13, ఫిబ్రవరి 2013, బుధవారం

బురద కవిత



ఓ కవీ!
ఏమిటీ దిగులు?
కవిత రాయాలనుందా?
రాసెయ్
వస్తువా?
ఓర్నీ...మనిషిగూలా
నీ ఎదుటున్న మరో కవి మీద గీకెయ్
ఇప్పుడు నే చేస్తున్నది అదే కదా!
మనవైపు చూపే మూడు వేళ్ళ గురించేనా నీ ముచ్చట?
చత్...మరిచిపో
నీ చూపుడు వేళును ఎదుటివాడి గుండెలోకి కస్సుక్కున దించె కవిత రాసెయ్
నీ పాత సిరా ఒలకబోసి
నీ కొత్త కలం నిండా
బురద నింపి విషం కక్కుతూ కవిత రాసెయ్
అంతే!
క్షణాల్లో నీ చుట్టూ భజన బృందం
మెళ్ళో దండలు
ఒంటిపై శాలువాలు
ఇక ఎంచక్కా మెమొంటోను
ముద్దెట్టుకుంటూ
కవి కుర్చి మీద కులాసాగా బతికేయెచ్చు

13.02.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి