#రమణారెడ్డి_సార్
ఎందుకు సార్ అంత తొందరా?
సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.
మనిషి పోతే, తిరిగొస్తడా!
వంద సమస్యలున్నా, వెయ్యి పరిష్కార మార్గాలు లేవూ!
అయినా, మీకు చెప్పడమేమిటి సార్!
మీరు పాఠాలు చెబితే, విన్న తరం మాది
మేం ఊర్లో ఏడో తరగతి చదివాకా,
ఊర్లోనే పై చదువులు చదివే అవకాశం లేక
ఏదీ దారని ఏడుపు మొఖంతో
మేము వేరే ఊర్లకు వెళ్ళిపోతే,
ఆ తర్వాతొచ్చిన మా తమ్ముళ్ళకు
ఆ అవస్థలుండొద్దని,
మీ ఉపాధ్యాయ జీవితానికి
తొలి అడుగులు వేసుకొంటూనే
మా ఊరి బడిని
ఒక్కోమెట్టు ఎక్కించి,
హైస్కూలు స్థాయికి పెంచి,
శ్రమించిన బృందంలో మీరుండటం నాకు తెలుసు
ఆ బడిలోనే,
మీ పాఠాలే విని,
మీ మాటలే విని,
మీ వెంటే నడిచి,
మీలాగే టీచర్లైన నా తమ్ముడు లాంటి వాళ్ళను చూసి,
నా శిష్యులని గర్వంగా చెప్పుకున్న రోజులూ తెలుసు.
మీ ఊరును,
మన ఊర్ల చుట్టూ పారాడిన ఆర్డీఎస్ కాలువలను,
వాటితో అల్లుకున్న చిన్ననాటి అనుబంధాలను
వ్యాసంతో గుర్తుచేశానని
ఆత్మీయంగా అభినందించిన రోజులూ జ్ఞాపకమే.
మీరెక్కడుంటె అక్కడ
మీరే మూలమన్నట్లు,
మీరే ప్రధాన వనరు అన్నట్లు
ఎమ్మార్సీ అంటే రమణారెడ్డి
రమణారెడ్డి అంటే ఎమ్మార్సీ
ఇది కదా! మీరేసుకున్న బ్రాండ్.
మరెందుకు సార్ అంత తొందరా!
ఇప్పటికీ నమ్మబుద్ది కావట్లేదు
మీరు లేరంటే.
మీరు లేని లోటు
ఉపాధ్యాయలోకాని కెప్పటికీ పెద్ద లోటే.
#శ్రద్ధాంజలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి