23, మార్చి 2020, సోమవారం
22, మార్చి 2020, ఆదివారం
20, మార్చి 2020, శుక్రవారం
18, మార్చి 2020, బుధవారం
బసవోదాహరణం || పాల్కురికి సోమనాథుడు
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు
14, మార్చి 2020, శనివారం
పలాస 1978
#పలాస1978
పేరుమోసిన హీరోలున్న సినిమా కాదు. కథే హీరోగా ఉన్న సినిమా. మోహన్ రావు, రంగారావు, పెద్ద షావుకారు, చిన్న షావుకారు, దండాసి, సెబాస్టియన్ ప్రతి పాత్రా హీరేనే. నటులంతా ఆయా పాత్రల్లో ఒదిగి పోయారు. వీరిలో చాలా మంది కొత్తవారు. కొందరు రెండు మూడు సినిమాల అనుభవం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ చాలా కాలం గుర్తుండిపోతారు. సినిమాలో మోహన్ రావు, రంగారావులను చూసినప్పుడు అన్నదమ్ములంటే ఇట్లా ఉండాలి కదా! అన్పిస్తది. ఇక మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నా వరకు నాకు #కంచె సినిమా తరువాత అంతా బాగా మాటలు నచ్చిన సినిమా. ప్రతి డైలాగ్ అద్భుతమే. ఆలోచింపజేసేదే.
"మోహనా! బైరాగి రాయెత్తినోడివి, భైరాగినెత్తలేవా?" అని రంగారావు అన్నప్పుడు థియేటర్లో చాలా మంది యువకులు ఎగిరి ఈలలేస్తారు.
తెగిన వినాయకుడి తలనతికించే కథలున్నవి గానీ, తెగిన ఏకలవ్యుడి ఏలునతికించే కథలెందుకు లేవు? లాంటి ఆలోచింపజేసే మాటలు అభ్యుదయ భావాలున్న యువకులను ఆకర్షిస్తాయి. నాటి స్వార్థపూరిత పెద్ద మనుషుల ఆలోచనా విధానాన్ని పెద్ద షావుకారు పెదవి దాటిన ప్రతిమాట ప్రతిబింబిస్తుంది. నాటి వాస్తవ చరిత ఎట్లున్నా... కేసు విషయంలో సెబాస్టియన్ ఓడిపోవడం, పుస్తకాలు పట్టుకున్న మోహన్ రావు తిరిగి కత్తి పట్టుకోవడం(ఎందుకు పట్టుకోవలసి వచ్చిందో మోహన్ రావు చెప్పినప్పటికి) కొంత నిరాశను కలిగిస్తుంది. ఇది సినిమా నాటకీయత కొరకు తప్పించి మరోటి కాదనిపిస్తది. గౌతమపంథీ అంబేద్కర్ ఆశయానికి వైరుద్యమనిపిస్తది. ఏదేమైనా మంచి సినిమా. ప్రతిభ కలిగిన వాళ్ళంతా కలిసి తీసిన చిన్న సినిమా. చారిత్రక వాస్తవాలను యథాతథంగా స్వీకరించగలగినవాళ్ళంతా చూడదగ్గ సినిమా.
- ఎన్. జయన్న
11, మార్చి 2020, బుధవారం
DARK MODE IN WhatsApp
లేబుళ్లు:
నా వీడియోలు,
సాంకేతికం
9, మార్చి 2020, సోమవారం
5, మార్చి 2020, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)