మా ఊరికి పోయిరావాలి!
నేను చేజార్చుకున్న
నా బాల్యపు తీపి గుర్తులను
ఏరి, వెంట తెచ్చుకోవాలి!
నేను మనిషిగా నడయాడిన
నా నీడలను
వెతికి వెతికి వెంట తెచ్చుకోవాలి!
మా ఊరికి పోయిరావాలి!
చిన్నప్పుడు నా పురికొన బస్సెక్కి
నా జైత్రయాత్రల్లో పాలుపంచుకున్న
నా బాల్యమిత్రులను కలుసుకోవాలి!
నిండా ఎండాకాలంలో
అర్ధరాత్రి దాకా మిత్రుల కబుర్లలో
మునిగి ఇంటిని మర్చిపోతే
చలువ బండల పరుపు పరిచి
నిద్రపుచ్చిన రచ్చబండను పలకరించి రావాలి!
మా ఊరికి పోయిరావాలి!
సామాజిక జీవన పులిజూదంలో
బక్క చిక్కిన సామాన్య జన మేకలన్నిటిని మోహరించి
పొగరెక్కిన ఊరి పెద్ద(ల) పులులనెట్లా బంధించాలో
బతుకుపాఠాలు నేర్పిన
మా ఊరి చావిడినొకసారి చూసిరావాలి!
కోడికన్నా ముందే నిద్రలేచి
ఊరి ఊరంతటిని
తన గిలుక చప్పుడు గీతంతో
మేల్కొల్పి మేల్కొల్పి మూగవోయిన
గిలుకబావినొకపారి చూసిరావాలి!
మా ఊరికి పోయిరావాలి!
కుల మతాల
కుళ్ళు గోడలను కూలదోసి
' అన్నా! అక్కా!' అనిపిల్చుకున్న
ఊరుమ్మడి బంధువులను పలకరించిరావాలి!
పిట్ట కావలి కాసి అలసిపోతే
పాలకంకుల పాలబువ్వ దిన్పించి
సేదదీర్చిన సేను నొకపరి చూసిరావాలి!
ఒంటికి ఇసుక మేదు గంధాన్ని పూసి
నదిలో చేప పిల్లలను చేసి ఒలలాడించిన
నా ఇసుక తిన్నెలు
ఏ ఒండ్రు మట్టి రాక్షస పాదాల కింద
అణిగిపోయాయో ఆనవాళ్ళు వెతుక్కోవాలి!
10.02.2013
నేను చేజార్చుకున్న
నా బాల్యపు తీపి గుర్తులను
ఏరి, వెంట తెచ్చుకోవాలి!
నేను మనిషిగా నడయాడిన
నా నీడలను
వెతికి వెతికి వెంట తెచ్చుకోవాలి!
మా ఊరికి పోయిరావాలి!
చిన్నప్పుడు నా పురికొన బస్సెక్కి
నా జైత్రయాత్రల్లో పాలుపంచుకున్న
నా బాల్యమిత్రులను కలుసుకోవాలి!
నిండా ఎండాకాలంలో
అర్ధరాత్రి దాకా మిత్రుల కబుర్లలో
మునిగి ఇంటిని మర్చిపోతే
చలువ బండల పరుపు పరిచి
నిద్రపుచ్చిన రచ్చబండను పలకరించి రావాలి!
మా ఊరికి పోయిరావాలి!
సామాజిక జీవన పులిజూదంలో
బక్క చిక్కిన సామాన్య జన మేకలన్నిటిని మోహరించి
పొగరెక్కిన ఊరి పెద్ద(ల) పులులనెట్లా బంధించాలో
బతుకుపాఠాలు నేర్పిన
మా ఊరి చావిడినొకసారి చూసిరావాలి!
కోడికన్నా ముందే నిద్రలేచి
ఊరి ఊరంతటిని
తన గిలుక చప్పుడు గీతంతో
మేల్కొల్పి మేల్కొల్పి మూగవోయిన
గిలుకబావినొకపారి చూసిరావాలి!
మా ఊరికి పోయిరావాలి!
కుల మతాల
కుళ్ళు గోడలను కూలదోసి
' అన్నా! అక్కా!' అనిపిల్చుకున్న
ఊరుమ్మడి బంధువులను పలకరించిరావాలి!
పిట్ట కావలి కాసి అలసిపోతే
పాలకంకుల పాలబువ్వ దిన్పించి
సేదదీర్చిన సేను నొకపరి చూసిరావాలి!
ఒంటికి ఇసుక మేదు గంధాన్ని పూసి
నదిలో చేప పిల్లలను చేసి ఒలలాడించిన
నా ఇసుక తిన్నెలు
ఏ ఒండ్రు మట్టి రాక్షస పాదాల కింద
అణిగిపోయాయో ఆనవాళ్ళు వెతుక్కోవాలి!
10.02.2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి