22, ఫిబ్రవరి 2013, శుక్రవారం
21, ఫిబ్రవరి 2013, గురువారం
ఒరేయ్ ఉగ్రవాది!
ఒరేయ్! ఉగ్రవాది!
మనుషులను పిట్టలకన్నా
దారుణంగా మట్టుబెట్టమన్న నీ మతపిచ్చికి మంటబెట్టుకో !
లేదా...
నీ మతాన్ని మడిచి నీ
ముడ్డిలో దోపుకో!
ఒరేయ్! ఉన్మాది!
ఉన్నాడో లేడో తెలియిని
దేవుడి కొరకు
ఉన్న మనుషులనెందుకు
లేకుండా చేస్తున్నావు?
లుంబిని వన దహనాలతో
గోకుల్ చాట్
విద్వంసాలతో
నీ రక్తదాహం తీరలేదా?
మళ్ళి ఇప్పుడు
దిల్సుక్ నగర్ గుండె మీదెందుకు గాయం చేసావు?
పదుల సంఖ్యలో
ప్రాణాలెందుకు తీసావు?
20, ఫిబ్రవరి 2013, బుధవారం
ఆటవెలది .4
13, ఫిబ్రవరి 2013, బుధవారం
బురద కవిత
ఓ కవీ!
ఏమిటీ దిగులు?
కవిత రాయాలనుందా?
రాసెయ్
వస్తువా?
ఓర్నీ...మనిషిగూలా
నీ ఎదుటున్న మరో కవి మీద గీకెయ్
ఇప్పుడు నే చేస్తున్నది అదే కదా!
మనవైపు చూపే మూడు వేళ్ళ గురించేనా నీ ముచ్చట?
చత్...మరిచిపో
నీ చూపుడు వేళును ఎదుటివాడి గుండెలోకి కస్సుక్కున దించె కవిత రాసెయ్
నీ పాత సిరా ఒలకబోసి
నీ కొత్త కలం నిండా
బురద నింపి విషం కక్కుతూ కవిత రాసెయ్
అంతే!
క్షణాల్లో నీ చుట్టూ భజన బృందం
మెళ్ళో దండలు
ఒంటిపై శాలువాలు
ఇక ఎంచక్కా మెమొంటోను
ముద్దెట్టుకుంటూ
కవి కుర్చి మీద కులాసాగా బతికేయెచ్చు
13.02.2013
ఏమిటీ దిగులు?
కవిత రాయాలనుందా?
రాసెయ్
వస్తువా?
ఓర్నీ...మనిషిగూలా
నీ ఎదుటున్న మరో కవి మీద గీకెయ్
ఇప్పుడు నే చేస్తున్నది అదే కదా!
మనవైపు చూపే మూడు వేళ్ళ గురించేనా నీ ముచ్చట?
చత్...మరిచిపో
నీ చూపుడు వేళును ఎదుటివాడి గుండెలోకి కస్సుక్కున దించె కవిత రాసెయ్
నీ పాత సిరా ఒలకబోసి
నీ కొత్త కలం నిండా
బురద నింపి విషం కక్కుతూ కవిత రాసెయ్
అంతే!
క్షణాల్లో నీ చుట్టూ భజన బృందం
మెళ్ళో దండలు
ఒంటిపై శాలువాలు
ఇక ఎంచక్కా మెమొంటోను
ముద్దెట్టుకుంటూ
కవి కుర్చి మీద కులాసాగా బతికేయెచ్చు
13.02.2013
10, ఫిబ్రవరి 2013, ఆదివారం
మా ఊరికి పోయిరావాలి!
మా ఊరికి పోయిరావాలి!
నేను చేజార్చుకున్న
నా బాల్యపు తీపి గుర్తులను
ఏరి, వెంట తెచ్చుకోవాలి!
నేను మనిషిగా నడయాడిన
నా నీడలను
వెతికి వెతికి వెంట తెచ్చుకోవాలి!
మా ఊరికి పోయిరావాలి!
చిన్నప్పుడు నా పురికొన బస్సెక్కి
నా జైత్రయాత్రల్లో పాలుపంచుకున్న
నా బాల్యమిత్రులను కలుసుకోవాలి!
నిండా ఎండాకాలంలో
అర్ధరాత్రి దాకా మిత్రుల కబుర్లలో
మునిగి ఇంటిని మర్చిపోతే
చలువ బండల పరుపు పరిచి
నిద్రపుచ్చిన రచ్చబండను పలకరించి రావాలి!
మా ఊరికి పోయిరావాలి!
సామాజిక జీవన పులిజూదంలో
బక్క చిక్కిన సామాన్య జన మేకలన్నిటిని మోహరించి
పొగరెక్కిన ఊరి పెద్ద(ల) పులులనెట్లా బంధించాలో
బతుకుపాఠాలు నేర్పిన
మా ఊరి చావిడినొకసారి చూసిరావాలి!
కోడికన్నా ముందే నిద్రలేచి
ఊరి ఊరంతటిని
తన గిలుక చప్పుడు గీతంతో
మేల్కొల్పి మేల్కొల్పి మూగవోయిన
గిలుకబావినొకపారి చూసిరావాలి!
మా ఊరికి పోయిరావాలి!
కుల మతాల
కుళ్ళు గోడలను కూలదోసి
' అన్నా! అక్కా!' అనిపిల్చుకున్న
ఊరుమ్మడి బంధువులను పలకరించిరావాలి!
పిట్ట కావలి కాసి అలసిపోతే
పాలకంకుల పాలబువ్వ దిన్పించి
సేదదీర్చిన సేను నొకపరి చూసిరావాలి!
ఒంటికి ఇసుక మేదు గంధాన్ని పూసి
నదిలో చేప పిల్లలను చేసి ఒలలాడించిన
నా ఇసుక తిన్నెలు
ఏ ఒండ్రు మట్టి రాక్షస పాదాల కింద
అణిగిపోయాయో ఆనవాళ్ళు వెతుక్కోవాలి!
10.02.2013
నేను చేజార్చుకున్న
నా బాల్యపు తీపి గుర్తులను
ఏరి, వెంట తెచ్చుకోవాలి!
నేను మనిషిగా నడయాడిన
నా నీడలను
వెతికి వెతికి వెంట తెచ్చుకోవాలి!
మా ఊరికి పోయిరావాలి!
చిన్నప్పుడు నా పురికొన బస్సెక్కి
నా జైత్రయాత్రల్లో పాలుపంచుకున్న
నా బాల్యమిత్రులను కలుసుకోవాలి!
నిండా ఎండాకాలంలో
అర్ధరాత్రి దాకా మిత్రుల కబుర్లలో
మునిగి ఇంటిని మర్చిపోతే
చలువ బండల పరుపు పరిచి
నిద్రపుచ్చిన రచ్చబండను పలకరించి రావాలి!
మా ఊరికి పోయిరావాలి!
సామాజిక జీవన పులిజూదంలో
బక్క చిక్కిన సామాన్య జన మేకలన్నిటిని మోహరించి
పొగరెక్కిన ఊరి పెద్ద(ల) పులులనెట్లా బంధించాలో
బతుకుపాఠాలు నేర్పిన
మా ఊరి చావిడినొకసారి చూసిరావాలి!
కోడికన్నా ముందే నిద్రలేచి
ఊరి ఊరంతటిని
తన గిలుక చప్పుడు గీతంతో
మేల్కొల్పి మేల్కొల్పి మూగవోయిన
గిలుకబావినొకపారి చూసిరావాలి!
మా ఊరికి పోయిరావాలి!
కుల మతాల
కుళ్ళు గోడలను కూలదోసి
' అన్నా! అక్కా!' అనిపిల్చుకున్న
ఊరుమ్మడి బంధువులను పలకరించిరావాలి!
పిట్ట కావలి కాసి అలసిపోతే
పాలకంకుల పాలబువ్వ దిన్పించి
సేదదీర్చిన సేను నొకపరి చూసిరావాలి!
ఒంటికి ఇసుక మేదు గంధాన్ని పూసి
నదిలో చేప పిల్లలను చేసి ఒలలాడించిన
నా ఇసుక తిన్నెలు
ఏ ఒండ్రు మట్టి రాక్షస పాదాల కింద
అణిగిపోయాయో ఆనవాళ్ళు వెతుక్కోవాలి!
10.02.2013
5, ఫిబ్రవరి 2013, మంగళవారం
ఆటవెలది. 3
4, ఫిబ్రవరి 2013, సోమవారం
నే..తీసిన ఫోటో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





