13.10. 2013
రా. 10. 30 గం. లకు మురుడేశ్వర్ నుండి హుబ్లీకి బయలుదేరాం. తెల్లవారుజామున 3 గ.లకు హుబ్లికి చేరుకున్నాం. హుబ్లి నుండి గదగ్, అక్కడి నుండి బయలుదేరి ఉ. 8 గం. లకు హోస్పేట్ కు చేరుకున్నాం. పట్టణంలోకి వెళ్ళకుండా, ఊరి బయటే డ్యాం దగ్గరే బస్ దిగి డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం కు ముందు పచ్చటి పార్క్ ఒకటి మనకు ఆహ్వానం పలుకుతుంది. పార్క్ నుండి, మరియు ఎగువ భాగాన కొండ పక్కల దారి వెంట కూడా డ్యాం కు చేరుకోవచ్చు. కొండ పక్కల దారి వెంట డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం దగ్గరలో కుడివైపు దిగివ కాలువలో స్నానాదికాలు కానిచ్చి, డ్యాం దగ్గరకు వెళ్ళాం.
కర్ణాటక లోని
బళ్ళారి జిల్లాలో హోస్పేట్ దగ్గర తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ డ్యాం చూపరులను
ఆకట్టుకుంటుంది. నీటి పారుదల అవసరాలు,
విద్యుత్ ఉత్పత్తి, వరదల నివారణ కొరకు బహుళ ప్రయోజన
ప్రాజెక్ట్ గా 1945 లో
మద్రాస్ ప్రెసిడెన్సీ, నిజాం సర్కార్లు ఉమ్మడిగా నిర్మించ
తల పెట్టగా, 1953 లో
కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వాలు ఉమ్మడిగా పూర్తి
చేశాయి. కనుచూపు మేర విస్తరించిన అతి పెద్ద జలాశయం మనసును నీటి అలల్లో ముంచి
తేల్చుతుంది. తుంగభద్ర నదిపై ఇదే అతి పెద్ద జలాశయం. 423 TMC నిల్వ సామర్థ్యం కలిగి, 35.36 మీటర్ల ఎత్తుతో, 2,449 మీటర్ల పొడువు కలిగి నీటిని నిల్వచేస్తుంది. అప్పటి మద్రాస్ ఇంజనీర్ డా. తిరుమలై
అయ్యంగారు ఈ డ్యాం రూప శిల్పి. వారి విగ్రహాన్ని జలాశయానికి అనుకొని ఉన్న పార్కులో
చూడవచ్చు. ఈ డ్యాం నుండి వదిలె ఎడమ కాలువ నీరు పూర్తిగా కర్ణాటక అవసరాలకు వినియోగం కాగ, కుడి వైపు నిర్మిచించిన రెండు కాలువలు ( ఎగువ కాలువ, దిగువ
కాలువ ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత అవసరాలకు
వినియోగిస్తున్నారు. ఈ డ్యాం కు కుడివైపు
సండురు కొండ ఉంది. దాని మీదికి వెళ్ళి చూస్తే
డ్యాం అందాలు మరింత రమణీయంగా కనిపిస్తాయి.
డ్యాం పై
భాగంలో అందాలన్ని దర్శించాక అక్కడ ఓ క్యాంటిన్ లో టీ తాగి , డ్యాం
ముందు, దిగువలో ఏర్పాటు చేసిన పార్క్ లో కాసేపు విశ్రాంతి
తీసుకొని, బయటకు నడిచాం. బయటకు వచ్చే దారిలో పార్క్ లో జల
విహారానికి చిన్న సైజు బోటింగ్ ఏర్పాటు ఉంది. కాసేపు అక్కడ ఆగి, పట్టణం వైపు వెళ్ళిపోయాం.
మ. 12 గం. లకు హోస్పేట్ పట్టణ బస్ స్టాండ్ కు చేరుకున్నాం - హంపికి వెళ్ళే యోచనతో...- నాయుడుగారి జయన్న
ఫోటోలు, వివరణ చక్కగా ఉన్నాయి. అభినందనలు
రిప్లయితొలగించండిధన్యవాదాలు తేజస్వి గారు
రిప్లయితొలగించండి