14, జులై 2015, మంగళవారం

పుణ్యమా? -పాపమా?

పుణ్యమా? -పాపమా?
రాజమండ్రి, షాంగై, మక్కా,
ప్రాంతమేదైనా కావొచ్చు
పుష్కరాలు, వేడుకలు
సందర్భం ఏదైనా కావొచ్చు
ఊపిరిపోయడానికి బదులు
విశ్వాసాలకు ఊపిరితీయడం
ఇప్పుడు కొత్తేమి కాదు
జరిగిన సంఘటనల నుండి
జనం పాఠం నేర్వకపోవడమే వింత​
ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ  వైఫల్యాలు
చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగపు నిద్రమత్తు
వీటికి తోడు వివేకరాహిత్య ప్రజోత్సాహం తోడైతే
జరిగే మహోత్పాతాన్ని ఇక ఏ పుణ్యకార్యం ఆపగలదు
గాలిలో కలిసే ప్రాణాలను ఏ మతానికి చెందిన​
దేవుడు రక్షించగలడు
---ఎన్. జయన్న​

2 కామెంట్‌లు:

  1. పుక్కిటి పురాణాలను చిలవలు పలవలుగా వర్ణించి పుష్కర సుత్తి ఎడతెరపి లేకుండా ఊదరగొట్టి స్నానం చేయకపోతే పుట్టగతులు ఉండవన్నట్టుగా చెప్పి అమాయక ప్రజలను బలి తీసుకున్నారు.

    రిప్లయితొలగించు