మహబూబ్ నగర్ జిల్లా లోని గిరిదుర్గాలలో '''చంద్రగఢ్ కోట ''' ఒకటి. ఇది జిల్లాలోని నర్వ
మండలం లో చంద్రగఢ్ అనే గ్రామ సమీపంలో ఉంది.
ఉనికి
ఈ కోట గద్వాల కు వాయువ్యాన 20 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరు పట్టణానికి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో, పర్యాటక ప్రాంతమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కు ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ధర్మాపూర్, చిన్న
కడుమూరు, బెక్కెరపల్లె, ప్రియదర్శిని మొదలగునవి దీని
చుట్టుపక్కల గ్రామాలు. ధర్మాపూర్, చంద్రఘడ్ ఒకే పంచాయతీ
గ్రామాలు.
కోట నిర్మాణం
చంద్రఘడ్ గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన కొండ ఉంది. ఆ
కొండ మీద రెండు అంచెలుగా ఈ కోటను నిర్మించారు. చుట్టు పక్కల పది కిలోమీటర్ల
పరిధిలో ఎక్కడ నుండి చూసినా ఈ కొండ, కొండ మీది కోట
కనిపిస్తాయి. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే ఉండటం విశేషం. ఈ నాటికి
చెక్కుచెదరని రాతికట్టడం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనిని 18 వ
శతాబ్ధిలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో, ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు
కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడంటారు. కొండపై మొదటి భాగంలో
విశాలమైన ఆవరణాన్ని చుట్టి రక్షణగోడ ఉంది.
దానిని దాటి మరింత పైకి వెళ్తే, మరింత ఎత్తులో అద్భుత నిర్మాణంతో
కూడిన రాతికోట కనిపిస్తుంది. దీనికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమం వైపు
ప్రధాన ద్వారం, ఉత్తరం వైపు మరో ద్వారం. ఉత్తర ద్వారం మరింత
ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని ఇక్కడ ప్రవేశం లేదిప్పుడు. ఒకప్పుడు ఇది అత్యవసర
ద్వారం లాగా ఉండేదేమో! కోట వెనుకంతా కొండ మీద ఏక శిలలా కనిపించే బండ ఉంది. ఆ
బండమీదే కోట వెనుక భాగపు గోడను నిర్మించారు. పై కోట ఎక్కడా శిథిలమైనట్టు
కనిపించదు.
కోట లోపల
శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అలయం చుట్టూ 8 ఊట
బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును
అందిస్తున్నాయి. శ్రీరామలింగేశ్వరస్వామికి ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు
నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు కొండపై జాతర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తుంటారు.
పర్యాటకులకు సూచనలు
* గద్వాల నుండి, ఆత్మకూరు నుండి బస్సు
ప్రయాణం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఏ ప్రాంతం నుండి వచ్చినా చంద్రగఢ్
స్టేజి దగ్గరో, లేదా
ప్రియదర్శిని కాలనీ కూడలి దగ్గరో దిగితే సరిపోతుంది. అక్కడి నుండి రెండు
కిలో మీటర్లు ఆటోలలో ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
* లోపలి కోట ఉదయం 7 గంటల
నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఆ సమయాలలో
చేరుకోవటం ఉత్తమం.
* ఒకవేళ పగలు ఏ వేళలో అయినా గ్రామానికి చేరినా, ముందు గ్రామంలోని పూజారి నర్సప్ప ఇంటిదగ్గర తాళం తీసుకవెళ్ళి కోటను
దర్శించవచ్చు.
Youtubeలో చంద్రఘడ్ కోట
Youtubeలో చంద్రఘడ్ కోట
బాగా రాసారు. కోటలో గుడి ఫోటో కూడా పెట్టండి సర్
రిప్లయితొలగించండిధన్యవాదాలు మేడం. గుడి ఫోటోలు చేర్చాను.
రిప్లయితొలగించండి