8, ఫిబ్రవరి 2014, శనివారం

మా పాలమూరు కవులు - కర్నాటి రఘురాములు గౌడు

ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా సన్మానం అందుకొంటూ...


కర్నాటి రఘురాములు గౌడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శతక కవి. ఇతను జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామంలో 1956లో జన్మించారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. బోధించేది సాంఘికశాస్త్రం ఐనా, తెలుగు భాషన్నా, తెలుగు సాహిత్యమన్న మక్కువ. ఆ ఇష్టమే వీరిని కవిగా మలిచింది. జిల్లా కరువు పరిస్థితులు, వీరి గ్రామ సమీపాన కల అభయాంజనేయ స్వామి ప్రభావం కూడా వీరు కవిగా మారడానికి కారణమయ్యాయి. విద్యార్థి దశలోనే పద్యాలు రాయడం ప్రారంభించారు. తొలినాళ్ళలో సీస పద్యాలు రాశారు. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి సూచనలు, జిల్లాకే చెందిన మరో కవి రాకొండ శేఖర్ రెడ్డి ప్రోత్సాహం వీరిని కవిగా మరో మెట్టు పైకి ఎదిగించాయి. ఒక వైపు కవిగా రచనలు చేస్తూనే మరో వైపు భగవద్గీత ప్రచారం, భాగవత సేవ మొదలగు భక్తి ప్రచార కార్యక్రమాలలొ కూడా పాల్గొన్నారు. భక్తకవిగా అనేక భక్తి శతకాలను రచించారు.
 విద్యాభ్యాసం
ఊర్కొండపేటలో ప్రాథమిక విద్య, కల్వకుర్తిలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు.  1980లో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేశాడు. దూర విద్యలో ఎం.ఏ., ను పూర్తి చేశాడు. 
ఉద్యోగ జీవితం
రఘురాములు గౌడు సెక్యూరిటి గార్డుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1975 నుండి 1979 వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉపాధ్యాయ శిక్షణలో సీటు వస్తే ఉద్యోగాన్ని వదిలి 1980లో శిక్షణలో చేరి పూర్తి చేశాడు. 1981 నుండి రెండు సంవత్సరాల పాటు జడ్చర్ల పట్టణంలోని ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1982లో నిర్వహించబడిన ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అప్పటి కల్వకుర్తి సమితిలోని సిరసనగండ్ల పాఠశాలలో చేరాడు.  ప్రస్తుతం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
అవార్డులు
* 2003 లో మిడ్జిల్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
* 2005 లో మహబూబ్ నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
* 2006లో గీతామిత్ర అవార్డు
* 2014లో నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికయ్యారు.
రచనలు
*ఉర్కొండ ఆంజనేయస్వామి శతకం
*శ్రీరామ శతకం
*హనుమాన్ కందపద్య చాలీసా
*జీవాత్మ శతకం
*రఘురామ వరద శతకం
*గడభీర రామ శతకం
*రఘురామదాసు భజన కీర్తనలు
* హనుమంతుడి ఆదర్శం

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి