జీవితమంటే
అర్థం కావాలా?
కెరటాలపై ప్రయాణం చేసి చూడు
అర్థం అడిగి చూడు
జీవితమంటే అర్థం కావాలా?
బతుకు లైబ్రరీలో
భద్రపరిచిన అనుభవాల నిఘంటువులో
అర్థం వెతికి చూడు
ఇప్పటి దాకా
నడిచొచ్చిన పాదాల
అడుగుజాడల వెంట
వెనక్కి మరలి పాకుతూ వెళ్ళు
జీవితమంటే అర్థం కావాలా?
జ్ఞాపకాల దొంతరలో
అమర్చిన సంఘటనల అరను, అరను
తరచి, తరచి చూడు
ఆశల మైదానాలలో
నిరాశల ఎడారులలో
ఆశయాల శిఖరాలపై
అపజయాల అగాధాలలో
అడుగడుగు తిరిగి చూడు
నిందల బురదల్లో
గౌరవాల దండల్లో
ఊరేగి చూడు
గడిచిన జీవన గడియారంలో
మనసు నిమిషాల ముళ్ళు
పరిభ్రమించిన ప్రతి క్షణాన్ని
అడిగి చూడు
- Jayanna Naidugari
ఎగసి, పడి
పడి, ఎగసేకెరటాలపై ప్రయాణం చేసి చూడు
నవ్వే
పంటిని
ఏడ్చే
కంటినిఅర్థం అడిగి చూడు
జీవితమంటే అర్థం కావాలా?
బతుకు లైబ్రరీలో
భద్రపరిచిన అనుభవాల నిఘంటువులో
అర్థం వెతికి చూడు
ఇప్పటి దాకా
నడిచొచ్చిన పాదాల
అడుగుజాడల వెంట
వెనక్కి మరలి పాకుతూ వెళ్ళు
జీవితమంటే అర్థం కావాలా?
జ్ఞాపకాల దొంతరలో
అమర్చిన సంఘటనల అరను, అరను
తరచి, తరచి చూడు
ఆశల మైదానాలలో
నిరాశల ఎడారులలో
ఆశయాల శిఖరాలపై
అపజయాల అగాధాలలో
అడుగడుగు తిరిగి చూడు
నిందల బురదల్లో
గౌరవాల దండల్లో
ఊరేగి చూడు
గడిచిన జీవన గడియారంలో
మనసు నిమిషాల ముళ్ళు
పరిభ్రమించిన ప్రతి క్షణాన్ని
అడిగి చూడు
- Jayanna Naidugari
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి