గద్వాల సంస్థానం పాలనాకాలంలో యంగన్న పల్లె గ్రామానికి చెందిన సర్ధార్. బోయ
కులస్థుడు. గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలునికి(సోమనాద్రికి)
సమకాలికుడు. ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన
ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా
పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ
గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు
ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరుడు. ప్రాణాలకు తెగించి తన ప్రభువు విజయానికి
దొహదపడిన కార్యశూరుడు.
గద్వాల ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా
భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాలనుకున్నాడు
సోమనాద్రి . అయితే సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన
ఆధీనంలోని ప్రాంతమని గద్వాలకు, రాయచూరుకు మధ్యలో ఉన్న
ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి
అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు బంధువు. ఎలాగైనా కోటను ఇక్కడే
నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి
తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని
భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి
కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం
చెల్లించగలనని సోమనాద్రి చెప్పాడు. నవాబు కూడా అంగీకరించాడు.
కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి కోట నిర్మాణానంతరం ఉల్లంఘించాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం
లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై
యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా
రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు
కబురు పంపాడు సయ్యద్ దావూద్ మియా.
సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు
మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు.
ఇరు పక్షాల మధ్య సంకుల సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు
నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్
కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను
చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని
అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని, యుద్ధ పరిహారంగా తన యుద్ధ
చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.
తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యం తోడుగా నిజాం సైన్యం
బయలుదేరింది. వీరు చాలరని తుంగభద్రకు
దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు
జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం.
ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు)
గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల
(నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది.
సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరు మిద దండెత్తాడు. రోజంతా నవాబుల సైన్యంతో వీరొచితంగా పోరాడాదు.
నవాబుల సైన్యం కకావీలమైపోయింది. సోమనాద్రి ఆ రాత్రి తిరిగి కలుగొట్లకు వచ్చి
విశ్రమించాడు.
తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహుడైన సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో ఉత్సాహంతో
పాల్గొని నవాబులపై విజయాన్ని సాధించాడు. విజయోత్సాహంతో
సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. గద్వాలకు తిరిగి వచ్చిన తరువాత సోమనాద్రి ఇచ్చిన మాట
ప్రకారం హనుమప్ప నాయుడుకి గుర్రం ఒక రోజంతా తిరిగే భూమిని ఇనాంగా ఇచ్చాడు. కాల
క్రమేణా చాలా భూమి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోయినా
ఈ నాటికి హనుమప్ప నాయుడు సంతతి వారు అధిక భూములను ఆ గ్రామంలో
అనుభవిస్తున్నారు. ఆ గ్రామంలో, దాని సమీప గ్రామమైన
బొచ్చు వీరాపురంలో ఇతని సంతతి వారే భూస్వాములు. ఈ నాటికీ ఆయా గ్రామాలలో నాయుడి
సంతతి వారి మాట చెలామణి కావడాన్ని గమనించవచ్చు..
* మూలం:
@ హైందవ ధర్మవీరులు- సురవరం ప్రతాపరెడ్డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి