15, ఆగస్టు 2019, గురువారం
2, ఆగస్టు 2019, శుక్రవారం
జాని తక్కెడశిల
జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితావస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.
విద్యాభ్యాసం
జాని పాఠశాల విద్యను తన స్వస్థలం పులివెందులలోని నాగార్జున హైస్కూల్ లోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్. బి మెమోరియల్ హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ బై.పి.సి పూర్తి చేశారు. అనంతరం పులివెందుల లయోలా పాల్ టెక్నికల్ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో అమీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఎం. టెక్., పూర్తి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా పొందారు. కంప్యూటర్ మరియు సాంకేతిక విద్యలో సి, జావా, ఓరాకిల్ మొదలగు దాదాపు ఇరవైకి పైగా టెక్నికల్ కోర్సులు పూర్తిచేసారు.
వృత్తి
మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.
రచనలు
ఇప్పటి వరకు వీరు కవిత్వానికి సంబంధించి ఆరు పుస్తకాలు వెలువరించారు. మరెన్నో కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో రాస్తూనే ఉన్నారు. జిందగీ కె హీరే అను పుస్తకాన్ని హిందీ భాషలో రాశారు. ఈ పుస్తకం నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం. 160 మంది కవులు అమ్మపై రాసిన కవితలను మాతృస్పర్శ పేరుతో వీరి సంపాదకత్వంలో సంకలనంగా తీసుకవచ్చారు. దాదాపు ఇరవైకి పైగా సంకలనాలలో వీరి కథలు, కవితలు ముద్రించబడ్డాయి.
వీరి ముద్రిత రచనలు
1.అఖిలాశ
2.విప్లవ సూర్యుడు
3.నక్షత్ర జల్లులు (కొత్త సాహిత్య ప్రక్రియ)
4.వై (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
5.బురద నవ్వింది
6. జిందగీ కె హీరే (నానోలు హిందీలో)
7.లై అనే ఆంగ్ల కవిత్వ సంపుటి
అముద్రిత రచనలు
1.బాలల కథలు
2.బాలల గేయాలు
3.ముస్లిం మైనార్టీ కథలు
4.శివారెడ్డి కవిత్వం-ఒక అవగాహన వ్యాస సంపుటి (శివారెడ్డి గారి సమగ్ర కవిత్వంపై విశ్లేషణలు)
5.డా. ఎన్ గోపి కవిత్వం-ఒక పరిశీలన (గోపి గారి సమగ్ర కవిత్వంపై వ్యాస సంపుటి)
6.డా. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి రచనలు - ఒక పరిశీలన
=== పురస్కారాలు ===
#సత్రయాగం సాహిత్య వేదిక నుండి కవి మిత్ర పురస్కారం
#ప్రతిలిపి సాహిత్య వేదిక నుండి కథా భారతి పురస్కారం
#కవి సమ్మేళనం సాహిత్య వేదిక నుండి ఉగాది పురస్కారం
#బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం
#చెన్నై కి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి తెలుగు వెలుగు పురస్కారం
#ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం
#కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం
# “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019

లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
వ్యక్తులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)