26, మార్చి 2014, బుధవారం

ఎన్నికల ఋతువు

ఎన్నికల ఋతువు - 4

సార కొకడు చీర కొకరు
అమ్ముకుంటే ఓటు
ప్రజాస్వామ్య దేశానికి
రాదా ఇక చేటు?!

16, మార్చి 2014, ఆదివారం

ఎన్నికల ఋతువు

పూటకొక్క కండువాను

మార్చినంతనే నేత,

మారుటెట్లు వీలగురా

మన తల రాత?!

బొక్క దొరికెతే
వదిలేటి కుక్కుందా?
పదవి కొరకు
పాకులాడని నేతుండా?

10, మార్చి 2014, సోమవారం

మా పాలమూరు కవులు - మల్లేపల్లి శేఖర్ రెడ్డి

మల్లేపల్లి శేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  కవి.  ఈ కవి స్వగ్రామం జిల్లాలోని తెల్కపల్లి మండలం లోని రాకొండ. భార్య పేరు  మల్లేపల్లి సుభద్రమ్మ.  శేఖర్ రెడ్డికి రుక్మాంగద రెడ్డి, మల్లికార్జున రెడ్డి అను ఇద్దరు కుమారులు,  హైమావతి అను ఒక కూతురు సంతానం. 

వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులు. లింగాల ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండితుడిగా పని చేసి పదవి విరమణ చేశారు.  వృత్తి పరంగా ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి చాలా మంది పండిత ఉపాధ్యాయులుగా ఎదగడానికి కారకులయ్యారు.  ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ఒక వైపు వ్యవసాయ క్షేత్రంలో, మరో వైపు సాహితీ క్షేత్రంలో కృషి చేశారు. సాహితీ క్షేత్రంలో వారు కృషి చేసిందంతా భక్తి మార్గమే.  అందుకనే వారి ద్యాసంతా  బడి, గుడి, మడిపైనే అంటారు.హలం పట్టి పొలం దున్నుతూ, కలం పట్టి కవిత రాస్తూ ' పాలమూరు పోతన ' గా పేరు తెచ్చుకున్నారు. 

 వీరు ప్రముఖ కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తికి అత్యంత సన్నిహితులు. అలాగే మరో  పాలమూరు కవి రుక్మాంగద రెడ్డి వీరికి అత్యంత ఆత్మీయులు. ఎంతగా అంటే శేఖర్ రెడ్డి తన కుమారుడికి తన మిత్రుడి పేరునే పెట్టుకునెంతగా . తన పెద్ద కుమారుడికి రుక్మాంగద రెడ్డి అని పేరు పెట్టి తన మిత్రుడి పట్ల తనకున్న వాత్సల్యాన్ని చాటిన స్నేహశీలి శేఖర్ రెడ్డి.  అలాగే రుక్మాంగద రెడ్డి కూడా  తన మిత్రుడి చివరి రచన రాఘవేంద్ర శతకాన్ని అచ్చు వేయించి మిత్రుడి ఋణం తీర్చుకున్నాడు.

మిత్రుడు రుక్మాంగద రెడ్డి మాటల్లో శేఖర్ రెడ్డి ... ." అతనిది స్వచ్ఛమైన మనసు.  ప్రేమమయ జీవనం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం.  జీవితాంతం గురువు గారికి సేవ చేసిన భాగ్యవంతుడు. నా అభివృద్ధికి ఎంతో తపన పడ్డాడు. నా మీది అంతులేని అభిమానంతో తన కొడుకుకు నా పేరు పెట్టకున్నాడు. ఎన్ని చెప్పినా అతని బాకీ తీరేది కాదు. కనుక తాను చివరి దశలో రాసిన 'గురు రాఘవేంద్ర ' శతకాన్ని అచ్చు వేయించాను." అంటాడు .

సాహిత్య కృషి

పాటలు, వచనం, పద్యం, సంకీర్తనల రూపంలో వీరి సాహిత్య కృషి సాగింది. కమలారామం అను వచన గ్రంథం, భజగోవిందం, భజేయతి రాజం, రాఘవేంద్ర స్తోత్రం మూడింటిని కలిపి గురుత్రయ స్తోత్రంగా తెలుగులోనికి అనువదించి, ముద్రించారు. వివేక శంఖారావం -1,  అనే ఖండకావ్యం, గాయత్రీ రామాయణం, హనుమద్రామాయణం అను గేయ రచనలను చేసి ప్రచురించారు. చాటువులు, రామగిరి రామయోగి చరితం, వేంకటాచల మహత్యం అను హరికథ,  దున్నయదాసు తత్వాలు వెలువరించారు. అభిలాష సాహితీ సాంస్కృతిక సంస్థకు ప్రధాన కార్యదర్శిగా  పనిచేశారు. అక్షర కిరణం, పసిడి మొగ్గల ప్రచురణలోనూ వీరి కృషి ఉంది.
;రచనలు
# గురుత్రయ స్తోత్రం
# వివేక శంఖారావం -1
# గాయత్రీ రామాయణం
# హనుమద్రామాయణం
# చాటువులు
# రామగిరి రామయోగి చరితం
# వేంకటాచల మహత్యం
# దున్నయదాసు తత్వాలు
# రాఘవేంద్ర శతకం

శేఖర్ రెడ్డి తేది: 11.05.2016 రోజు ఈ ప్రపంచాన్ని విడిచివెళ్ళారు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*

9, మార్చి 2014, ఆదివారం

మా పాలమూరు కవులు - అత్తాను రామానుజాచార్యులు

అత్తాను రామానుజాచార్యులు మహబూబ్ నగర్ జిల్లా లోని మునిపల్లె గ్రామానికి చెందిన వారు. పాండురాజు వంశస్థుడు. మదనగోపాల భక్తుడు. ' రుక్మిణీ కల్యాణం ' ను కురవంజి రూపంలో రచించాడు. ఇందులో దవళాలు, సువ్వాలలు, మంగళహారతులు మొదలగు దేశి రచనలు ఉన్నాయని పరిశోధకులు తేల్చినారు. ఈ రుక్మిణి కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యాలయంలో ఉంది. రుక్మిణీ కురవంజిలో ఓ మచ్చుతునక....
కొట్నాలు దంచేటప్పుడు పాడే సువ్వాల

"వన్నె సన్న నూది పచ్చ గన్నెరాలు కృష్ణ భోగి
సన్న రాజనాలు జీల సర్లు దంపు చూ
ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార
గబ్బి గుబ్బ లదగాను కలయదంచిరీ