23, జూన్ 2017, శుక్రవారం

మెర్సీ మార్గరెట్

మెర్సీ మార్గరెట్ వర్థమాన తెలుగు కవయిత్రి.  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన యువకవి. సామాజిక ఉద్యమకర్త.  సామాజిక మాధ్యమాల ద్వారా, మరి ముఖ్యంగా ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం ద్వారా విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. తాను రాసిన కవిత్వాన్ని 2014లో మాటల మడుగు పేరుతో కవితా సంకలనంగా వెలువరించింది. ఆమె వెలువరించిన ఈ తొలి సంకలనానికే ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి గానూ
'యువపురస్కారానికి ఎంపిక చేసింది.


జీవిత విశేషాలు
మెర్సీ మార్గరెట్  1983లో జన్మించింది. పుట్టింది,పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తల్లిదండ్రులది పూర్వపు ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని వల్లభాపురం. దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం అంతా హైదరాబాద్‌లోనే. సురేష్ జజ్జర ఆమె జీవిత భాగస్వామి.

కవి జీవిత ప్రస్థానం 
సామాజిక మాధ్యమాలలో కవిత్వ రాయడం ప్రారంభించిన ఆమె అనేక వేదికల మీద తన కవిత్వాన్ని వినిపించింది. ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం సమూహంలో అనేక కవితలను రాసింది. కేరళలో ప్రతి సంవత్సరం జరిగే తుంజన్ కవితోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే "దక్షిణ భారత కవుల సదస్సు "లో 2016 ఫిబ్రవరి లో తెలుగు కవిగా పాల్గొన్నది. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో డిల్లీ లో ప్రతి సంవత్సరం జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో 2016 ఫిబ్రవరి నాడు తెలుగు భాష నుండి యువ కవయిత్రిగా పాల్గొనే అవకాశాన్ని పొందింది.

రచనలు
# మాటల మడుగు: ఇది మెర్సీ మొదటి కవితా సంపుటి. 2014లో వెలువడింది. దీనిపై అనేక సమీక్షలు వచ్చాయి. దీనికి అనేక పురస్కారాలు దక్కాయి.

పురస్కారాలు 
*తెలుగు భాషా దినోత్సవం 29-8-2012 న అప్పటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా 'కవితా పురస్కారం'
*"మాటల మడుగు " కవిత్వానికి గాను - ప్రతిష్టాత్మక పెన్నా సాహిత్య పురస్కారం 2015.
*"మాటల మడుగు " కవిత్వానికి గాను- కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2017



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి