11, మే 2019, శనివారం

ఎప్పుడు_ మాత్రం...



ఎప్పుడు_ మాత్రం...

నడక మొదలైనప్పుడు శిఖరం వైపు
ఒక చెయ్యి కూడా మన వీపు మీద ఉండదు

శిఖరానికి చేరే క్రమంలో
ముళ్ళు, రాళ్ళు తొక్కి కందిన పాదానికి
ఏ హస్తమూ లేపనం రాయదు.

శిఖరం మీద ఉన్నంత కాలం
తలెత్తి ఒక నేత్రమన్న అసూయ నొదిలి
మన విజయాన్ని హర్షించదు

పడినా,
ఎవడైనా దొబ్బినా
శిఖరం మీద నుండి లోయలోకి
ఇక అంతే...

మనతో రాలేక
ఒక్క అడుగన్న వేయలేక
అక్కడే ఆగిపోయిన కాళ్ళు
తొక్కడానికి సిద్దంగా ఉంటాయి.
చూపడానికి వేళ్ళు వెర్రెత్తి పోతుంటాయి.

#నాయుడు_గారి_జయన్న

4 కామెంట్‌లు:

  1. వామ్మో ఏంది స్వామీ ఈ తవిక

    రిప్లయితొలగించండి
  2. పనిలో పనిగా మనకు ఎక్కడ బెడిసిందో కూడా సెలవివ్వరా స్వామీ. సవరించుకోగలను అల్పుడను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారీ బ్రదర్. సరిగ్గా చదవలేదు. బాగుంది. శ్రీశ్రీ రాసిన నెత్తురుకక్కుకుంటూ నీ రాలిపోతే పదాలు తలపించింది.

      తొలగించండి