టూ పచ్చటి  పచ్చిక పరిచి ఉంది. బేలూరు ఆలయం చుట్టూ ప్రహరి ఉంటే ఇక్కడ ఆలయం బయలు ప్రదేశంలో ఉంది. నక్షత్రాకారపు జగతి వేదిక మీద సుందర ఆలయం  మనల రమ్మని ఆహ్వానిస్తుంది.   ఇది ద్వికూటాలయం.  ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల
అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి.  ఆ శిల్ప సౌందర్యం వర్ణించతరం కాదు. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవలయాల నిర్మాణానికి సబ్బురాతిని ఉపయోగించారుఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక  విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో చిన్నపాటి గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం,  దగ్గరలోనే   ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.ఆలయ సౌందర్యాన్ని ఆస్వాదించి, కాసేపు అక్కడి పచ్చికలో విశ్రమించి, ఆలయ సముదాయం వెలుపలికి వచ్చేశాం. దగ్గరలోని ఒక హోటల్లో అరటి ఆకుల్లో తృప్తిగా భోజనాలు కానిచ్చి, బస్టాండ్‌కు వచ్చేశాం. సూర్యుడు నడి నెత్తి మీద నుండి మెల్లగా  పశ్చిమం వైపు వాలుతుండగా శ్రావణబెళగోల వైపు బస్సులో  పయనమయ్యాం.

.
8, మార్చి 2015, ఆదివారం

వైశ్య కవి రత్న- బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త

బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త  మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి  స్వస్థలం జిల్లాలోని బిజినేపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవంసామాజిక చైతన్యంమానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే  ఈ కవి ఆశయంఆకాంక్ష.
* కుటుంబ నేపథ్యం 
బిజినేపల్లికి చెందిన బాదం శంభయ్య, లక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీకాంతం గుప్త 1929, అక్టోబర్ 02 వ తేదిన జన్మించాడు. మధ్య తరగతి వైశ్య కుటుంబంలో జన్మించిన గుప్త బాల్యంలోనే తండ్రిని కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హైదరాబాదులోని వైశ్య వసతి గృహంలో ఉండి, చదువును కొనసాగించి, స్వాతంత్ర్యానికి పూర్వమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.
* వృత్తి జీవితం 
నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని గడిపిన గుప్త, 1987లో ఉద్యోగ విరమణ చేశాడు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. 1985లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై గౌరవించబడ్డాడు.
సాహిత్య కృషి 
ఈ కవి, కవి కన్న ముందు గాయకుడు. మొదట్లో జి. నారాయణ రావు అనే తన మిత్రుడు రాసిన గేయాలను వివిధ సంధార్భాలలో , సమావేశాలలో పాడి వినిపించేవాడు. అలా కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో చదువుకొనే సమయంలోనే తొలిసారి రచనా రంగంలోకి అడుగుపెట్టి ...

వాసవీ కుమారులు రారండి!
వైశ్య సోదరులిక లేవండి.

వసుధలోన మీ వాసిని నిల్పగవడివడిగా త్యాగం చేయండి.  అంటూ కుల సోదరులకు మేలుకొల్పు గీతాన్ని వినిపించి కలమందుకొన్న ఈ కవి, 
తర్వాత తన జన్మభూమి  పాలమురును-  నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు  మా పాలమూరు
 అని కీర్తిస్తూ,  వీరభోగ్య వసుంధరా!  పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప!, అని తన  దేశాన్ని ప్రేమిస్తూ  కవిత్వం రాశాడు.  
 రచనలు
* పగడాల మాల
* గాంధీ పథం
* నవ్య జగత్తు


నవ్య జగత్తు
 గుప్త రాసిన పుస్తకాలలో ఆణిముత్యం లాంటి పుస్తకం- నవ్య జగత్తు. ఇది పద్య జగత్తు, గేయ జగత్తు, వచన కవితా జగత్తుల సమ్మేళనం. అంటే మూడు ప్రక్రియల ముచ్చటైన పుస్తకమన్న మాట.  ఇందులోని కవిత ఏ రూపంలో ఉండినా, అద్భుతమైన రసగులికే. కొన్ని ఆకాశవాణి విజయవాడ  కేంద్రంలో  ప్రసారమైన సమస్యా పూరణలకు పూరించిన పద్యాలు  ఇందులో ఉన్నాయి.  మరికొన్ని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో స్వయంగా కవి గానం చేసి, వినిపించిన కవితలు కొన్ని ఉన్నాయి. 

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


6, మార్చి 2015, శుక్రవారం

ఎలకూచి పినయాదిత్యుడు

ఎలకూచి పినయాదిత్యుడు సుప్రసిద్ధ కవి ఎలకూచి బాల సరస్వతికి స్వయాన తమ్ముడు. ఇతని  తండ్రి కృష్ణ దేవుడుతాత భైరవార్యుడు. ఇతనికి  ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు అని మరో పేరు కూడా ఉంది. ఈ కవి  క్రీ.శ. 17 వ శతాబ్దికి చెందినవాడు. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు ప్రాంతానికి చెందినవాడు.  అన్న ఎలకూచి బాల సరస్వతి ఈ సంస్థానంలోనే ఆస్థాన కవిగా కొనసాగాడు. పినయదిత్యుడు కూడా అన్న వలె  విద్వత్కవే. ఆంధ్రగీర్వాణ విద్వాంసుడు. ఆదిత్య పురాణం అను గ్రంథాన్ని రచించాడు. 


--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*