సమస్యా పూరణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్యా పూరణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2020, ఆదివారం

సమస్యాపూరణం










పలువురు మెచ్చు రీతిన యపప్రద లేక యభంగ వీరులై
నిలిచిరి రాజు లిచ్చట, అనింద యపూర్వ కవిత్వ సంపద
న్నిలిపిరి తారలై సుకవు లెందరొ, వారసులై యబద్దమున్
పలుకరు రాణ్మహేంద్ర పుర వాసులు, సత్యము నెన్న డేనియున్

9, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: 22.02.2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ.....
 
ఆ.             ముద్దపప్పు లోన శుద్ధ నెయ్యి గలిపి
                 ముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
                 అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
                 ఆవకాయ దినిన నమరుడగును

 

8, మే 2016, ఆదివారం

సమస్యా పూరణ


శ్రీ కంది శంకరయ్య గారి  శంకరాభరణం బ్లాగ్ లో తేది: 04.05.2016 నాడు ఇచ్చిన సమస్య కు
          నా  పూరణ....

 
             ఆ.                కన్న బిడ్డ పెళ్ళి కంటను కదలాడ
                                 అప్పు చేసి వేయ పప్పు పంట
                                 కలిసి రాని దైన కాల మిచ్చిన తాలు 
                                 ధాన్యము గని రైతు తల్లడిల్లె   

 

7, మే 2016, శనివారం

సమస్యా పూరణం


శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో  తేది: ౦౩.05.2016 రోజు ఇచ్చిన  సమస్య(2022 /03.05.2016) కు నా  పూరణ-

 
 
 
 
 
 
 
 
కం.   కోపముననో! ఘన మునుల
         శాపమునో! పరుల భాష చపలత్వమునో!,
         తాపమునో! యిపుడు తెలుగు  
         దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్

 

4, మే 2016, బుధవారం

సమస్యా పూరణం

ధర్మము నధర్మముగ నవతరణ పొంద   
నీతి నీలిగి చచ్చిన నీడలోన
పుట్ట గొడుగుగా నవినీతి పుట్టు చోట
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము 


 


 

2, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో ఇచ్చిన సమస్యకు నా పూరణ


సమస్య: 20119 - పాటు బడిన వారి కెట్లు ఫలితము దక్కున్



కందం.  చాటున మెక్కియు లంచము
               ధీటుగ పనిజేయక మరి దినములు గడిపెన్
               ఘాటుగ పరులను తిట్టియు
               పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి 'శంకరాభరణం' బ్లాగ్ లో ఇచ్చిన సమస్యకు పూరణం

 సమస్య:2021   - కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె
 
 
 
ఆ.      వీర శూర రాకుమారులు రణమున
అశ్వమెక్కి పోర నలుపు లేక
                  పిరికి వాడొకడిని పిలవఁ బోక, గృహంబు
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె