- ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళం.
- ఒకే వీధి వాళ్ళం కూడా
- బాల్యంలో
- నే కొంచెం ముందు అడుగుపెట్టా బళ్ళో
- వెనుక నుండి రివ్వున దూసుకొచ్చాడతను
- దత్తపుత్రుని కదా! ఒక్కన్నే పెద్దమ్మకు
- నాకే లోటు కనపల్లా!
- జీవితమూ అర్థం కాలా!
- ఆడిందే ఆట పాడిందే పాట
- అవి కుదరనప్పుడు మధ్యలో కాసింత చదువు
- అతనట్లా కాదు
- ఉమ్మడి పెద్ద కుటుంబం
- అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు
- పరిస్థితులను, కుటుంబాన్ని, సమాజాన్ని
- కష్టపడి పనిచేయడం ఇష్టపడి చదవడం రెండే వ్యాపకాలు
- నానా వ్యాపకాలతో నేను పడుతూ లేస్తూ అలసిపోయి, ఆగిపోయా!
- దాటి ముందుకెళ్ళిపోయాడు
- తలెత్తి చూస్తే అందనంత ఎత్తులో
- శిఖరం మీద
- అంతర్మథనం...
- అలసిపోయానా?
- ఆగిపోయానా?
- అందుకోలేనా?
- లేదు...లేవాలి
- సత్తువనంత కూడదీసుకొని లేవాలి!
- నడవాలి
- ఓపికున్నంతదాకా నడవాలి!
- తప్పకుండా అతన్నందుకోవాలి!!
- గమ్యానికై సాగే గమనం కట్టుతప్పి పోతున్నప్పుడో
- జీవితం పట్టుతప్పి పడిపోతున్నప్పుడో
- అతనిట్లా
- నాకో ప్రేరణ
- నాకో స్ఫూర్తి
- నాకో అద్దం
- నన్ను నేను సరిచేసుకోవడానికి
- అతన్నందుకోవడమైతే చేశా
- ఆ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం నాకిప్పటికీ సాధ్యం కాలా.
- మా మామ
- నా జాన్ జిగిరి
- బషీర్ అహ్మద్
- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికైన
Hi
రిప్లయితొలగించండి