27, ఆగస్టు 2014, బుధవారం

పాలమూరు కవిభీష్మ- కపిలవాయి లింగమూర్తి



కపిలవాయి లింగమూర్తి పాలమూరు జిల్లాకు చెందిన కవి, పరిశోధకులలో ప్రముఖుడు. జిల్లాలోని బల్మూర్ మండలం జినుకుంట లో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకుమార్చి 31, 1928 న జన్మించిన లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్ కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు. జిల్లాలోని అనేక స్థలపురాణాలను, దేవాలయాల చరిత్రను వెలికితీశారు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం ఇటీవల  గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 వ స్నాతకోత్సవంలో చాన్‌సలర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించనున్నారు. 

రచనలు 
వీరు దాదాపు 115 పుస్తకాలను రచించారు. అందులో చరిత్ర పైనే 15 గ్రంథాలు ఉన్నాయి. ఇప్పటి 70కు పైగా పుస్తకాలు ముద్రణకు నోచుకున్నాయి. వాటిలో కొన్ని...
     * ఆర్యా శతకం
  • ఉప్పునూతల కథ
  • క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర
  • చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం
  • తిరుమలేశ శతకం
  • దుర్గా భర్గ శతకాలు
  • పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు
  • పరమహంస శతకం
  • పాలమూరు జిల్లా దేవాలయాలు - 2010
  • భాగవత కథాతత్త్వం
  • మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర
  • శ్రీ భైరవకోన క్షేత్ర మాహాత్మ్యం
  • శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ఆరు ఆశ్వాసాల స్థల చారిత్రక కావ్యం
కపిలవాయి రచనలపై పరిశోధనలు
కపిలవాయి లింగమూర్తి కావ్యాలు, గీతాలు, శతకాలు, వచన సాహిత్యం, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. ఈ రచనలపై పలివురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు రూపొందినవి.
బిరుదులు
  • 1992 లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
  • 1996 లో కవికేసరి
  • 2005 లో వేదాంత విశారద
  • 2010 లో గురు శిరోమణి
  • 2012 లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి
సన్మానాలు
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖర్‌ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి.
కపిలవాయిపై డాక్యుమెంటరీ
వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*





2 కామెంట్‌లు: