7, ఏప్రిల్ 2013, ఆదివారం

అన్న గారి బొమ్మ ఎవరి హక్కు?

ఇప్పుడు రాష్ట్ర మంతా చర్చోపచర్చలు అన్ని  TV  చానల్స్ లోను -"ఎన్టీఆర్ ఫోటో వాడుకునే హక్కు  ఎవరికుందని ?
   సంపాదించిన ఆస్తులు పంచు కొని, అనారోగ్యం పాలైనా ఆలనా పాలనా చూడని నందమూరి వంశాంకురాలకా ?
జీవిత చరిత్ర రచన పేరుతొ జీవితంలోకి ప్రవేశించి, మహోన్నత శిఖరం నేలకొరగటానికి కారణమైన నందమూరి (?!) లక్ష్మీ పార్వతికా? పిల్లనిచ్చి , పదవినిచ్చిన పాపానికి పార్టీ నుండి, పదవుల నుండి మెడ పట్టి గెంటి వేసి, అవమాన భారంతో అనుక్షణం కుమిలి కుమిలి అనంత లోకాలకు వెళ్ళడానికి కారణమైన బాబుకా? ఆ బాబు తమ్ముళ్ళకా?
బతికనంత కాలం తిట్టి పోసిన తల్లి  పాముకా (కాంగ్రేస్)? పదవే పరమావధిగా అవినీతి మార్గాన బుసలుకొడుతూ పరుగులు తీస్తున్న పిల్ల పాముకా?'' అని. నిజానికి వీరెవరికి ఆ  హక్కు లేదు. అన్న అంటే రాముడని, కృష్ణుడని, అవతార పురుషుడని నమ్మి అభిమానించిన అభిమానులకు తప్పా.
























                                       కార్టునిస్ట్ శ్రీధర్ స్ఫూర్తితో 1999 లో నేను గీసిన క్యారికేచర్లు







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి