పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2026, ఆదివారం

గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు


 గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు పూడూరి రాజిరెడ్డి రాసిన కథా సంపుటి. ఇందులో 12 కథలు ఉన్నాయి. "ఈ కథల్లో కొన్ని నావి, కొన్ని వాళ్ళవి, మరికొన్ని నావో వాళ్ళవో చెప్పలేని కథలు ఉన్నాయి" అంటాడు రచయిత. వేములవాడకు చెందిన రచయిత హైదరాబాద్లో జర్నలిస్టుగా స్థిరపడ్డారు. 2008 నుంచి కథలు రాస్తున్నారు. ఇది వారి ఆరో  పుస్తకం. ఇందులో ఒకటి రెండు కథలు కొంచెం అస్పష్టంగా అనిపిస్తాయి కానీ, మనసు పెట్టి చదివితే మనసుకు హత్తుకునే కథలే. ఆలోచింపజేసే కథలే. చదివించే గుణమున్న కథలే.  చాలా కథల్లో లీలగా, జీరగా శృంగార స్పర్శా ఉంది. కొన్ని కథలు లోలోనే గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. చిన్న సమస్య కథలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వారు తమని తాము చూసుకుంటారు. కథలన్నీ బాగున్నాయి. 

కాపీలకు - Sapien Stories Pvt. Lmtd. -9912460268 

15, జులై 2025, మంగళవారం

3, జులై 2025, గురువారం

ఈ కవిత్వం యుద్ధమైదానమే.

 నా కొత్త పుస్తకం 'కల్లోల కడలి' పై వసంత మేఘంలో కెంగార మోహన్ గారి సమీక్ష. 


ఈ కవిత్వం యుద్ధమైదానమే!              










కల్లోల కడలి (వచన కవిత్వం)

 నాయుడు గారి జయన్న 


14, జూన్ 2025, శనివారం

ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య - తెలుగు తల్లి

 

విద్వాన్ ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించిన పద్య కావ్యం తెలుగు తల్లి.  లక్ష్మయ్య కడప జిల్లా కలసపాడు మండలం అక్కివారి పల్లి గ్రామానికి చెందినవారు.  గ్రేడ్ వన్ తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

 

  ఈ తెలుగు తల్లి పుస్తకంలో  నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ప్రాచీన కవుల కవితా సుగుణాలను పొగుడుతూ  ఆధునిక కవులను కూడా ఆరాధిస్తూ వివిధ ఛందస్సులలో పద్యాలను రాసి ఈ కావ్యాన్ని ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించారు.

అంతర్జాల యుగములో తెలుగు భాషకు ఆదరణ తగ్గిందని, ఆంగ్ల భాషా ప్రవాహ ఉరవడి ఎక్కువైందన్న  బాధతో  తెలుగు వారికి తెలుగు గొప్పదనాన్ని ప్రబోధిస్తూ కవి ఈ తెలుగు తల్లిని రచించారు.

ఈ కావ్యంలో ‌కవి ముందు వివిధ దేవతా ప్రార్థనలతో ప్రారంభం చేసి, తెలుగు కవులందరినీ  స్మరిస్తూ ఈ కావ్యాన్ని రచించాడు.

"శబ్దశాసనుండు లబ్ధ యశుండయ్యె

ఆంధ్ర భారతమ్ము  నల్లె మొదట

ఆదికవి యటంచు ఆరాధ్యుడయ్యెను

అక్షరముల రమ్య తలర గూర్చి "   అంటూ నన్నయ్యను కీర్తించాడు. 

ఈ వరుసలో నారాయణ భట్టు, భీమకవి, తిక్కన, ఎర్రన,   పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు,వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన మొదలగు ప్రాచీన కవులందరినీ కీర్తిస్తూ పద్యాలు రాశారు.

పదకవులను, అవధానులను ప్రవచన కారులను కూడా కీర్తిస్తూ ఇందులో పద్యాలను రాశారు. 

ఈ పుస్తకం అనుబంధంలో 'గండికోట గత ఘన వైభవం' పేరుతో గండికోట చరిత్రను కీర్తిస్తూ మరికొన్ని పద్యాలు ఉన్నాయి.  పద్య ప్రియులు చదువు దగ్గ పుస్తకం.

ప్రతులకు:

ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి -  99 854 920 49 , 9581774649

22, మే 2025, గురువారం

పవనపుత్ర శతకం

 

 పవనపుత్ర శతకం 

         రచన : నాయుడు గారి జయన్న

   ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి, 2025

                     పేజీలు: 48

                         వెల  :  రూ. 50/- లు.


ఆవిష్కరణ ఆహ్వానవీడియో

ఆవిష్కరణ చిత్రాలు

పుస్తకపరిచయ సభ ఆహ్వానం

అవధాని శ్రీకోట రాజశేఖర్ గారి ముందుమాట

లాయర్ పత్రికలో సమీక్ష

డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి సమీక్ష

ఎం.డి. ఉస్మాన్ గారి సమీక్ష

దృక్కోణం

 

     దృక్కోణం (సాహిత్య విమర్శావ్యాసాలు)

         రచన : నాయుడు గారి జయన్న

   ప్రథమ ముద్రణ: డిసెంబర్, 2024

                     పేజీలు: 104

                         వెల  :  రూ. 150/- లు.

 


                   @   దృక్కోణం - ముందుమాట

               @  ఆవిష్కరణ ఆహ్వానపత్రం 

               @   ఆవిష్కరణ వార్తావిశేషాలు

               @  ఆంధ్రజ్యోతిలో దృక్కోణం





ప్రస్తావన

       నేను చేయి తిరిగిన సమీక్షకుడిని కాను, చలం చెప్పి నట్లు సాహిత్యాన్ని తూచే తూకపు రాళ్ళు నాతోనూ లేవు. కాకపొతే ఇవన్నీ నాకు ఇష్టమైన పుస్తకాలు. నేను చదివిన పుస్తకాలు. వాటిపై నాకు కలిగిన అభిప్రాయాలు అంతే. నచ్చిన పుస్తకాలు వెతుక్కోవడం, వీలున్నప్పుడల్లా చదువుకోవడం, చదువు తున్నపుడు కలిగిన స్పందనలను రాసి పెట్టుకోవడం  ఒక అలవాటు . అట్లా రాసి పెట్టినవే ఈ వ్యాసాలు. ఇష్టమైన కవులు, రచయితలు, గాయకులపై రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉపాధ్యాయుల మాస పత్రికల్లో, దిన పత్రికల సాహితీ పేజీల్లో, వెబ్ మేగజైన్లలో, నా బ్లాగ్ లో ప్రచురించినవి ఉన్నాయి. మరి కొన్ని ఆ పుస్తకాలకు ముందు మాటలుగా రాసినవి కూడా ఉన్నాయి.  అన్ని కలిపి ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ పుస్తకం.  చదివి ఆదరిస్తారని ఆశిస్తూ...

                                                                                             - నాయుడు గారి జయన్న

 

విషయ సూచిక  

 

 

1.      పాలమూరు నేలలో పూసిన రేలపూతలు 

2.      తెలంగాణకై కత్తి నూరిన ‘నూరు తెలంగాణ నానీలు

3.      కరువు జిల్లానే కాదు కవుల జిల్లా కూడా

4.      కాల్వ మింగిన ఊరు

5.      గద్వాల సంస్థానం – సాహిత్య పోషణ

6.      సామాన్యుడి బతుకు జెండాలో అశోక చక్రం - మట్టిగంప

7.      విద్యారంగానికి దిక్సూచి- రామయ్య పాఠాలు

8.      కొత్త సాహిత్య ప్రక్రియలు వద్దా?

9.      మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వ - మెర్సీ కవిత్వం

10.  సప్త వర్ణ సమ్మిళితం - యశస్వి తెల్ల కాగితం

11.  ప్రకృతిచ్చిన  పాటగాడు

12.  ఆంధ్ర సాహిత్యములో బిరుదనామములు

13.  ఇక్బాల్ కవిత్వం ఒక విప్లవ సేద్యం

14.  జీవితానుభవ సారం అవనిశ్రీ కవిత్వం

15.  అక్షరాగ్నికణం  అలిశెట్టి

16.  కొన్ని ఆయుధాలు... కొన్ని కన్నీళ్లు...

17.  అవనిశ్రీ – ఆపతి

18.  నడిగడ్డ - నవలా సాహిత్యం

19.  జోగులాంబ గద్వాల జిల్లా – వచన కవిత్వం

20.  నడిగడ్డ చరిత్రే గద్వాల్జాతర

21. నేనూ, గొరుసు, గజఈతరాలు

                                              ---***---

BACK


 

నా పుస్తకాలు






         1. దృక్కోణం 

(సాహిత్య విమర్శా వ్యాసాలు) -            డిసెంబర్,2024




2. పవనపుత్ర శతకం -           ఫిబ్రవరి, 2025                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     







3. కల్లోల కడలి (వచన కవిత్వం)