పవనపుత్ర శతకం - వెనుక మాట
-ఎం.డి. ఉస్మాన్,వెనుకమాట. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదా! నాకు కూడా అలానే అనిపించింది. కానీ it's a spontaneous word that arose in my mind immediately after reading the poetry. Moreover the great poet William Wordsworth said that "poetry is a spontaneous overflow of poets emotions", like wise, I got this word spontaneously. కాబట్టి ఈ పదాన్ని వాడా..! మన జయన్న కూడా ఈ శతకంలో అన్నారు "వచన కవిత యనుచు వంత వద్దు" అని, కాబట్టి నేను కరెక్టే... అని నా భావన. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది అదేమంటే "ముందుమాట" రాసే అవకాశం, అదృష్టం నాకు రాదేమో ఎందుకంటే అది అంత అలవోక కాదు మరియు నేను అంత అర్హుడిని కూడా కాదు.
జయన్న శతకం మొదటి పద్యం చదవగానే , వేమన శతకం కోసం google లో చూడాలనిపించింది శతకానికి కూడా invocation ఉంటుందా అని? A great English poet Milton the "Paradise Lost" (an epic) ప్రారంభంలో అంటాడు.. "I invoke Thy aid to my adventurous song"అని. మన జయన్న గారు కూడా తన శతక ప్రారంభంలో " దీన కవికి తమ దీవెనలొసుగుము" అన్న మాటలు తనప్రభు భక్తికి వినమ్రతకు నిదర్శనం.
ఇక పద్యాల విషయానికొస్తే... బాగున్నాయి... చాలా బాగున్నాయి.... అద్భుతంగా ఉన్నాయి... ఇలా ఏమన్నా, మీ పదాలను, పద్యాలను తక్కువ చేసినట్లు అవుతుందేమో. ఎందుకంటే those are not simply words.. those are your deepest thoughts which were adorned with grammar and syntax.
"సిరుల కంటే విద్య గొప్పదనే" విషయాన్ని మీరు వర్ణించిన తీరు అద్వితీయం."ఎదుటివాడి గుణము నెంచవలదు" కూడా బాగా నచ్చింది ఎందుకంటే మనకు నచ్చనిది ఎదుటివారికి కూడా నచ్చకపోతే దాని గురించి చర్చిస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. గురువులను గౌరవించడానికి రెండు చేతులు ఉంటే చాలు అన్న మాట, అక్షలారా నిజము . "కడుపు నిండిన వాడి మాట కడుపు మండిన వాడి మాట"ల మధ్య వ్యత్యాసం బాగా వర్ణించారు.
"I know your simplicity and sensibility." "యముడి బాధ కన్నా నదికమ్ముగదనింద".. చదవగానే మీతో నేను గడిపిన రోజులలో చూసిన మీ వ్యక్తిత్వం గుర్తుకు వచ్చింది."కష్టమేది కలుగ కనిపించదరు మీరు"..
నిజమే.. కష్టాలు వచ్చినప్పుడు మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇది చదివినప్పుడు చిన్నప్పుడు పరీక్షల సమయంలో "మసీదు"కు వెళ్లడం గుర్తుకొచ్చింది. "కులము పేరు చెప్పి బలము పెంచుకొనుచు" ప్రస్తుత పరిస్థితిని ,రాజకీయ నాయకులకు కుస్తీ ని తెలియజేస్తుంది.
"రాతదుడిచి గొప్ప గీత గియ్యవ స్వామి".. as teachers we teach all the students at the same valume, ఎవరెట్లా స్వీకరిస్తారు అనేది వారిపై ఆధారపడి ఉంటుంది in the same way , a mother looks after her all children with the same love and affection, కానీ ఆ సామి అందరి గీతలు ఒకే రకంగా ఎందుకు గీయడో... సమాధానం దొరకని ప్రశ్న.
"కలల యందు మనకు కానిదేముందిరా" సాధారణ, మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం."చదువుకొనగ రాదు చదువు"కొనగ"వచ్చు.. సరళ పదాలతో నేటి విద్యా దుస్థితి కి అద్దం పడుతుంది. ఇక నేటి రాజకీయ నాయకుల పరిస్థితిపై, రాజకీయ దుస్థితిపై కవి ఎక్కుపెట్టిన బాణం గురి తప్పలేదు.
నిజమే.."పేద ఇంట ధనము పిసరైనా నిలవదు". ఈ పద్యం ద్వారా పునస్మరణ జరిగింది, కానీ కారణం దొరకలేదు."వాగులన్నీ గలసి వార్థి జేరువిధము" తో పోల్చడం జయన్న గారి సాహిత్య జ్ఞాన పరిపక్వతకు నిదర్శనం."రవిని వెతికినటుల రాతిరి సమయాన" మరొకటి.
చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్న.. ఈ పుస్తకం ప్రారంభం నుండి చివరి వరకు ఒకే sitting లో చదివా. అంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆలోచనలను రేకెత్తించింది ఈ పుస్తకం. వెనువెంటనే నా అభిప్రాయాన్ని రాస్తూ చదివిన పద్యాలను నెమరు వేసుకుంటున్న.. ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక సంకలనాలు మీ కలము వెంట జాలువారాలని మనసారా కోరుకుంటున్న..
-ఎం.డి. ఉస్మాన్,
చాలా బాగా రాశారు సార్..
రిప్లయితొలగించండి