26, డిసెంబర్ 2019, గురువారం
ఏది చీకటి? ఏది వెలుతురు?
27, నవంబర్ 2019, బుధవారం
మేం మనుషులమేనా?
అమ్మా!
మేం గుండెలేని మొండి మనుషులం
కరుణలేని కఠినాత్ములం
అనంత పాపపంకిలంలో మునిగితేలుతున్న పాపాత్ములం
మీరు చస్తేనే చలించలేదు
ఈ కన్నీళ్ళకు కరిగిపోతమా?
మీరు మాలాగే బండగా బతకడం నేర్చుకొండి
మేం గుండెలేని మొండి మనుషులం
కరుణలేని కఠినాత్ములం
అనంత పాపపంకిలంలో మునిగితేలుతున్న పాపాత్ములం
మీరు చస్తేనే చలించలేదు
ఈ కన్నీళ్ళకు కరిగిపోతమా?
మీరు మాలాగే బండగా బతకడం నేర్చుకొండి
మీ కష్టాలు మీవే
మీ కన్నీళ్ళు మీవే
మీ బతుకు ఇక్కడ ఎవరికి కాబట్టింది కనుక
ఎవడి పనుల్లో వాడున్నాడు
తోడొచ్చే ఉద్యోగులు ఎక్కడ తొంగొని ఉన్నారో ఎవరికి ఎరుక?
ఏసిన మెతుకులు ఏరుకోవటంలో కొందరు బిజీ
ప్రభువుల పల్లకీ మోయడానికి కొన్ని భుజాలు రెడీ
భజనలు, బాకాలు సరేసరి

న్యాయదేవత కళ్ళకు గంతలుండటం పాతమాట
నోటికి కూడా ఇప్పుడు కొత్త మూత
అందుకనే అటువైపు చూడకండి
మేము మనుషులమన్న మాట మర్చిపొండి
పైనున్నాడో లేదో తెలియదు
ఉన్నా లేకున్నా మీ ఉసురైతే ఊరికే పోదు
అది చూడడానికైనా అగండి
అది చూడడానికే బతుకండి.
నోటికి కూడా ఇప్పుడు కొత్త మూత
అందుకనే అటువైపు చూడకండి
మేము మనుషులమన్న మాట మర్చిపొండి
పైనున్నాడో లేదో తెలియదు
ఉన్నా లేకున్నా మీ ఉసురైతే ఊరికే పోదు
అది చూడడానికైనా అగండి
అది చూడడానికే బతుకండి.
- ఎన్. జయన్న
30, అక్టోబర్ 2019, బుధవారం
12, అక్టోబర్ 2019, శనివారం
ప్రగతిచక్రాల కింది ఖాకీ
10, సెప్టెంబర్ 2019, మంగళవారం
గద్వాల పిజి సెంటర్
* గద్వాల పిజి సెంటర్ కు మంచి రోజులు
* సిద్దమవుతున్న వసతి గృహాలు
* విద్యార్థులకు తప్పనున్న అవస్థలు
గద్వాల పిజి సెంటరు ప్రగతికి ప్రధాన అవరోధమైన వసతి గృహాల సమస్య త్వరలో
తీరనున్నది. స్త్రీ, పురుషులకు రెండు వసతి గృహాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. కృష్ణానది తీరాన 17 ఎకరాల సువిశాల సుందర స్థలంలో,
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన పిజి సెంటర్లో అధ్యయన కేంద్రం, వసతి గృహాల సముదాయం ఇక
విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వసతి గృహాలు ఏర్పాటుకావడం వలన ఇక్కడి పిజి
సెంటర్లోని కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది.
విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని కొత్త కొర్సులు వచ్చే అవకాశం ఉంటుందని,
తద్వారా అక్షరాస్యతలో వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం విద్యలో పురోగతి సాధించగలదని
ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.
1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎం.సి.ఏ., ఎం.కాం.,
కోర్సులతో గద్వాల పట్టణంలో పిజి సెంటర్ ఏర్పడింది. పట్టణంలోని డి.కె. సత్యారెడ్డి బంగ్లాలో
మొదట్లో తాత్కాలికంగా నిర్వహించారు. నదీ అగ్రహారం దగ్గర పిజి సెంటర్ నిర్మాణం
అయ్యాకా పట్టణం నుండి అధ్యయన కేంద్రం అక్కడికి చేరింది. కొంత కాలం పాటు పట్టణం పిజి విద్యార్థులతో
కళకళలాడింది. తదనంతర కాలంలో ఎం.సి.ఏ., కోర్సుకు డిమాండ్ తగ్గడంతో విద్యార్థులు
ఎవ్వరూ ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోవడంతో మూతపడింది. దానితో కేంద్రంలోని కంప్యూటర్లు, ఇతర సామాగ్రి పాలమూరు
విశ్వవిద్యాలయానికి తరలించారు. గద్వాలకు పిజి సెంటర్ వచ్చినట్లే వచ్చి,
దూరమైపోయింది. దేశంలోనే అక్షరాస్యతలో
వెనుకబడిన ప్రాంతానికి ఒక దశాబ్దం పాటు ఆ విధంగా స్నాతకోత్తర విద్య దూరమయ్యింది.
అనేక అందోళనలు, అనేక పరిణామాల అనంతరం
తిరిగి 2013 సంవత్సరంలో పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పునఃప్రారంభమైంది. విద్వద్గద్వాలగా
పేరొందిన ప్రాంతం కావడం, సాహిత్యంతో విడదీయరాని అనుబందం కలిగిన ప్రాంతం కావండంతో ఎం.ఏ.,
(తెలుగు) కోర్సుతో పునఃప్రారంభించారు. దీనితో పాటు ఎం.ఏ., (ఆంగ్లం), ఎం.కాం.,
కోర్సులు కూడా ప్రారంభించారు. పిజి సెంటరులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6
ఆరుగురు అకాడమిక్ కన్సల్టెంట్లు, ఇద్దరు పార్టు టైం ఉపన్యాసకులు పనిచేస్తున్నారు. సాఫీగా సాగుతున్న కళాశాల ప్రయాణంలో మళ్ళీ
కుదుపులు. సరైన వసతులు లేవని, రవాణా
సౌకర్యం లేదని, వసతి గృహాలు లేవని విద్యార్థులు చేరటం తక్కువైంది. చేరిన వారు కూడా
మధ్యలోనే వదిలేసి వెళ్ళడం సాధారణమైంది. విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అసలు చేరటం
లేదని తెలుగును పాలమూరు సెంటరుకు, ఆంగ్లాన్ని
కొల్లాపూరు సెంటరుకు మార్చాలని ప్రయత్నాలు జరిగాయని అంటారు. విద్యావంతులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని అంటారు. కళాశాల ప్రస్తుతం సాఫీగా సాగుతుంది.
స్త్రీలకు, పురుషులకు రెండు వసతి
గృహాలు నిర్మాణమవుతున్నాయి. ఇవి పూర్తైతే
మరిన్ని కొత్త కోర్సుల ఆగమనంతో కళాశాల
విద్యార్థులతో కళకళలాడుతుంది. వెనుకబడిన ప్రాంతానికి స్నాతకోత్తర విద్య మరింత
అందుబాటులోకి వస్తుంది. నడిగడ్డ ప్రాంత
విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రగతి బాటలో నడవాలని ఆశిస్తున్నాను.
-ఎన్. జయన్న
పురుషుల వసతి గృహం
స్త్రీల వసతి గృహం
లేబుళ్లు:
అవి ఇవి,
చదువు సంగతులు,
నా ఛాయా చిత్రాలు
15, ఆగస్టు 2019, గురువారం
2, ఆగస్టు 2019, శుక్రవారం
జాని తక్కెడశిల
జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితావస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.
విద్యాభ్యాసం
జాని పాఠశాల విద్యను తన స్వస్థలం పులివెందులలోని నాగార్జున హైస్కూల్ లోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్. బి మెమోరియల్ హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ బై.పి.సి పూర్తి చేశారు. అనంతరం పులివెందుల లయోలా పాల్ టెక్నికల్ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో అమీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఎం. టెక్., పూర్తి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా పొందారు. కంప్యూటర్ మరియు సాంకేతిక విద్యలో సి, జావా, ఓరాకిల్ మొదలగు దాదాపు ఇరవైకి పైగా టెక్నికల్ కోర్సులు పూర్తిచేసారు.
వృత్తి
మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.
రచనలు
ఇప్పటి వరకు వీరు కవిత్వానికి సంబంధించి ఆరు పుస్తకాలు వెలువరించారు. మరెన్నో కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో రాస్తూనే ఉన్నారు. జిందగీ కె హీరే అను పుస్తకాన్ని హిందీ భాషలో రాశారు. ఈ పుస్తకం నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం. 160 మంది కవులు అమ్మపై రాసిన కవితలను మాతృస్పర్శ పేరుతో వీరి సంపాదకత్వంలో సంకలనంగా తీసుకవచ్చారు. దాదాపు ఇరవైకి పైగా సంకలనాలలో వీరి కథలు, కవితలు ముద్రించబడ్డాయి.
వీరి ముద్రిత రచనలు
1.అఖిలాశ
2.విప్లవ సూర్యుడు
3.నక్షత్ర జల్లులు (కొత్త సాహిత్య ప్రక్రియ)
4.వై (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
5.బురద నవ్వింది
6. జిందగీ కె హీరే (నానోలు హిందీలో)
7.లై అనే ఆంగ్ల కవిత్వ సంపుటి
అముద్రిత రచనలు
1.బాలల కథలు
2.బాలల గేయాలు
3.ముస్లిం మైనార్టీ కథలు
4.శివారెడ్డి కవిత్వం-ఒక అవగాహన వ్యాస సంపుటి (శివారెడ్డి గారి సమగ్ర కవిత్వంపై విశ్లేషణలు)
5.డా. ఎన్ గోపి కవిత్వం-ఒక పరిశీలన (గోపి గారి సమగ్ర కవిత్వంపై వ్యాస సంపుటి)
6.డా. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి రచనలు - ఒక పరిశీలన
=== పురస్కారాలు ===
#సత్రయాగం సాహిత్య వేదిక నుండి కవి మిత్ర పురస్కారం
#ప్రతిలిపి సాహిత్య వేదిక నుండి కథా భారతి పురస్కారం
#కవి సమ్మేళనం సాహిత్య వేదిక నుండి ఉగాది పురస్కారం
#బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం
#చెన్నై కి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి తెలుగు వెలుగు పురస్కారం
#ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం
#కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం
# “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019
విద్యాభ్యాసం
జాని పాఠశాల విద్యను తన స్వస్థలం పులివెందులలోని నాగార్జున హైస్కూల్ లోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్. బి మెమోరియల్ హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ బై.పి.సి పూర్తి చేశారు. అనంతరం పులివెందుల లయోలా పాల్ టెక్నికల్ కాలేజ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో అమీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఎం. టెక్., పూర్తి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా పొందారు. కంప్యూటర్ మరియు సాంకేతిక విద్యలో సి, జావా, ఓరాకిల్ మొదలగు దాదాపు ఇరవైకి పైగా టెక్నికల్ కోర్సులు పూర్తిచేసారు.
వృత్తి
మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.
రచనలు
ఇప్పటి వరకు వీరు కవిత్వానికి సంబంధించి ఆరు పుస్తకాలు వెలువరించారు. మరెన్నో కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో రాస్తూనే ఉన్నారు. జిందగీ కె హీరే అను పుస్తకాన్ని హిందీ భాషలో రాశారు. ఈ పుస్తకం నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం. 160 మంది కవులు అమ్మపై రాసిన కవితలను మాతృస్పర్శ పేరుతో వీరి సంపాదకత్వంలో సంకలనంగా తీసుకవచ్చారు. దాదాపు ఇరవైకి పైగా సంకలనాలలో వీరి కథలు, కవితలు ముద్రించబడ్డాయి.వీరి ముద్రిత రచనలు
1.అఖిలాశ
2.విప్లవ సూర్యుడు
3.నక్షత్ర జల్లులు (కొత్త సాహిత్య ప్రక్రియ)
4.వై (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
5.బురద నవ్వింది
6. జిందగీ కె హీరే (నానోలు హిందీలో)
7.లై అనే ఆంగ్ల కవిత్వ సంపుటి
అముద్రిత రచనలు
1.బాలల కథలు
2.బాలల గేయాలు
3.ముస్లిం మైనార్టీ కథలు
4.శివారెడ్డి కవిత్వం-ఒక అవగాహన వ్యాస సంపుటి (శివారెడ్డి గారి సమగ్ర కవిత్వంపై విశ్లేషణలు)
5.డా. ఎన్ గోపి కవిత్వం-ఒక పరిశీలన (గోపి గారి సమగ్ర కవిత్వంపై వ్యాస సంపుటి)6.డా. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి రచనలు - ఒక పరిశీలన
=== పురస్కారాలు ===
#సత్రయాగం సాహిత్య వేదిక నుండి కవి మిత్ర పురస్కారం
#ప్రతిలిపి సాహిత్య వేదిక నుండి కథా భారతి పురస్కారం
#కవి సమ్మేళనం సాహిత్య వేదిక నుండి ఉగాది పురస్కారం
#బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం
#చెన్నై కి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి తెలుగు వెలుగు పురస్కారం
#ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం
#కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం
# “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
వ్యక్తులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)