16, మే 2020, శనివారం

పాలమూరు గోస



పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2004 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

నేపథ్యం
మార్చి 2, 2003 రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూల నుండి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హజరయ్యారు. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. చిత్రాలను గీసి ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నిటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా వారు జూలై, 2004 లో ఈ పుస్తకాన్ని తీసుకవచ్చారు.

సంపాదక వర్గం
నాటి కరువు వ్యతిరేక పోరాట కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏడు మంది సభ్యులు ఈ పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు. వారు ప్రొ. జి. హరగోపాల్, ఎం. రాఘవాచారి, ఎన్. యాదగిరి, కె.సి. వెంకటేశ్వర్లు, ఎం.డి. ఎక్బాల్ పాష, బి. వెంకటయ్య, ఎండి. ఖైసర్.

విషయసూచిక
  1. కృతజ్ఞత
  2. కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం
  3. కరువు రాజకీయనాయకుల పుణ్యమే.
  4. పాలమూరి లేబర్ (రూం)
  5. ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస?
  6. జిల్లా సాహితీ చరిత్రలో ఇది అపూర్వం.
  7. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు.
  8. పాలమూరు గెలుస్తుంది.
  9. మా మాట
  10. అంకితం.

  1. పాటలు
  2. కవితలు
  3. పద్యాలు
  4. కరువు జన్మభూమి (స్కిట్)
  5. ఉర్దూ కవితలు
  6. కరువు ప్రదర్శన చిత్రాలు
  7. చిరునామాలు.
విషయ సూచికలోని మొదటి పది అంశాలు సంపాదక వర్గపు తొలిపలుకులు, నాటి సభలోని ప్రధాన వక్తల ఉపన్యాసాలు, సభపై మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన కథనాలు చోటుచేసుకున్నాయి. కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి పెండ్యాల వరవరరావు సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ ఆంధ్రజ్యోతి రాయగా, ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ ఈనాడు సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ రాశాడు.

అంకితం
"పుట్టిన గడ్డ మీద బతుకు దుర్భరమై, బతకడానికే బలైన పాలమూరు లేబరుకు...
అత్యాచారాల హత్యాచారాలకు బలైన పాలమూరు తల్లులకు...
అసహజ మరణాల కొలిమైన పాలమూరులో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నేత కార్మికులు, పేదలకు...
పీడనకు వ్యధాభరిత జీవనానికి సాక్ష్యంగా నిస్సహాయంగా ఆకలిచావుల పాలైన వారికి...
పుట్టిన గడ్డకు, కన్న బిడ్డలకు కాకుండా కనిపించకుండా పోయిన వారికి...
ఈ లోకం ప్రజలదే ప్రజలకే చెందాలని ఆశలు పల్లవించే పోరాటంలో అమరులైన వారికి...
వినమ్రంగా...అంకితం" అంటూ సంపాదక వర్గం పేర్కొంది.

పాటలు - కవులు
ఈ పుస్తకంలో సుమారు యాబై (50) మంది కవులు రాసిన పాటలను పొందుపరిచారు. వారి పాటల శీర్షిక, వాటిని రాసిన కవుల వివరాలు ఇలా ఉన్నాయి.

క్రమ సంఖ్య

పాట శీర్షిక

పాట రాసిన కవి పేరు

చిరునామా

1పాలమూరు కరువు పాటకడుదాసు వెంకటదాసు
2కరువు కీర్తనకస్తూరు పంతులు సాయన్న
3రాగులరాంరెడ్డన్నా!జి. మురళీధర్ రావు
4లేబరన్నాల్లారా!గాజుల లక్ష్మీనారాయణ
5పాలమూరు దండంఎన్. యాదగిరి
6ఒక్క పూట తిండికిగోరటి వెంకన్న
7మబ్బుల్లారా వచ్చిపోరాజక్క గోపాల్
8బతుకంతా భారమాయెకె. సల్మాన్
9.మహబూబ్ నగరం చెల్లోఎం.ఎ. గఫార్
10పాలమూరు గోసడా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్
11పాలమూరి గొసజాలం సత్తయ్య
12అగ్గజూడ లచ్చమాబి. జనార్థన్
13మాయమ్మ పాలమూరుసి. కృష్ణయ్య
14వలసపాటకిందింటి కిరణ్
15పాలమూరి కరువు గోసవి. వెంకట్రాములు
16కరువు బతుకు పోవాలన్నరోఎన్. శ్రీనివాస్
17పాలమూరు గొసడా. ఎస్వీ. సత్యనారాయణ
18ఉద్యమించరాబి. కాళిదాసు
19పాలమూరి లొల్లిబూస జంగయ్య
20గోదాములే నిండివుండగహారతి వాగీశ్
21నేలమ్మ లాలనకు దూరమాఆనంద్
22పాలమూరు రైతుమల్లేపల్లి శేఖర్ రెడ్డి
23వచ్చేరో కరువొచ్చేరోఔటస్వామి
24ఇది ఏమి కరువన్నోమరికంటి బాలస్వామి
25కరువుకేకపల్లెర్ల రామ్మోహనరావు
26రైతు వేదనగట్టు మనోహర్ రెడ్డి
27పాలమూరు జిల్లా పాటజెట్టి కురుమూర్తి
28జనం బాధపి. మంతటి కృష్ణపద్మ
29కరువు రోదనకె. బాల్‌రెడ్డి
30కరువుమీద మన్ను బొయ్యకె. శ్రీనివాస్
31అన్నదాతహన్మంత్ రెడ్డి
32నా పల్లెనాయుడు గారి జయన్న
33పాలమూరు వలసబతుకునర్సింహ
34పల్లెల్లో చీకట్లు కమ్మెరామూలమల్ల మీనాప్రభాకర్
35కరువు కరువోరన్నాజనజ్వాల
36చదరంగంలో పావులుడా. భూమిగోపాల్
37వలసజీవులులాడెసాని బాలస్వామి
38ఓ పాలమూరి కూలి రైతా!ఎ. మహేశ్
39ఇది ఏమి కాలం?ఎం. సత్యనారాయణ
40బువ్వనీళ్ళు కావాలివై. దేవదానం
41పాలమూరు ప్రజల గోడుబి. వెంకటేశ్వర్లు
42రైతు బ్రతుకుకె. ఉదయ్ కుమార్
43పాలమూరు రైతు గోసకె. వి. యాదగిరి
44పాలమూరి ముద్దుబిడ్డ ఆకలి ఘోషఎం.డి. ఇద్రిష్
45పాలమూరు గొసబాదేపల్లి వెంకటయ్య గౌడు
46ఆకలి కేకలుజన్ను రాఘవులు
47బతుకు రాత మార్చుకోవయాగొంది శివారెడ్డి
48కరువు పోరాటంఆర్తం గురునాథం
49కరువు గోసగన్నోజు శ్రీనివాసాచారి
                             


       

50  పాలమూరు బిడ్డలం                       రేపల్లి ఖాజా హఫీజుద్దీన్





క్రమ సంఖ్యకవితా శీర్షికరాసిన కవి పేరుచిరునామా
1పాలమూరు బిడ్డలంసి. వెంకటేశ్వరశర్మ
2వలసబోయిన వసంతంకె. నవీన్
3పాలమూరు పల్లవిడి. హెచ్. జి. అమ్మణ్ణ
4మనుషులు రాలుతున్న నేలపరిమళ్
5మేం మనుషులంపి. భారతి
6నాతోడు నిన్ను సంతకంపఎం. నారాయణ
7కుర్చీలు కూలుతయ్కోట్ల వెంకటేశ్వరరెడ్డి
8మాకూ మంచిదినాలొస్తయ్కె. ఎల్. సత్యవతి
9పొలమారిన పాలమూరుకాశీంకాశీం
10అయినొల్లంతా వలసపోతేఎం. వెంకట్రాములు
11గోసఎన్. శివశంకర్
12పాడెకట్టె తెంపుకొనిఉజ్వల్
13కాలంపోటుబైరోజు చంద్రశేఖర్
14అల్లుడి నోట్లో శనిఖాజామైనొద్దీన్
15పాలమూరి కష్టజీవిఎన్. కిశోర్ కుమార్
16పాలమూరు కరువు దృశ్యంకమలేకర్ శ్యాం ప్రసాదరావు
17పొట్టంత ఆకలి గోసఅక్కల వేంకటేశ్వర్లు
18వలసరేడియం
19జాడలేని రైతుబిడ్డవేముల శ్రీనివాసులు
20పాలమూరు గోసఎ. వెంకయ్య నాయక్
21పాలమూరు లేబరొల్లుపులిమామిడి మద్దిలేటి
22పల్లెబోసిపోయేకట్టా కృష్ణయ్య
23తల్లి కోసంసి. వీణాదేవి
24కరువు షాక్ఆర్. కె. చంచల
25బలవుతున్న బాల్యంపి. సృజన
26మనకీ బాధ కొత్తది కాదుస్వర్ణ సుధాకర్
27కరువు లేదుఎస్. రాజశేఖర్ రెడ్డి
28రైతు గోసపి. భాస్కరయోగి
29చిక్కనవుతున్న దుఃఖంసతీష్
30యాడబోయిరి నా జనంఅంపశ్రీ
31నా గొంతు గోసఎస్. సురేష్ బాబు
32జన్మభూమి బూటకంకె. వామన్ కుమార్
33కరువు నృత్యంజి. రవిశంకర్
34గోసగుముడాల చక్రవర్తి గౌడు
35నా పల్లెహిమజ్వాల
36ఏమని వ్రాయను అగ్నిజ్వాలఖాజానజీరుద్దీన్
37రగులుతున్న పాలమూరువల్లభాపురం జనార్ధన
38ఎడారి కోయిల పాటఉదయ్
39పాలమూరు గోసవిరజాజి రామిరెడ్డి
40సిగ్గిడ్సినోడుభీంపల్లి శ్రీకాంత్
41కరువు రక్కసిఎలకొండ వరప్రసాద్
42కరువు రక్కసిడి.ఎస్. బాబూదేవీదాస్‌రావు
43జెండాకెక్కిన గోసచిలుక రవి
44చెయ్యిచాచిన అన్నదాతవై. రుక్మాంగదరెడ్డి
45కరువు ఏకరువుఏ. సూర్యప్రకాష్ రావు
46కూటికి కుండనైతబలుపరి ఆనంద్‌శ్రీ
47పాలమూరి గోససి. సాకేత ప్రవీణ్
48పాలమూరు గోసమహమ్మద్ బురాన్
49కరువు కరువుఅనంత రామచంద్రయ్య
50పాలమూరు రైతన్నడా. వీరయ్య
51కరువు గోసబి. లింగారెడ్డి
52ఎండమావులుడా. వరప్రసాద్
53పాలమూరు బిడ్డలకు స్వాగతంమల్లికార్జున్
54పాలమూరు గోసభాస్కర్ ఎలకంటి
55జనం గోసటి. వి. భాస్కరాచార్య
56పాలమూరు పల్లెగోడుకె. శివరాజు
57పాలమూరు గోసకమలేకర్ రాంచందర్‌జీరావు
58నీటికోసం ఫాంటసీప్రతాప్ కౌటిల్య
59కరువు తీరేదెప్పుడు?కొండా బసవరాజు
60పాలమూరి గోసవి. రాజారాంప్రకాష్
61తెల్సుకోవై. ధన్‌రాజ్ కుమార్
అనువాద కవితలు
62జాగో-ఉఠోజమాల్ బీహరీ
63మై డార్లింగ్ సిటీజి. విజయ్


14, మే 2020, గురువారం

నీటిమాట

నీటిమాట
మనమే...
ఎగువనుంటే ఓ మాట
దిగువనుంటే మరో మాట
నది ఆవలి వైపో మాట
నది ఈవలో మాట
ఎడమ కాలువ మీదో మాట
కుడి కాలువ మీదో మాట
ఎవడూ తేల్చని లెక్కలు
ఎప్పటికీ తెగని పంచాయతీ
పారే ఏరు పారుతూనే ఉంటుంది.
ఎండే నోరు ఎండుతూనే ఉంటుంది.
- ఎన్. జయన్న