9, మార్చి 2020, సోమవారం

ఇది చాలుఇది_చాలు

వాడికి కాలేజీలో సీటు వచ్చింది
నాకు రాలా
వాడికి ఉద్యోగం వచ్చింది
నాకు రాలా
వాడికి పెళ్ళైంది
నాకు కాలా
వాడికి పిల్లలయ్యారు
నాకు కాలా
వాడు ఇల్లు కట్టాడు
నే కట్టలా
వాడి పిల్లలు సెటిలయ్యారు
నా పిల్లలు... కాలా
వాడు చచ్చిపోయాడు
నే...
అమ్మో! బతికిపోయానురా దేవుడా!

-జయన్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి