జయన్న గారూ, మీ పద్యం బాగుంది. "గుణము నెంచవలదు" అనండి. అక్కడ "యెంచవలదు" అని యడాగమం రాకూడదు. మీకు పద్యరచన పట్ల ఆసక్తికి సంతోషం. దయచేసి ఒకసారి "శంకరాభరణం" బ్లాగు చూడండి. http://kandishankaraiah.blogspot.in
గురువులకు వందనాలు ! మీ సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాను. మీ ప్రొత్సాహనికి ధన్యవాదాలు. మీ శంకరాభరణం బ్లాగ్ తరుచూ చూస్తుంటాను. ఓ రెండు సమస్యలకు పూరణలు కూడా రాశాను.
మీ భావంలో చక్కదనం, ఆటవెలది వ్రాయాలన్న మీ ఆసక్తి నన్ను ఆకర్షించాయి. అభినందనలు! అయితే చిన్న చిన్న వ్యాకరణ దోషాలను తొలగించేందుకు, భావ వ్యక్తీకరణలో మరింత స్పష్టత పెంచేందుకు - మీ పద్యాన్ని ఇలా మారిస్తే బాగుంటుంది.
"ఎదుటి వాని గుణము నెంచవలదు; మన తీరు బట్టి వాని తీరునుండు! అద్దమందు జూడ నగుపించు మన బొమ్మె! జయుని మాట నిజము జాబిలమ్మ!"
మీరు మరిన్ని మంచి భావాలతో, మరిన్ని మంచి పద్యాలను రచించి, ’జాబిలమ్మ శతకము’ను పూర్తి చేయాలని నా ఆకాంక్ష! విజయోస్తు!
జయన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది.
"గుణము నెంచవలదు" అనండి. అక్కడ "యెంచవలదు" అని యడాగమం రాకూడదు.
మీకు పద్యరచన పట్ల ఆసక్తికి సంతోషం. దయచేసి ఒకసారి "శంకరాభరణం" బ్లాగు చూడండి.
http://kandishankaraiah.blogspot.in
గురువులకు వందనాలు !
తొలగించండిమీ సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాను. మీ ప్రొత్సాహనికి ధన్యవాదాలు.
మీ శంకరాభరణం బ్లాగ్ తరుచూ చూస్తుంటాను. ఓ రెండు సమస్యలకు పూరణలు కూడా రాశాను.
జయన్న గారు!
రిప్లయితొలగించండిమీ భావంలో చక్కదనం, ఆటవెలది వ్రాయాలన్న మీ ఆసక్తి నన్ను ఆకర్షించాయి. అభినందనలు!
అయితే చిన్న చిన్న వ్యాకరణ దోషాలను తొలగించేందుకు, భావ వ్యక్తీకరణలో మరింత స్పష్టత పెంచేందుకు - మీ పద్యాన్ని ఇలా మారిస్తే బాగుంటుంది.
"ఎదుటి వాని గుణము నెంచవలదు; మన
తీరు బట్టి వాని తీరునుండు!
అద్దమందు జూడ నగుపించు మన బొమ్మె!
జయుని మాట నిజము జాబిలమ్మ!"
మీరు మరిన్ని మంచి భావాలతో, మరిన్ని మంచి పద్యాలను రచించి, ’జాబిలమ్మ శతకము’ను పూర్తి చేయాలని నా ఆకాంక్ష!
విజయోస్తు!
గౌ. ఆచార్యులకు నమస్కారాలు
తొలగించండిమీ ప్రశంసకు, ఆశిస్సులకు , సూచనలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సదా మీ ఆశిస్సులు ఆకాంక్షిస్తూ...
-జయన్న