tag:blogger.com,1999:blog-66137686977931110132024-03-13T19:13:50.051+05:30జయకేతనం Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.comBlogger351125tag:blogger.com,1999:blog-6613768697793111013.post-80149738873446241142024-03-03T15:11:00.000+05:302024-03-03T15:11:14.595+05:30నేనూ - గొరుసు - గజఈతరాలు
ఊహాజనిత కల్పిత కథాజగత్తును దాటి వాస్తవ జీవితాలను చిత్రించిన కథలను చదవడం మొదలుపెట్టి అప్పటికి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిలోనూ తెలియని మనుషులు, తెలియని భాష, తెలియనిఊర్లూ, వీధులూ అన్ని పరాయివే. ఎవరో తెలియని మనుషుల జీవితాలు చదువుతున్నట్లూ, చూస్తున్నట్లూ ఉండేది. మొదటిసారి 1998 మార్చిలో ఆంధ్రప్రభ వార పత్రికలో ‘ఉసుళ్ళు ‘ పేరుతో ఓ కథ కంటపడింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మరో కథ ‘గజఈతరాలు’ చూశాను. అంతవరకు మావి అనిపించిన కథలను చూడని నాకు ఈ రెండు కథలు ఆ లోటును తీర్చేశాయి. ఈ కథలు మావే. ఈ భాషా మాదే. ఈ కథల్లో ప్రస్తావించబడిన మహబూబ్ నగర్, గద్వాల, ఉప్పేరు,పెబ్బేరు, బీచుపల్లి, రంగాపురం, వనపర్తి, దేవునిపాలెం, గుడ్లనర్వ అన్నీ మా ఊర్లే. వల్లభనగర్, రాయిగడ్డ, మర్రికుంట అన్నీ మా వీధులే. సాయమ్మ, బాలామణీ, పూర్ణమ్మ అందరూ మా మనుషులే అన్పించింది. ఈ కథలు మనుసుకు ఎంతో దగ్గరైపోయాయి.
‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో!
గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.
‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం.
ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది.
ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా.
ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది.
ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.
గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.
ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్‌పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ....
- నాయుడు గారి జయన్న
03.03.2024
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com12tag:blogger.com,1999:blog-6613768697793111013.post-63054853756568311322024-01-20T20:00:00.004+05:302024-01-20T20:00:43.801+05:30నడిగడ్డ చరిత్రే - కె. నాగేశ్వరాచారి 'గద్వాల్జాతర కథలు'
ఒక మొక్క వృక్షమై ఆకాశం వైపు ఎంత ఎదిగినా, దాని
కొమ్మలు దిక్కుదిక్కులకు ఎంత విస్తరించినా,  మూలాన్ని, తాను మొలకెత్తిన నేలను విడిచి ఏ వృక్షమైనా నిలబడగలదా?. అట్లా
మూలాన్ని వదలని వ్యక్తిత్వం కె. నాగేశ్వరాచారి గారిది.
నడిగడ్డలో జన్మించి, ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం అనంతపురం వెళ్లి,
అక్కడే ఉండిపోక, తనకు జన్మనిచ్చిన నేల సమీపానికి రావడం, తన నేల మీద కథలు రాయడం, తన నేలకు సంబంధించిన వ్యక్తులను
వెతుక్కోవడం, ఆ వ్యక్తులు దొరికితే అమాంతం హత్తుకపోవడం ఈ రచయిత వ్యక్తిత్వం. ఇట్లాంటి హృదయమార్దవం కలిగిన రచయిత కలం నుండి
ఎట్లాంటి కథలు రాగలవో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదనుకుంటా!
అయితే ఈ కథలు
చదివిన ఏ విమర్శకుడైనా ఇవి కథలా?, కథనాలా? అనే ప్రశ్నవేయవచ్చు. దానికి ఈ సంకలనంలోని 'బీజం" లాంటి కథలు కూడా ఊతం ఇవ్వవచ్చు. కానీ నేనైతే, ఇవి జీవితాలంటాను. మట్టి మనుషుల
వెతలంటాను.  ఒక ప్రాంతపు చరిత్ర, వాళ్ళ
బతుకులు, కష్టాలు, కన్నీళ్లు అమాయకత్వం, అన్ని కలగలిపి రాసిన చరిత్రంటాను, ఒక్కమాటలో
చెప్పాలంటే ఇది యాభై, అరవై ఏళ్ల కిందటి నడిగడ్డ చరిత్ర.
రచయిత ఈ
కథలనెందుకు రాశాడు?
పాలమూరు కవి కోట్ల వేంకటేశ్వర్ రెడ్డి తన 'నూరు తెలంగాణ నానీలు' పుస్తకంలో... ఒక నానీలో, "పచ్చగున్న కాడ / పక్షివై వాల్తివి, నా నేలను/ నాక్కాకుండా చేస్తివి" అన్నట్లు ... అరవై ఏళ్ల కిందట, ఆర్డీఎస్ వచ్చి అప్పుడప్పుడే పచ్చ పచ్చగా మారుతున్న నడిగడ్డను పసిగట్టిన కొన్ని వలస గద్దలు ఇక్కడ వాలి ఎంత సామాజిక, సాంస్కృతిక, భాషా విధ్వంసాన్ని సృష్టించాయో విడమర్చి చెప్పడానికే ఈ రచయిత ఈ కథలు రాశాడనిపిస్తుంది.
కథలు
ఈ పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. ఇవన్నీ కాలువ కథలు.
ఆర్డీఎస్ కథలు. మనిషి దేహం నిండా
రక్తనాళాలు పరుచుకొని, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ప్రాణవాయువును
అందించినట్లు, ఈ కథల నిండా కాలువలు, వాటి
మీద ఆధారపడిన బతుకులు పరుచుకున్నాయి. <o:p></o:p>
ఉన్న ఊర్లో
జీవనాధారం లేక నగరానికి వలసెల్లిన ఓ కుటుంబానికి చదువుల తల్లి లాంటి బిడ్డను కోల్పోవడం
ఎట్లా శాపంగా పరిణమించిందో తెలియజేసే కథ చంద్రమ్మ కథ. కథ సగ భాగం వరకు చంద్రమ్మ
మరణం, కుటుంబ నేపథ్యం గురించి చర్చించి, ఆ తర్వాత
కాల్వ తెచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో ఖర్చులు పెరిగిన వైనం, కాల్వల
పట్ల ప్రభుత్వాల నిర్లక్ష వైఖరులను ఈ కథ చర్చిస్తుంది. సేతుల్ల పెరిగి, పెద్దదైన పిల్లను పోగొట్టుకుంటే ఎవరి
పానమైన ఎట్లుంటది. ఆ బాధ మన వరకొస్తే గాని అర్థం కాదనడం అక్షరసత్యం. కాల్వొచ్చినాక ప్రజల కూడు, గూడు, గుడ్డ విషయాల్లో కొంత
మార్పొచ్చిన మాట వాస్తవమే అయినా, అంతకు మించి లాభపడిందెవడు? మేడలు కట్టిందెవడు? విదేశాల్లో చదువులు లాంటి
లాభాలు వొనగూడిందెవరికి? ఈ దేశభవిష్యత్తును బాధ్యతగా ముందుకు తీసుకపోగల విద్యార్థులు
అర్థాంతరంగా తనువులు చాలిస్తుంటే కారణమెవరిదనాలి? అంటూ రచయిత ఈ కథ ద్వారా సంధించిన
ప్రశ్నలు మన ఆలోచనల్ని మెలిపెడతాయి.
ఆర్డీఎస్
పెద్దకాలువ పూర్తి కాగానే, సిన్న కాలువలు మొదలవుతుండగానే వచ్చిన బెజవాడ వాళ్లు
ఊర్లల్ల పెద్ద మనుషులను, సావుకార్లను బుడుక్కొని వారిని మధ్య మనుషులుగా
పెట్టుకొని, అమాయకుల పొలాల నెట్లా
కొన్నారో, ఆస్తిని అమ్ముకున్న కూడా వచ్చిన డబ్బెట్లా మాయమైపోయి, పేదల కండ్లల్లో
కష్టమెట్లా కన్నీళ్లుగా రూపుదాల్చనో '18 వ కాలువ కథ' మనకు విడమర్చి చెపుతుంది. ఆర్డీఎస్
డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు, కాలువ ప్రయాణ దూరాలు తెలియాలన్న, కాల్వ బుట్టిన
కాడ్నుంచి కాల్వ ముగిసే వరకు ప్రయాణంలో ఎన్నెకరాలు ఎవరి పాలయ్యిందో తెలవాలన్న మనం
ఈ కథను చదవాల్సిందే.
<o:p> </o:p> 'గద్వాల్జాతర కథ'... గద్వాల రథశాల
దగ్గర మొదలై , గుండు కేశవ స్వామి, లింగం బాయి. చొక్కం బాయి, మీదుగా కోటలోకి
ప్రవేశించి, గుడులు, భవనాలు వాటి సౌందర్యాలు, దాని వెనుక దాగిన శ్రమజీవుల
కష్టాన్ని వివరిస్తూ కోట దాటుతుంది.  రథశాల
నుండి కోట వరకు హనుమప్ప నాయుడు వెంట కథకుడు వెళ్లినట్లే, మనం కూడా తిరుగాడుతాం.
దానితోపాటు ఒక సందేహాన్ని మోసుకతిరుగుతాం. సోమప్ప కాలం నాటి హనుమప్ప సీతారాంభూపాల్
కాలానికి ఎట్లొచ్చె, వర్తమాన కాలానికి చెందిన ఈ కథకుడితో ఎట్లా జత కలిసే అని, అదే
ఈ కథలో ట్విస్ట్. కథాంతానికి చేరితే గాని మన సందేహాం పటాపంచలు కాదు. అది నేను
చెప్పదలుచుకోలేదు. మీరు చదివి తీరాల్సిందే. చదివి సందేహాన్ని తీర్చుకోవాల్సిందే. కాల వైవిధ్యమైన పాత్రలను ఒక చోట చేర్చి, కథ నడిపిన విధానం బాగుంది. ఈ కథా సంపుటిలోని మంచి కథల్లో ఇది
ఒకటి. ఈ సంపుటికి ఈ పేరు పెట్టటం
సరైనదే.
సమయ పాలన, క్రమశిక్షణ ఉండకూడదని కాదు గాని, విద్యాచైతన్యం
లేని చోట అవి మరీ ఎక్కువైతే విద్యార్థుల చదువుకు అవే ఆటంకం కాగలవని తెలియజెప్పే కథ 'సూర్రెడ్డి జమానా'. "భయం విద్యార్థిని ఎదగనీయదు. టీచర్ విద్యార్థికి మధ్య
నిరంతరం చర్చలు జరగాలి. విద్యార్థి తలనిండా ఉన్న ప్రశ్నలని బయటికి రానీయాల" అంటూ
మనకు దిశానిర్దేశం చేస్తుందీ కథ.
<o:p> పైడి చంద్రలత 1997లో నడిగడ్డ నేపథ్యంగా వెలువరించిన నవల - రేగడి విత్తులు. ఈ నవల నడిగడ్డ (పాలమూరు) భాషా, సంస్కృతులను అవహేళన చేసి, అటు వైపు నుండి ఎంత ఎత్తుకు ఎదిగిందో, ఇటు వైపు నుండి ఎంతటి తిరస్కరణకు, ధిక్కారానికి, విమర్శలకు గురైందో తెలుగు నవలా సాహిత్యలోకానికి విదితమే. ఆ నవలకు హీరో రామనాథం. అదే రామనాథాన్ని ఆ నవలకు భిన్నమైన కోణంలో ప్రత్యక్ష జీవితంలోనూ చూసిన ఈ రచయిత చూపించిన కథే</o:p> 'ఎల్లెమ్బీ రామనాథం'. సహాయం చేసిన వారిని మోసం
చేయడం, తిన్నింటి వాసాలను లెక్కించే వీళ్ల వ్యక్తిత్వాన్ని రామనాథం పాత్ర ద్వారా మనకు చూపిస్తారు రచయిత. ఈ కథలు వెలువడడానికి ప్రధానమైన అంశాలలో రేగడి విత్తులూ ఒక కారణమే.
టీవీలు, సెల్లు ఫోన్లు ఊర్లల్లోకి జొరబడని కాలంలో ప్రతి
ఊర్లో రాత్రేల గుడికాడో, రచ్చబండ కాడో ముచ్చట్లు సర్వసాధారణం. అట్లాంటి
ముచ్చట్లతోనే రచయిత 'నెనరు' కథను నడిపిన విధానానికి మనం ముచ్చటపడతాం. కాని కథలోని
పాత్రలు బతకడానికి ఎన్నెన్ని పడవాట్లు పడ్డారో తెల్సుకొని విచారిస్తాం.
జీవనాధారాన్ని పోగేసుకొని, అవరోధాలని అధిగమించే ప్రయత్నంలో శ్రమంతా చెల్లాచెదురై
ఏట్లో కొట్టుకపోతుంటే బరువెక్కిన బతుకుల వేదనెంత దుర్భరంగా ఉంటుందో కథగా చూపి, మన కండ్లు
తడిబారుస్తాడు రచయిత.
ఇట్లా ఈ కథల నిండా నడిగడ్డ బతుకులు, వాటి వెతలు మనకు కళ్లకు
కట్టినట్లు చూయించారు రచయిత.
మాండలిక భాషా ప్రయోగం
మానవ జీవితంలోని
వివిధ దశలను, వాటి అనుభవాలను కథలుగా మల్చడంలో గాని,
కథావస్తువు స్వీకరణలో గాని, కథన విధానంలో గాని వైవిధ్యం ఉండవచ్చు. గాని ఆయా
ప్రాంతాల మాండాలికాన్ని చక్కగా తమతమ కథల్లో పొందుపరిచిన సుప్రసిద్ద కథారచయితలు
వంశి, స.వెం. రమేశ్, నామినిలతో నాగేశ్వరాచారి గారిని పోల్చడం అతిశయోక్తి కాకపోవచ్చు. నాగేశ్వరాచారి గద్వాల్జాతర కథల్లో నడిగడ్డ స్థానిక భాషను, యాసను అట్లే
ప్రయోగించారు.
బడి పలుకుల భాషలో
కొట్టుకపోయిన మన పలుకుడుల భాషను వెతికిపట్టి, ఇక్కడ పొందుపరిచినట్లు మనకు
కనిపిస్తది.<o:p></o:p>
<o:p> </o:p>ఈ కథలు చదివతే కాలప్రవాహంలో కొట్టుకపోయిన అనేక పదాలని మళ్లీ దొరకబుచ్చుకోవచ్చు.
సిన్నేటి సెంప లాంటి పద ప్రయోగాలు పాఠకుడికి ఈ ప్రాంత భౌగోళిక స్పృహ ఉంటే గాని అర్థం కావు.<o:p></o:p>
జౌరి కట్టు , బుడుక్కొని, పురిబెట్టి, అమ్మడిపొద్దు, డబ్బిగిన్నె, కువాడం, వల్కలు, గప్పున, బుగులు, బుడ్డలు, బెరినా లాంటి అనేక పదాలు నడిగడ్డ భాషాసంపదను పట్టి చూపుతాయి.
కథనవిధానం<o:p></o:p>
“ప్రజల జీవనాన్ని వాళ్ల భాషతో సహా
పట్టడానికి, వాళ్ల జీవితపు అనుభవాల లోతులను చూడటానికి ఒక అసక్తే గాక, వాళ్లను ప్రేమించే
మనస్తత్వం కూడా ఉండాలి” అని హరగోపాల్ గారు చెప్పినట్లు ఈ
కథకుడిలో ఆ గుణం మెండుగా ఉంది కాబట్టే ఇంత మెరుగైన కథలు మన ముందుకొచ్చాయి.
పాత్రలు
లచ్చుమన్న, మారెప్ప, మల్దకల్, పక్కీర, బతుకన్న, పెద్దయ్య,
బడేసావు, మొదలుగు ఈ కథల్లోని పాత్రలు కల్పనలు కావు. అవి దేవలోకం నుండి
దిగివచ్చినవి కావు. అతి సామాన్యమైనవి. మన
చుట్టూ ఉండే మనుషులు. కష్టం తప్ప మరో మార్గం తెలియని మట్టి మనుషులు. మన తాతో, మామో, బావో, చిన్నాన్నో, పెదనాన్నో
అన్నట్లే అనిపిస్తాయి. మనతో బంధాన్ని
పెనవేసుకున్న మన ఊరి వాళ్లలాగే అనిపిస్తాయి. ఇట్లాంటి పాత్రలతో , నడిగడ్డ విషయాలతో, విశేషాలతో కథావస్తువులను ఎంపిక చేసుకొని, వాటికి
తగిన భాషను ఎంచుకొని ఈ కథలను విలువైన సాహిత్యంగా మనకందించిన పెద్దలు నాగేశ్వరాచారి
గారికి ధన్యవాదాలు.
- నాయుడి గారి జయన్న
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6613768697793111013.post-45900442653526577802023-12-05T07:34:00.001+05:302023-12-05T07:34:05.678+05:30కుర్చికై కుస్తీ
దీనమైన స్థితిలో ఉంటే
దిక్కు కొకడు పోతిరి
గోడ మీద పిల్లులై
దూకనీక చూస్తిరి,
దూకి మళ్ళి వస్తిరి
ఒక్కడై పోరుతుంటే
ఓరకంట చూస్తిరి
విజయతిలకం దిద్దగానే
వీరులమంటు వస్తిరి
సిగ్గులేని బతుకు నొదిలి
బుద్దిగ మరి బతుకండ్రా!
లోకం దృష్టిలోన
లోకువ మరి కాకండ్రా!
కుర్చి కొరకు కొట్లాడి
కుక్కలమని చెప్పకండి
చెమటోడ్చి నోడికే
కుర్చి నప్పగించండి
- ఎన్. జయన్న
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6613768697793111013.post-51852428949254292112023-12-04T18:09:00.005+05:302023-12-04T18:09:23.831+05:30కుక్క- తోక
కుక్కకు కన్ను ముఖ్యమే
చెవులు ముఖ్యమే
వీటన్నిటికన్నా
గతకడానికి నోరు మరీ ముఖ్యమే
కాదనలేని సత్యమే
కానీ...
వెనుకుందని తోక
అవసరం లేదా?
అన్నిటిలాగే అది కూడా భాగమే కదా!
కుక్క సంతోషానికి,
ఒదిగి ఉండే విధానానికి,
చూపే ప్రేమకు,
నిస్సహాయతకు,
తోకే కదా సంకేతం.
కుక్క నడకకు, పరుగుకు
తోకే కదా సంతులనం
అసలు కుక్కకు అందమే తోక
తోకంటివి
ఆడించకూడదంటివి
బస్సు చక్రాల కింద నలిపేస్తివి
ఒక చోట పెరికి,
మరో చోట అతికిస్తివి
కదపకుండా దశాబ్దం కట్టేస్తివి
నీ పతనకారకుల్లో
తోకకూ భాగమిస్తివి.
తోక కడ వాలమే కాదు
కరవాలం కూడా.
-ఎన్. జయన్న
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-56294751129346281722023-06-16T16:22:00.000+05:302023-06-16T16:22:05.694+05:30శ్రీశ్రీకి నివాళి
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-36442755777707286312022-12-05T12:56:00.000+05:302022-12-05T12:56:00.578+05:30పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు
*🏵️పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు*
ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే మీరు
అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.
అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో) ఉంటుంది
March-May 15%
Jun-Aug 45%
Sep-Nov 75%
Dec-Feb 100%
అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో
కట్టాల్సిన టాక్స్ కి 1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.
ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.
ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.
కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.
ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచో
ఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.
*DDO లకు సూచనలు*
DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)
DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.
లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)
DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
TDS అమౌంట్ తక్కువగా cut(టాక్స్) చేయడం వలన ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.
లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు
ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.
TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.
ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.
పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు.
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-77253224815212617682022-04-10T10:11:00.003+05:302022-04-10T10:16:31.964+05:30కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం
కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల
జిల్లా సమగ్ర స్వరూపం<o:p></o:p>
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపర
సౌలభ్యం కోసం పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే.
కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాల భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకొని గతంలో తెలంగాణ
సాహిత్య అకాడమీ సాహిత్య చరిత్రలను రాయించింది. అవి కొంత మేరకు ప్రయోజనాన్ని
కలిగించడమే కాకుండా ముందు ముందు జరగాల్సిన కృషికి బాటలు వేశాయి. ఆ కోవలోనే ఇప్పుడు
తెలంగాణ సారస్వత పరిషత్తు నూతన జిల్లాల ప్రాతిపదికన కేవలం సాహిత్యంతోనే
ఆగిపోకుండా, జిల్లాలకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాలని
సంకల్పించింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ
33 జిల్లాల నుండి వెలువడిన మొదటి గ్రంథమే జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర
స్వరూపం. ఇందులో జిల్లా భౌగోళిక స్వరూపం,
చరిత్ర, సంస్కృతి, కళలు, పర్యాటకం, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉద్యమాలు –
ఉద్యమకారులు, జిల్లా పద్య, గేయ, వచన కవిత్వాలు, కథ, నవల, నాటక వికాసాలు వంటి  ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సంస్థానాలు – చరిత్ర,
సాహిత్య పోషణ వంటి అనేక విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ ఎవరో రాజధానిలో
కూర్చొని ఉద్దండులైన రచయితలు రాసిన వ్యాసాలు కావు. ఆయా జిల్లాల సమగ్ర చరిత్రను ఆయా
జిల్లాల రచయితల చేతనే రాయించాలనే ఓ గొప్ప ఆశయానికి అక్షరరూపం ఈ గ్రంథం. జోగులాంబ గద్వాల జిల్లా విషయాలు, విశేషాలు
తెలుసుకోవాలనే ఉత్సహం కలిగిన ప్రతి ఒక్కరు చదవదగిన పుస్తకం.
ప్రతులకు...
తెలంగాణ సారస్వత పరిషత్తు
తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ -500 001.
పోన్. 24753754
- నాయుడు గారి జయన్న
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6613768697793111013.post-32450845487013617902022-03-20T22:15:00.005+05:302022-03-20T22:15:43.673+05:30దత్తపది..
కలము, మలము, జలము, పొలము
సకలము తనకే యనక కొంత యిచ్చు కో
మలము కలిగి నట్టి మంచి మనిషి
పూజల మునుగకనె పుణ్యఫలము నొందు
అనె వినోబ పొలము దానమడిగి
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6613768697793111013.post-65133039772811622112022-03-11T11:34:00.004+05:302022-03-11T11:35:09.307+05:30న్యస్తాక్షరి: బ్ర -హ్మ - చా - రి
బ్రహ్మచారిగాను బ్రతుకును గడుప, బ్ర
హ్మయ్య గీసె నుదుట మాయగీత
చాలటంచు నొకడు కలత చెంది, మరి ప
రిణయమున్ జరుగక ప్రాణ మిడిచె
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-9888303149008661912022-01-31T19:21:00.002+05:302022-02-01T18:43:26.788+05:30IT CALCULATOR -2021-22
DOWNLOAD INCOME TAX CALCULATOR -2021-22
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-18929420353704781902022-01-03T08:30:00.005+05:302022-01-03T08:30:52.529+05:30ప్రణాళికతోనే పదిలం
ఈనాడు క్లిప్పింగ్
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-44864619925463027372021-12-18T19:49:00.003+05:302021-12-18T19:49:17.684+05:30ఒక్కమాట (కవితత్వాలు)
ఒక్కమాట (కవితత్వాలు) 👈 download free
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-81488975149890026782021-12-11T11:48:00.007+05:302022-01-31T18:55:25.120+05:30పొట్లూరి మోహన రామప్రసాదు
పొట్లూరి మోహన రామప్రసాదు తెలుగు కవి. కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి. ఇప్పటికి నాలుగు హైకూ
సంపుటాలు వెలువరించాడు.  రంగస్థలంపై నటించిన అనుభవం కూడా ఉంది. దాదాపు 20 నాటకాలు వేశాడు. లఘు చిత్రాలను నిర్మించాడు.  కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ పలు
లఘు చిత్రాలను తీశాడు.
స్వస్థలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణాజిల్లా తెన్నేరు.  తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి, కృష్ణమూర్తి.
ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాడు.
విద్యాభ్యాసం: వాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. పూణే
విశ్వవిద్యాలయం నుండి 1987 లో లా డిగ్రీ ని
పొందాడు.
ఉద్యోగం: వృత్తిరీత్యా ఇతను న్యాయవాది. రాష్ట్రంలోని విజయవాడలో న్యాయవాదిగా
పనిచేస్తున్నారు
రచనలు: మా ఊరు, బడిలో, పూల రేకులు, తనేను
<o:p> </o:p>మా ఊరు ఒక హైకు: ఈ హైకూల రచనాకాలం 1995. ఈ పుస్తకం అట్లూరి రాజ
మనోహరం అట్లూరి రాజగోపాల రావులకు అంకితమివ్వబడినది. ఈ పుస్తకానికి శ్యామ్ కుమార్
కర్రి  ముఖచిత్రం వేశాడు. ఈ పుస్తకానికి కవిత్వం తొడుక్కున్న ఊరు కనురెప్పల
నిశ్శబ్ద మోహనరాగం అంటూ డాక్టర్ సశ్రీ ముందుమాట రాశాడు.
ఇందులో కొన్ని హైకూలు<o:p></o:p>
చింత తోపుల్లోంచి
చందమామని చూస్తే
మా ఊరు కనిపిస్తుంది
<o:p> </o:p>
ఊళ్లో రైలు ఆగేది
ఎక్కింది దిగింది
లెక్కేలేదు
జడలాగినమ్మాయిని
మా ఆవిడకి చూపించా
ఇద్దరూ నవ్వుకున్నారు
<o:p> </o:p>మా బడిలో పొట్లూరి మోహన రామ ప్రసాద్ చినుకు పబ్లికేషన్స్ విజయవాడ సెప్టెంబర్ 2020
ఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి.
<o:p> </o:p>
ఇందులోని కొన్ని హైకూలు<o:p></o:p>
మా బడికెళ్ళా<o:p></o:p>
వేసిన గోడకుర్చీ<o:p></o:p>
కనిపించలేదు. <o:p></o:p>
<o:p> </o:p>
మాబడికెళ్ళా<o:p></o:p>
బెంచీల మీద పేర్లు <o:p></o:p>
చెరగలేదు. <o:p></o:p>
<o:p> </o:p>
బడి గుర్తొస్తే<o:p></o:p>
సిరామరకలన్నీ <o:p></o:p>
గుర్తుకొస్తాయి <o:p></o:p>
<o:p> </o:p>
పూల రేకులు-పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఫిబ్రవరి 2021 <o:p></o:p>
<o:p> </o:p>
ఈ పుస్తకానికి ముఖచిత్రం శ్యామ్ కుమార్ కర్రీ వేశాడు. హైకూ మోహన సమ్మోహనం
పూలరేకులు అంటూ చిత్తలూరి సత్యనారాయణ ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు. <o:p></o:p>
<o:p> </o:p>
అందులోని కొన్ని హైకూలు<o:p></o:p>
బంతి చేమంతి <o:p></o:p>
తోటలోనే రాలాయి <o:p></o:p>
కోయలేదుగా <o:p></o:p>
<o:p> </o:p>
వానచినుకు <o:p></o:p>
కొమ్మల మీద పడి <o:p></o:p>
పువ్వులైనాయి. <o:p></o:p>
<o:p> </o:p>
నల్లని మబ్బు<o:p></o:p>
తోటమీంచి వెళుతూ<o:p></o:p>
పూలనిచ్చింది. <o:p></o:p>
<o:p> </o:p>
తనేను - పొట్లూరి మోహన రామ ప్రసాద్-చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఆగస్టు 2021 <o:p></o:p>
<o:p> </o:p>
ఇందులోని కొన్ని హైకూలు<o:p></o:p>
ఆమె వెళ్ళింది<o:p></o:p>
కొన్ని అక్షరాలని <o:p></o:p>
కవిత చేసి <o:p></o:p>
<o:p> </o:p>
ఆమె లేకుంటే<o:p></o:p>
ప్రపంచమే లేదుగా <o:p></o:p>
ఉన్నా అంతేగా <o:p></o:p>
<o:p> </o:p>
తోటలో పూలు <o:p></o:p>
పూస్తున్నా రాలవేంటి <o:p></o:p>
ఆమె వచ్చిందా? <o:p></o:p>
<o:p> </o:p>
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-81415920094291926822021-11-18T19:55:00.006+05:302021-11-18T19:55:46.728+05:30తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి
తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కవి. ప్రధానంగా వీరు పద్య కవులు. శతకాలు, సమస్యా పూరణలు వీరు రచించారు. అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొన్నారు. సంస్కృత ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం వీరి ప్రవృత్తి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనేక సాహిత్య కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.
స్వస్థలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వీరి స్వస్థలం. 1951 జనవరి ఒకటవ తేదీన వీరు జన్మించారు. తల్లి నరసమ్మ, తండ్రి తురిమెళ్ళ చిన్న పిచ్చయ్య. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్థిరపడ్డారు.
విద్యాభ్యాసం
నరసరావుపేట సంస్కృత ఓరియంటల్ కళాశాలలో భాషాప్రవీణను పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, తెలుగు పండిత శిక్షణను పూర్తి చేశారు.
వృత్తి
జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలైన రవీంద్ర ఉన్నత పాఠశాలలో ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా పనిచేసి, ఉద్యోగవిరమణ చేశారు.
రచనలు
1.కమలనాభ ద్విశతి
2. శ్రీకృష్ణ శతకం
3. శ్రీ గౌరీ శతకం
4. హనుమత్ శతకం
5. శతసమస్యా పూరణం
కవిగా వీరి మొదటి రచన కమలనాభ ద్విశతి. విజ్ఞాన చంద్రిక అని దీనికి గల మరొక పేరు. 2008 మేలో ఈ రచనను ప్రచురించారు. ఈ రచనను తన తల్లిదండ్రులైన నరసమ్మ తురిమెళ్ళ పిచ్చయ్యలకు అంకితం చేశారు.
ఈ పుస్తకానికి కపిలవాయి లింగమూర్తి, పల్లెర్ల రామమోహన్ రావు, బాబు దేవిదాస్ రావు, ఎస్. ఎమ్. మహమ్మద్ హుస్సేన్, పోలోజు వేణుగోపాలాచారి ముందుమాటలు రాశారు. ఇది ఆటవెలదిలో రాయబడిన గ్రంథమైనప్పుటికి...కందంతో మొదలై కందంతో ముగిసే ద్విశతి.
శ్రీ రఘు రామాశ్రిత మం
దార! దశరథాత్మజ! హరి! దానవ హరణా!
కారుణ్య నిధీ! మాధవ!
భారమనక నన్ను బ్రోవు భద్రగిరీశా!
అన్న పద్యంతో మొదలై,
శ్రీ లక్ష్మీ రమణా! వన
మాలి! దివిజ సన్నుత! పరమాత్మా! శ్ఙ్గారీ!
ఏలుము, మది నమ్మితి నిను,
బాల మురళి! భద్రమొసగు భవహర! కృష్ణా! అను పద్యంతో ముగిసే ఈ ద్విశతిలో 204 పద్యాలు ఉన్నాయి.
తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి రచించిన రెండో పుస్తకం శ్రీ కృష్ణ శతకం. ఇది పద్య స్తుతి. 2010 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇది కందంలో రాయబడిన శతకం. మొత్తం 108 పద్యాలు ఈ శతకం లో ఉన్నాయి. శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు భూమరాజు సీతారామయ్య ఈ పుస్తకానికి ముందు మాటలు రాశారు. కవి తన అన్నావదినలైన తురిమెళ్ళ కోటేశ్వరరావు, సుగుణావతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు.
2010 సంవత్సరం లోనే వచ్చిన మరో గ్రంథం శ్రీ గౌరీ శతకం.
కంద పద్యంలో వ్రాయబడిన ఈ శతకంలో 109 పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, సాహితీ పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి, లలితానంద స్వామి ముందుమాటలు రాశారు.
హనుమత్ శతకం 2017వ సంవత్సరంలో ముద్రించబడింది. ఇది కందంలో రాయబడిన శతకం. ఇందులో 120 పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, అష్టావధాని మద్దూరి రామమూర్తి, బాబు దేవిదాస్ రావు, కే బాలస్వామి ముందుమాటలు రాశారు.
శత సమస్య పూరణం- 2001 నుండి 2004 వరకు ఆకాశవాణి హైదరాబాద్ దూరదర్శన్ వారు ప్రసారం చేసిన సమస్యాపూరణ కార్యక్రమంలో ఇచ్చిన సమస్యలకు పూరణలు ఈ గ్రంథంలోని సమస్యాపూరణలు. ఇందులో 120 సమస్యలకు పూరణలు ఉన్నాయి. ఇందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు మొదలగునవి ఉన్నాయి.
ఈ పుస్తకానికి కపిలవాయి లింగమూర్తి, శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, బాబు దేవిదాస్ రావు, అవధానం సుధాకర్ శర్మ, కే బాలస్వామి ముందుమాటలు రాశారు.
అముద్రిత రచనలు
1. అంతర్యామి
2. శ్రీరామచంద్ర శతకం
3. వాయు సందేశం
4. భీష్మపితామహుడు అనునవి వీరి అముద్రిత రచనలు.
పురస్కారాలు
1. గద్వాల డివిజన్ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2003)
2. మహబూబ్ నగర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005)
3. భగవద్గీత ప్రచారం నందు సంస్కృత భాషా ప్రచార సమితి వారి పురస్కారం.
4. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సాహితీవేత్తగా రాష్ట్ర ప్రభుత్వంచే పురస్కారం.
5. ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాహితీవేత్తగా జాతీయ సాహిత్య పరిషత్ వారిచే పురస్కారం.
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-70746883924834382982021-11-06T20:43:00.003+05:302021-11-06T20:43:53.037+05:30Bandikattavo ramanna folk song|| by ZPHS PUDUR StudentsNaidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-85275561003562016432021-07-14T20:04:00.001+05:302021-07-21T16:52:39.730+05:30నేను - దేవుడు
జీవితంలో నాకు కొంచెం స్థిరత్వం తక్కువ. అనేకానేక ప్రభావాలకు చాలా తేలికగా లోనై తరుచూ అభిప్రాయాలు మార్చుకుంటుపోతాను. ఈ విషయంలో మరీనూ.
బాల్యమంతా మా పెద్దమ్మ ఊర్లో గడిచిపోయింది. ఇంటి ముందరే హనుమాన్ గుడి. పొద్దున లేవగానే దైవ దర్శనం. వేసవి కాలం గుడి కట్ట మీదే నిద్ర. యవ్వనంలో అర్ధరాత్రి దాకా మిత్రబృందంతో బాతాఖానీ అక్కడే. సరదాగా శనివారాలు, శ్రావణ మాసాలు భజన బృందాలతో మా మిత్రబృందం కలిసిపోయి తాళాలు, గొంతులు, అడుగులు (అడుగు భజన) కలిపే వాళ్ళం. కొత్తకొత్త పాటలు రాసుకొని కొత్తకొత్త బాణీలతో పాడుకొంటు గడిపేవాళ్ళం. అట్లా సహజంగానే దైవం పట్ల సానుకూలత ఏర్పడింది.
డిగ్రీలోకి ప్రవేశించటంతో పరిస్థితులు మారటం మొదలుపెట్టాయి. కొత్త ఊరు. కొత్త పరిచయాలు. కాలేజీ గొడలపై నినాదాలు, కాలేజీ నేపథ్యం. శ్రీశ్రీ, తిలక్ కవిత్వం (శ్రీశ్రీ ప్రతిజ్ఞ, తిలక్ తపాలా బంట్రోత్ డిగ్రీలో పాఠాలుగా ఉండేవి. దాంతో మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఇంటికి వచ్చేశాయి. దిన,వార,మాస పత్రికలు కాకుండా సాహిత్యానికీ సంబంధించి నేను కొన్న మొదటి పుస్తకాలు ఇవే) నన్ను మార్చడం మొదలు పెట్టాయి.
వీటికి తోడు దిగజారిపోయిన ఇంటి ఆర్థిక పరిస్థితులు, ముందుకు సాగని చదువు, అధికమైన అవమానాలు, ఆకలి నన్ను దేవుడికి దూరం చేశాయి.
ఇవే పరిస్థితులు ఇంకొంత కాలం ఉండి ఉంటే, ఇంకొంచెం తీవ్రమై ఉంటే అడవి దారి పట్టేవాడినేమో! ఏ పరిస్థితి ఎల్లకాలం ఒకే తీరుగా ఉండదు కదా! పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అడవికి దూరమయ్యాను కానీ దేవుడికి దగ్గర కాలేకపోయాను. ఒక దశాబ్దం పాటు ఎర్రజెండకు సమీపంలో నడిచాను.
జీవితంలో మెరుగుపడిన పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి, కూతురు, వయసు, అనుభవాలు నన్ను ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేశాయి. వీటన్నింటికి మించి అభ్యుదయ మిత్రుల డొల్లతనమూ ఎర్రజెండకూ దూరం చేసింది. కులమతాలు అవమానాలకు, అణచివేతలకు కారణమైనప్ఫుడు తిరుగబడటం నేరం కానేకాదు. ఆ కారణం చేత పొందే ప్రతిఫలాలను కూడా కాలదన్ని, ఏ హద్దులైన దాటి స్వేచ్చగా నచ్చిన కులం, మతంలో చేరిపోయి, నచ్చిన దేవుడిని భుజం మీద మోస్తూ, హీనత్వానికి కారణమైన మతం మీద, దేవుడి మీద యుద్దం చేయడం నికార్సైన మనుషుల పని. అట్లాంటి మనుషులు నాకక్కడ కనపడటం మానేశారు. ప్రతిఫలాలు అనుభవిస్తూనే, ఎవడి మతం మురికిని వాడు తొలిగించుకోకుండానే, ఎదుటి మతంపై దాడి చేసే సహచరులతో కలిసి నడవడం నాకు కొంచెం కష్టమైపోయింది. పూర్తిగా ఎర్రజెండా నీడ నుండి బయటికి వచ్చేశాను. అట్లాగని భక్తిలో మునిగిందీ లేదు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తప్పని సరి అయినప్పుడు గుడికి వెళ్తాను. దేవుడి ముందుకు వెళ్ళను. కోర్కెల చిట్టా విప్పను. మొక్కినా, చెప్పినా, అరిచినా, ఏడ్చినా, గీపెట్టినా, పొర్లినా, దొర్లినా మనకు ఇవ్వకూడదనిది ఇవ్వడని, ఇవ్వాల్సినవి, ఇవ్ళాల్సిన సమయంలో అడగకపోయినా తప్పకుండా ఇస్తాడని నమ్ముతాను. దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని, చూడాలని, అడగాలని తాపత్రయపడే మనుషులకు అడ్డుతగలడం, ముందునిలబడం భావ్యం కాదని బయటే ఉండిపోతాను. గుడిని, దాని నిర్మాణాన్ని, వాటి శిల్పసౌందర్యాన్ని ఆరాధిస్తూ బయటే ఉండిపోతాను.
మా ఊర్లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ జరిగేది. ఒక సంవత్సరం ఆ తిరునాళ్ళలో తోటి పిల్లలు కొంత మంది తమ అంగి జేబుల మీద పువ్వులు, పక్షులు, దేవుళ్ళు వంటి వాటిలో వాళ్బకు నచ్చిన బొమ్మల ముద్రలు వేయించుకున్నారు. నేను కూడా నా జేబు మీద ఒక బొమ్మ ముద్రవేయించాను. అది చిరంజీవి బొమ్మ. ఆ అంగీ, అంగి మీది జేబు, జేబు మీది బొమ్మ ఎప్పుడో చిరిగిపోయాయి, చెరిగిపోయాయి. కానీ, జేబు కింది గుండెలో మాత్రం ఆ బొమ్మ ఇప్పటికీ భద్రంగా ఉండిపోయింది. ఎప్పటికీ ఉంటుంది.
ఊర్లోకి అప్పుడప్పుడూ బట్ట సినిమాలు (టూరింగ్ టాకీస్) వచ్చేవి. అందులో ఎక్కువగా ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలే. సువర్ణ సుందరి, భట్టి విక్రమార్క లాంటి సినిమాలు పెద్దవాళ్ళకు వినోదాన్ని పంచిపెడితే, ఇంటి గుట్టు, టింగురంగడు, దేవాంతకుడు, మంత్రి గారి వియ్యంకుడు, బిల్లా రంగా, పులిబెబ్బులి, మగమహారాజు వంటి సినిమాలు మాకు పండుగ వాతావరణం తెచ్చేవి. సినిమా వచ్చిన రోజు సాయంత్రం ఆ పరిసరాల్లో ఎంత సందడి చేసేవారమో! ఈ సినిమాలే అంగి జేబు మీదికి, దాని కింది గుండెలోకి చిరంజీవి బొమ్మ చేరేలా చేశాయి. మేము బడిలో ఒక్కో తరగతి దాటి పోతున్న కాలం, చిరంజీవి ఒక్కో మెట్టూ ఎదుగుతున్న కాలం ఒకటే కావటంతో ఆ అభిమానబంధం మరింత బలపడింది. ఆ డ్యాన్సులు, ఫైట్లు, స్టైల్, డైలాగులు అన్నీ మైమరిపించేవి.
ఆరవ తరగతిలో ఉన్నప్పుడు కరణం విమలమ్మ గారని మాకు ట్యూషన్ చెప్పేది. సాధారణంగా ఉదయం సాయంకాలం ట్యూషన్ ఉండేది. మా తరగతిలో ఓ నలుగురు మిత్రులం మాత్రం రాత్రి భోజనాల తర్వాత కూడా ట్యూషన్ కు వెళ్లి, అక్కడే చదువుకొని, అక్కడే నిద్రపోయే వాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున లేచి చదువుకోవడం చేసేవాళ్ళం. మాకిచ్చిన ఈ సౌలభ్యానికి వారికి మేము చెల్లించవలసిన అదనపు ఫీజు ఏమిటంటే బావి నుండి ఓ పది కడవల నీళ్ళు తెచ్చిపోయడం. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లోకి ఖైదీ సినిమా వచ్చింది. అదీ రంగుల సినిమా. అప్పటి దాకా బట్ట మీద నలుపు తెలుపు సినిమాలు మాత్రమే చూసిన అనుభవం. రంగుల సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉబలాటం. దానికి తోడు అభిమాన హీరో సూపర్ హిట్టు సినిమా. ఆ రాత్రి సినిమా మీద మనుసు పీకుతుంది. మనుషులమేమో ట్యూషన్ లో బంధీ అయిపోయాం. మా ఉబలాటాన్ని గమనించే టీచర్ " ఎవడైనా సినిమాకు వెళ్ళాడో! మరి ట్యూషన్ కు రాడు" అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చేసేదేమీలేక పుస్తకంలో తలలు దూర్చాం. అక్షరాలన్నీ గజిబిజిగా కనిపిస్తున్నాయి. పక్కల మా బడి మైదానంలో వేసిన సినిమా మాటలు, పాటలు చెవిలోకి చొరబడుతున్నాయి. టీచర్ హెచ్చరిక ఓ అరగంట మాత్రమే మమ్మల్ని ఆపింది. టీచర్ ఇంట్లో నిద్రపోయిందన్న నిర్ణయానికి వచ్చాకా, బయట అరుగుల మీద పుస్తకాలు, పరుపులు పక్కన పెట్టేసి సినిమాకు వెళ్ళిపోయాం. బ్రహ్మానందభరితంగా సినిమా చూసి వచ్చి, ఏమీ ఎరుగనట్లు చడీచప్పుడు కాకుండా దొంగల్లా వచ్చి చేరి ఎప్పట్లాగే నిద్రపోయాం. పొద్దుగాల లేవగానే "పరుపులు చుట్టుకొని ఇంటికి వెళ్ళండి. దొంగ వెదవల్లారా! వద్దంటే కూడా సినిమాకు వెళ్తరా?" అంటూ టీచర్ కోపంతో ఇంటికి పంపించి వేసింది. మా పెద్దవాళ్ళు బతిమిలాడితే మూడు రోజుల బహిష్కరణ తర్వాత ట్యూషన్ కు రానిచ్చింది టీచర్. మొదట్లో భయపడినా, చివరకు 'చిరంజీవి ఎంత పని చేశాడురా!' అని నవ్వుకున్నాం.
మా ఊర్లో ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. హైస్కూలుకు మండల కేంద్రానికి సైకిళ్ళపై వెళ్ళి చదువుకునే వారు మా సీనియర్లు. సీనియర్లకు సినిమా టిక్కెట్ పెడితే చాలు, సైకిళ్ళ మీద మండల కేంద్రంలో ఆదివారం మాత్రమే వేసే మ్యాట్నీ షో చూపించి తీసుకొచ్చేవారు. అలా చూసిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయి.
ఏడవ తరగతిలో మా గురువుగారు గడియారం సాంఖ్యాయన శర్మ గారు (గడియారం రామకృష్ణ శర్మ గారి పెద్ద కుమారుడు). మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. బళ్ళో ఒక రోజు ఎక్సర్సైజ్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. అందులో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అనే ప్రశ్న కూడా ఒకటి. తరగతిలో ఎక్కువ మందిమి చిరంజీవనే రాశాం. ఆయన ఆశ్చర్యపోయి, హో గ్రేట్! నాక్కూడా చిరంజీవంటే ఇష్టమన్నారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. సారూ కూడా మా పార్టే అంటూ వేయ్యేనుగులు ఎక్కినంత సంతోషపడి పోయాం.
ఏడో తరగతి తర్వాత ఊర్లో చదువు లేకపోవడంతో అందరిలాగే మేము మా మండల కేంద్రానికి వెళ్ళలేదు. మా గురువు శర్మ గారు మా మిత్రబృందాన్ని వారి సొంతూరు అలంపూరుకు తీసుకువెళ్ళి చేర్పించారు. అక్కడే ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో మాకు కావలసినంత స్వేచ్ఛ లభించడం, అలంపూరు నుండి ఆరు కిలోమీటర్ల కాలినడక నడిచి తుంగభద్ర దాటితే కర్నూలు అందుబాటులో ఉండటం, అక్కడ సినిమాలకు కొదువ లేకపోవడం వంటి అంశాలు మా సినిమా పిచ్చికి, చిరంజీవిపై ఇష్టానికి ఆజ్యం పోశాయి.
మా ఊర్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. చిరంజీవి సినిమా విడుదలైతే చాలు థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేవాళ్ళు. చిరంజీవి మీద అభిమానంతో నాకొచ్చిన కళను మరింత మెరుగుపరుచుకోవచ్చన్న ఆశతో అప్పుడప్పుడు వారికి బ్యానర్లు రాసిచ్చి సహాయపడే వాడిని.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండేవి. అవన్నీ కల్లలైపోయినప్పుడు, రక్తదానం, నేత్రదానం వంటి సేవాకార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న వ్యక్తి మీదే తోటి నటులు అసూయతో అభాండాలు వేసి, అవమానపరిచినప్పుడు చాలా బాధేసింది. తిరిగి సినిమాల్లోకి వచ్చాకా మళ్ళీ కొంత ఊరట కలిగింది. తెలుగు సినీరంగంలో చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే!
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6613768697793111013.post-57104222279114085552021-06-02T16:05:00.002+05:302021-06-02T16:05:34.401+05:30 బాల్యంలో నా అమాయకత్వం
నాకు ఊహా తెలియకముందే మా పెద్దమ్మ తెచ్చి పెంచుకుంది. నా చదువు అట్లా పెద్దమ్మ ఊరైన పల్లెపాడు(జో.గద్వాల)లో ప్రారంభమైంది. అదో చిన్న పల్లెటూరు. ఐదవ తరగతి వరకు మాత్రమే బడి ఉండేది. మా తరగతిలో ఐదుగురం ఉండేవారం. అందులో శ్యామసుందర్ రెడ్డి నాకు అత్యంత ప్రియమిత్రుడు. బడిలో చదువులు, మైదానాల్లో ఆటలు, వంకల్లో ఈతలు...ఏడున్న ఒకరి భుజం మీద మరొకరి చేయి ఉండాల్సిందే. అట్లా నాలుగేండ్లు గడిచిపోయాయి. ఐదో తరగతికి వచ్చాకా ఆలోచన మొదలైంది. 'ఇది చివరి సంవత్సరం. వచ్చే సంవత్సరం బడి వదలాలి. ఊరు విడువాలి. మరి ఎక్కడ చదవాలి?' ఎక్కడ చదివినా ఇద్దరం ఒకేచోట చదవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మా ఊరి పిల్లలకు రెండు అవకాశాలు ఉండేవి. ఒకటి మా సొంతూరు జల్లాపురం. అక్కడ ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. రెండు ధర్మవరం. అక్కడ పది దాకా బడి ఉండేది. కొంచెం దూరమెక్కువైనా రెండోదే ఎంపిక చేసుకునేవారు మా ఊరి పిల్లలు ఎక్కువ కాలం ఒకే దగ్గర చదువొచ్చని.
రెండ్లేండ్లకే మారాల్సి ఉంటుందని మొదటిది, దూరమెక్కువని రెండోది వద్దనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మిత్రుడు చెప్పాడు..."మనం వనపర్తి దగ్గర ఉండే మా మేనమామ ఊరికి వెళ్దాం. అక్కడే ఉంటూ చదువుకుందాం. మనకే ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు" అని చెప్పేవాడు. పెద్దల నిర్ణయాల ప్రమేయం లేకుండా పిల్లల ఆలోచనలు కార్యరూపం దాల్చవన్న సత్యాన్ని గ్రహించకుండా అది నిజమైతదనే అమాయకంగా నమ్మాం. ఎన్నెన్నో కలలు కన్నాం. ఆనందంగా ఆ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాం. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి చేస్తది కదా! పెద్దల నిర్ణయాల మేరకు ఆరవ తరగతికి నేను మా సొంతూరు జల్లాపూర్ కు, తాను వనపర్తికి వెళ్ళిపోయాం. పదేండ్లు గడిచిపోయాయి.
డిగ్రీ పూర్తయ్యాక...
తాను హైదరాబాద్ నగరానికి రమ్మని, తన రూంలోనే ఉండమని, పని కూడా చూసి పెడతానని మాటిచ్చి, బతుకుదారి చూపాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాటను ఇలా నెరవేర్చుకున్నాడా అన్పించింది.
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-87108692575255057052021-05-20T20:03:00.004+05:302021-05-20T20:03:20.092+05:30ప్రతిలిపితో డబ్బులు సంపాదించడం ఎలా?Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-52179324689293686262021-05-20T20:02:00.003+05:302021-05-20T20:02:20.656+05:30ప్రతిలిపిలో ధారావాహికలు రాయడం ఎలా?Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-2585550547904406572021-05-19T19:38:00.002+05:302021-05-19T20:51:13.020+05:30ప్రతిలిపితో డబ్బులు సంపాదించడం ఎలా?
ప్రతిలిపితో డబ్బులు...
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-80834536388380269842021-04-02T14:11:00.006+05:302021-04-02T14:16:43.656+05:30వల్లభాపురం జనార్ధన
వల్లభాపురం జనార్ధన అభ్యుదయ కవి. వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. పాలమూరు జిల్లా కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు పహారా కాస్తున్న రాత్రి అను కవితా సంకలనాన్ని వెలువరించారు.శ్రీశ్రీ మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. భారత్, అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని నిరసిస్తూ విషకౌగిలి123 పేరుతో నానీలు వెలువరించారు. విజయక్రాంతి పేరుతో సంగీత రూపకాన్ని 1974లో వెలువరించారు. ఇదే అచ్చైన వీరి మొదటి రచన. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ, వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రచనలు
1.పహారా కాస్తున్న రాత్రి(వచన కవితా సంకలనం -మార్చి,2000)
2.యుగ పతాక శ్రీశ్రీ (దీర్ఘకవిత- ఏప్రిల్, 2010)
3. విషకౌగిలి 123 (అణుబంధ నానీలు - ఏప్రిల్, 2008)
4. విజయక్రాంతి (సంగీత రూపకం - ఆగస్ట్,1974)
అతని రచనల నుండి...
*సురవరం ప్రతాపరెడ్డి గురించి...
సీస పద్యం:
తెలగాణ తెలుగున వెలుగులు చూపించి
ప్రాంతీయ ప్రతిభను పంచినాడు
తెలగాణ నేలలో తెలివికి చీకటి జాడయే లేదని చాటినాడు
మరియాదలను వీడి మాటతూలినవారి
గర్వమ్ము దించగా కదలినాడు
తెలగాణ తెలుగులో తీయందనాలను
చూడని నాల్కకు చూపినాడు
వైతాళికుండుగా జాతిరాగము పాడి
తెలగాణ ధిషణను తెలిపినాడు
తే:గీ:
మిట్టమధ్యాహ్న సూర్యుడై మెలగినాడు
ఆంధ్ర గర్వము చెండాడియలరినాడు
ప్రాంత తెలగాణ నడవడి పట్టిచూపి
రచనలందున రత్నాల రశ్మి చూపి
సురవరము జాతి మర్యాద చూపినాడు
కందం:
ప్రతిభా మంజూష తెరిచి
శ్రుతి చేసెను తెలుగుబాస చిన్నెల లయలన్
మతిమంతుడు జనహిత వరి
స్తుతికే స్తుతియయి నిలిచెను సురవర మతియై
కందం:
సేద్యము కవితా సేద్యము
వేద్యత పరిశోధకత్వ విద్వచ్చవియై
హృద్యపు రచనలు చేసెను
ఖాద్యములుగ బుద్ధికిడగ ఘన సురవరమే
కందం:
స్థిరుడై భాషా రతుడై
సురుచిరమగు గ్రామ్యభాష సొబగులు తెలిపీ
సురభాష కన్న మిన్నని
పరిచయమొనరించె భువికి భాసుర వరమే
ఉత్పలమాల:
బాలిశులైనయాంధ్రుల సవాలుకునిచ్చె జవాబు దీటుగా
సాలగ గోలకొండ కవి సంచిక నిల్పి చరిత్ర సాక్షిగా
గాలికి తూలిపోదు తెలగాణ యశమ్మని చాటి చెప్పెరా
చాలిన స్వాభిమాన జవసత్వపు దుర్భిణి చూడు సాహితిన్
శా ర్దూల వృత్తం:
శ్రీ రామాయణ కావ్యగాథగల రాశీభూతమౌ కల్పనల్
సారాంశమ్మున విశ్వసించుటకు సాక్ష్యాధారముల్ లేవనెన్
చారిత్రాత్మక గీటురాయిపయి సంచాలించి చూపించెరా
ధీరుండౌ పరిశోధకుండు ప్రతిభా ధీ రశ్మి మార్తాండుడే
తేటగీతి:
ఆంధ్ర తెలగాణ జీవన వ్యాకరణము
సంస్కృతీ నాగరికతల సౌరభాల
తెలుగు వెలుగుల చీకటి తీరులన్ని
గరిమనాంధ్రుల సాంఘిక చరిత రాసి
కొత్త పరిశోధనకు దారులెత్తి చూపె
తేటగీతి:
భాష సౌందర్య రూపము పరిమళించ
లిపికి సంస్కరణమ్ముల ప్రాపు వలయు
ననుచు చర్చించి నవ సూత్రమునులిఖించె
సురవరమ్ము భాషాశాస్త్ర పరిమళమ్ము
* పాలమూరు కరువు గురించి...
పాలమూరు పల్లెలు
బే చిరాగ్లుగా మారుతున్నయి
పొలాలు బీళ్ళవుతున్నయి
బీటలు వారుతున్నయి
సమాధులవుతున్నయి
ఇది ప్రకృతి ప్రకటించిన కోపమా!
వికటించిన ప్రజా ప్రభుత్వద్యేయమా!
ఆనకట్టలతో అన్నం పెడుతున్న పాలమూరు కూలీ
మెతుకు దూరమై
గొంతు పొలమారిపోయి
గటుక్కుమంటుండడు
దత్తత మంత్రపుష్పాలు
దగాల దడి కడ్తున్నయి
ఆకలి చావులపై మంత్రుల సుభాషితాలు
మనిషితనాన్ని తలదించుకొనేలా చేస్తున్నయి
పొలం పొలంగా మిగలని పాలమూరు
పటంలో గూడా ఊరుగా
మిగలకుండా పోయే రోజొస్తుంది
మనం మేల్కొనకుంటే.
పాలమూరు కవులు<o:p></o:p>
*వల్లభాపురం జనార్ధన
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-78208512703420897422021-02-26T21:15:00.006+05:302021-04-02T13:08:55.444+05:30నేను - నా ఉద్యోగండిగ్రీ అయిపోయే వరకు కూడా పలానా ఉద్యోగమే చేయాలంటూ నాకు పెద్ద కలలేమీ లేవు. మా తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువుకున్నవారేమీ కాదు కాబట్టి నా కలలను నాకే వొదిలేశారు.
ఏదో బొమ్మలు బాగా వేయగలనని, పనికొస్తుందని పది తర్వాత ఇంటర్లో బైపిసీ తీసుకున్నాను. ఆ తర్వాత బి.ఎస్సీ., అంతే.
బతకడానికి ఈ మాత్రం చదువు చాలని, పెట్టే,బేడా సర్దుకుని, అప్పటికే హైదరాబాద్‌లో ఉన్న నా చిన్నప్పటి దోస్తుగాన్ని , నా బతుకుదారిని అన్వేషిస్తూ, నగరానికి వచ్చి పడ్డాను.
ఎస్టీడీ బూతులు, మార్కెటింగ్, నాకొచ్చిన పెయింటింగ్ అన్నీ ప్రయత్నించా, ప్రయోగించా, పనిచేశా. రెండేండ్లు అట్లా నేను నగరానికి అప్పగిస్తే, నాకది ఆకలి, అల్సర్లు, అవమానం బహుమతిగా ఇచ్చింది. ఇక దానితో నాకు, నాతో దానికి పొసగక విడిపోయాం. ఊరికి తిరిగి వచ్చాకా, ఊరికే తిని తిరిగేంత ఆస్తులేమీ లేవు కాబట్టి, అప్పటికి నాకు వచ్చిన, చేతనైన పని చదువుకున్న చదువుతో చదువు చెప్పడం.
అంతే ఓ ఇరవై మంది పిల్లలను పోగేసుకుని చిన్న బడి ఒకటి ప్రారంభించాను. కొంత కాలం గడిచాకా, ప్రభుత్వ బడిలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, కాబట్టి ఆ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చితే, ఈ బడిలోనే ప్యారాటీచర్ గా చేరవచ్చని, ఊరి ఉపాధ్యాయులు చెబితే, పిల్లల తల్లిదండ్రుల అంగీకారంతో బడిలో ప్యారా టీచర్‌గా చేరిపోయాను.
ఎక్కడైతే చదువు నేర్చుకోవడం మొదలు పెట్టానో! అదే చోట చదువు నేర్పటం మొదలుపెట్టాను.
అప్పుడు మొదలైంది అసలు కల.
పిల్లలకు నేర్పడం ద్వారా కలిగిన సంతృప్తి, వచ్చిన గౌరవం నన్ను జీవితంలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోవాలనే కలల వైపు నెట్టింది.
అప్పటికీ డిగ్రీ మాత్రమే పూర్తైంది. అది సరిపోదు. బి.ఎడ్., పూర్తి చేయాలి.
బి. ఎడ్.,లో సీటు అంత తేలికగా దొరక లేదు.
పద్య ప్రభంజనం దేశభక్తి అంశంపై అవుసుల భానుప్రకాశ్ సంపాదకత్వంలో వెలువడిన పద్య బృహత్సంకలనం. ఈ పుస్తకంలో రాష్ట్రేతర
కవుల రచనలు ఉండినప్పటికీ, అవి స్వల్పమే,  తెలంగాణ ఉమ్మడి జిల్లాల కవుల రచనలే అధికం.  సుమారు 610 మంది
కవుల రచనలతో 624 పేజీలతో వెలువడిన బృహత్సంకలనం ఇది.
ఈ గ్రంథాన్ని మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి ప్రచురించింది. ఈ సంకలనం జనవరి 2021 లో వెలువడింది. ఆచార్య కసిరెడ్డి, ఆచార్య బేతవోలు
రామబ్రహ్మం ఈ గ్రంథానికి మార్గదర్శనం చేశారు. <o:p></o:p>
కంది శంకరయ్య, డాక్టర్ అయాచితం
నటేశ్వరశర్మ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దోరవేటి చెన్నయ్య,
గుండు
మధుసూదన్, పి విట్టుబాబు సంపాదక మండలిగా వ్యవహరించారు.<o:p></o:p>
ఆదిలాబాద్ నుండి డాక్టర్ మాడుగుల నారాయణ మూర్తి, కరీంనగర్ నుండి నంది
శ్రీనివాస్, ఖమ్మం నుండి ఎన్. సి. ఎచ్. చక్రవర్తి, నల్గొండ నుండి  సాగర్ల సత్తయ్య, నిజామాబాద్ నుండి  ఎన్. సాయి ప్రసాద్, మహబూబ్ నగర్ నుండి అంబటి
భానుప్రకాష్, బస్వోజు సుధాకర్ ఆచారి,  మెదక్
నుండి వడ్ల రాజయ్య, వర్కోలు లక్ష్మయ్య,  రంగారెడ్డి
నుండి గోగులపాటి కృష్ణమోహన్, జి కృష్ణ గౌడ్,  వరంగల్ నుండి గుండు మధుసూదన్,  హైదరాబాద్ నుండి డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ
శర్మ, రాష్ట్రేతర ప్రాంతాల నుండి పి. విట్టుబాబు జిల్లాల వారి సమన్వయకర్తలుగా
వ్యవహరించి, ఈ పుస్తకం రూపకల్పనలో సహకారాన్ని అందించారు.<o:p></o:p>
అష్టకాల నరసింహ రామశర్మ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య,  డాక్టర్ నందిని సిద్ధారెడ్డి,  డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ,
దేశపతి శ్రీనివాస్, గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు, ఆచార్య సూర్య ధనుంజయ్, ఆచార్య
బన్న అయిలయ్య, డాక్టర్  ఎన్. రఘు,  డాక్టర్ సాగి కమలాకర శర్మ,  డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ లక్ష్మణ
చక్రవర్తి గౌరవ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించారు.<o:p></o:p>
ఈ గ్రంథంలో అనుక్రమణిక ఈ విధముగా ఉన్నది<o:p></o:p>
#ప్రముఖుల ఆశీరభినందనలు,<o:p></o:p>
#పద్య ప్రబోధం- ఆచార్య కసిరెడ్డి,<o:p></o:p>
#కవితా ప్రభంజనం- శ్రీ పెరంబదూరు
రంగాచార్య<o:p></o:p>
#అభినందనం- మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్<o:p></o:p>
#సుస్వాగతం -డాక్టర్ పూసల లింగా గౌడ్<o:p></o:p>
#సంపాదకీయం -అవుసుల భానుప్రకాష్
#ఆదిలాబాద్ జిల్లా కవుల కవిత్వం<o:p></o:p>
#కరీంనగర్ జిల్లా కవుల కవిత్వం <o:p></o:p>
#ఖమ్మం జిల్లా కవుల కవిత్వం<o:p></o:p>
#నల్గొండ జిల్లా కవుల కవిత్వం <o:p></o:p>
#నిజామాబాద్ జిల్లా కవుల కవిత్వం<o:p></o:p>
#మహబూబ్ నగర్ జిల్లా కవుల కవిత్వం <o:p></o:p>
#మెదక్  జిల్లా కవుల కవిత్వం <o:p></o:p>
#రంగారెడ్డి జిల్లా కవుల కవిత్వం<o:p></o:p>
#వరంగల్ జిల్లా కవుల కవిత్వం <o:p></o:p>
#హైదరాబాద్ జిల్లా కవుల కవిత్వం
#రాష్ట్రేతర కవుల కవిత్వం
<o:p> </o:p> పుస్తకావిష్కరణ
జనవరి 24,2021,  రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత భవన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ కవిత గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Naidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6613768697793111013.post-13414480528361997612021-01-20T20:28:00.002+05:302021-01-20T20:28:09.219+05:30The way to wanaparthy || వనపర్తి దారిNaidugari Jayannahttp://www.blogger.com/profile/01545086511465291047noreply@blogger.com0