
కళాశాలలో చదివే రోజుల నుంచే సాహిత్య
రచనను మొదలు పెట్టారు. 1977 లో
'ఎవరికి సొంతం వాడిన వసంతం' పేరుతో మొదటి కథను రాశారు. 1992లో 'ఆటా' వారు నిర్వహించిన కథల
పోటీలో వీరి కథ ' ఎటు చూసినా
వాడే ' కు ప్రత్యేక బహుమతి వచ్చింది. అమెరికా
నుండి వెలువడే ' అమెరికా భారతి '
లోనూ ఈ కథ అచ్చయింది. వీరి కథలన్నీ సామాజిక
సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన
నిర్వాసితుల సమస్యలపై రాసిన ' కాల్వ మింగిన ఊరు ', పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ' కఫన్ ' కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011
లో కఫన్ అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు.
విరసం వారి 'కథల పంట' లో, ప్రజా సాహితీ, అరుణతార
పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి.
కవిగా
ఇక్బాల్
నటుడిగా
ఇక్బాల్
వీరు రంగస్థల నటులు కూడా. ప్రముఖ
రంగస్థల కళాకారులు శ్రీ శరబందరాజు గారి ఆధ్వర్యంలో వీరు 'గరిబీ హటావో' నాటకంలో మొదటి సారి నటించారు. విద్య, ఇంకా తెల్లారలే, కోడిపిల్లలొచ్చె మొదలగు వీధి నాటకాలలోనూ వీరు నటించారు.


--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|