15, డిసెంబర్ 2016, గురువారం

శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి దేవాలయం

పూర్వపు పాలమూరు జిల్లా , ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన రంగనాయక (రంగనాథ) స్వామి దేవాలయం ఇది. వారు తవ్వించిన సప్త సముద్రాలలో (చెరువులు) రంగసముద్రం ఒకటి. ఆ చెరువు ఒడ్డున నిర్మించిన సుందరమైన శిల్ప కళతో అలరారు దేవాలయమిది. చెరువు మధ్యలో రాజుల భవంతి కూడా ఒకటి శిథిల దశలో కనిపిస్తుంది. దీనిని కృష్ణ విలాస్ అని పిలిచేవారు. ఒక్కసారి ఆ దృశ్యాలపై ఓ  లుక్కేయండి.