26, జులై 2014, శనివారం

ఆటవెలది


 


కంటిలోన గింత కరుణ లేని మనిషి 
మనసులోన కొంత మంచి లేక 
మనిషి యెట్లు యవును మానుయవును గాని 
జయుడి మాట యిదియె జాబిలమ్మ

2 కామెంట్‌లు:

  1. జయన్న గారూ,
    మంచి ప్రద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘గింత’ అని తెలంగాణ మాండలికం ప్రయోగించారు. ‘ఎట్లు + అవును, మాను + అనువు’ అన్నప్పుడు యడాగమం రాదు.. మీ పద్యానికి నా సవరణ...

    కంటిలోన సుంత కరుణ లేని మనిషి
    మనసులోన కొంత మంచి లేక
    మనిషి యెట్టు లగును మ్రాను తా నగు గాని
    జయుడి మాట యిదియె జాబిలమ్మ.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారికి నమస్కారాలు.
    మీ సూచనకు ధన్యవాదాలు. మీ సవరణనే తుది కూర్పుగా భావిస్తాను. సదా మీ సలహాలు, సూచనలను ఆకాంక్షిస్తూ..

    రిప్లయితొలగించండి